»   » నాగార్జున, కార్తి సినిమాలో హీరోయిన్ అనుష్క కూడా?

నాగార్జున, కార్తి సినిమాలో హీరోయిన్ అనుష్క కూడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కింగ్ నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్లో పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్, ‘బృందావనం', ‘ఎవడు' చిత్రాల యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ కి సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ యూరఫ్ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క కూడా ఓ ముఖ్య పాత్ర(గెస్ట్ రోల్) లో కనిపించబోతోందట. త్వరలోనే అనుష్క షూటింగులో జాయినవుతుందని తెలుస్తోంది.

యూరఫ్ షూటింగుకు బయల్దేరేముందు నాగార్జున ఈ సినిమా గురించి మాట్లాడుతూ..తెలుగు, తమిళ భాసల్లో రూపొందుతున్న ఈ మూవీ చాలా బాగా వస్తోంది. వంశీ పైడిపల్లి సినిమాని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. నా కెరీర్ లో ఇది చాలా డిఫరెంట్ కమర్షియల్ మూవీ అవుతుంది. పివిపి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా నిర్మిస్తున్నారు అన్నారు.

Anushka Shetty in Nagarjuna-Karthi’s bilingual ?

కార్తి మాట్లాడుతూ...తెలుగులో ఫస్ట్ టైమ్ చేస్తున్న స్ట్రైట్ మూవీ చాలా భారీ లెవల్ లో నిర్మిస్తున్నారు పివిపిగారు. నాగార్జున లాంటి పెద్ద స్టార్ తో కలిసి ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది' అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...‘సినిమా చాలా బాగా వస్తోంది. మా కథకు మండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యే నాగార్జున, కార్తీలతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు. నాగార్జున, కార్తి, తమన్నా, జయసుధ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.'

English summary
Film Nagar source informed that Anushka will soon join the unit to shoot for her cameo role in much awaited multi-starrer which has Nagarjuna and Karthi in the lead roles.
Please Wait while comments are loading...