For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్ : అనుష్క యోగా డివీడి

  By Srikanya
  |

  హైదరాబాద్ : అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ అనే సంగతి తెలిసిందే. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాగూర్ వద్ద ఆమె ఐదు సంవత్సరాలు పనిచేసింది. ఆమె తన అందం సీక్రెట్ యోగా నే అని చెప్తూంటుంది. ప్రతీ రోజు ఆమె యోగా చేస్తానంటుంది. నటిగా కన్నా ఆమె యోగా టీచర్ అనే దానికే ప్రిఫెరెన్స్ ఇస్తానంటోంది.

  రీసెంట్ గా ఆమె ఇరవై కేజీలు ..సైజ్ జీరో చిత్రం కోసం పెరిగి తగ్గింది. స్క్రిప్టు డిమాండ్ మేరకు అతి తక్కువ టైమ్ లో మ్యాజిక్ చేసి చూపించింది. దాంతో చాలా మంది ఆమె సీక్రెట్ అడుతూండటంతో డీవిడి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసుకుంటోంది.

  సింపుల్ గా ఉండే యోగా టిప్స్ తో ఆ డీవిడి ఉండబోతోందని వినికిడి. శిల్పాశెట్టి,బిపాసా బసు తరహాలోనే ఈ యోగా డీవిడిని వదిలి తన అభిమానులను ఆనందపరచనుంది. ఇంతకు ముందు ఆమె పంచాక్షరి చిత్రంలో యోగా క్లాస్ లు నేర్పే టీచర్ గా కనిపించింది. ఆ వీడియో ఇక్కడ చూడండి.

  అనుష్క తాజా చిత్రం సైజ్ జీరో విశేషాలకు వస్తే...

  ‘బాహుబలి' చిత్రంలో దేవసేన పాత్రలో అలరించిన హీరోయిన్ అనుష్క త్వరలోనే వైవిధ్యమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. అలాగే హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో మళ్లీ బరువు తగ్గి నార్మల్ అయింది.

  Anushka Shetty To Launch Her Own Yoga DVD's

  ఇక హీరో ఆర్య ఇటీవల స్వీడన్ మీదుగా కఠినతరమైన సైకిల్ రైడ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సైజ్ జీరో నిర్మాతలు ఈ చిత్రంలో అలాంటి కష్టతరమైన సైక్లింగ్ విన్యాసాలను ఇందులో చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెల మూడి.

  English summary
  Anushka Shetty revealed that she is in plans to release few easy yoga tips and Aasana's in an exclusive DVD, sometime soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X