»   »  నేడు ప్రభాస్‌ను కలవనున్న అనుష్క, ‘సాహో’ కోసం బోల్డ్‌గా...?

నేడు ప్రభాస్‌ను కలవనున్న అనుష్క, ‘సాహో’ కోసం బోల్డ్‌గా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం నేటి నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ ఎవరు? అనేది ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ కాలేదు. అయితే ఈచిత్రంలో హీరోయిన్‌గా నటించేది అనుష్క శెట్టి అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

'సాహో'.... బాహుబలి తర్వాత నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్నచిత్రం. ఆల్రెడీ బాహుబలి ద్వారా ప్రభాస్, అనుష్క ఇండియన్ ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్ జోడీ అయిపోయారు. అందుకే వీరినే 'సాహో'లో రిపీట్ చేద్దామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కాలేదు.


ఈ రోజు నుండే షూటింగ్

ఈ రోజు నుండే షూటింగ్

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు నుండే సాహో షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.


అనుష్క జాయిన్ అవుతుందా?

అనుష్క జాయిన్ అవుతుందా?

అనుష్క ఈ రోజు షూటింగులో ప్రభాస్ తో కలిసి జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు అఫీషియల్ సమాచారం ఏమీ లేక పోవడంతో..... ఈ విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు.


ప్రభాస్ డిఫరెంట్ అవతార్

ప్రభాస్ డిఫరెంట్ అవతార్

ప్రభాస్ ‘సాహో' చిత్రంలో పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడని, ఇన్నాళ్లు మనం బాహుబలి అవతారంలో ప్రభాస్ ను చూసాం.... ఈచిత్రంలో ఆయన లుక్ టోటల్ డిఫరెంటుగా ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.


సాహోలో బోల్డ్ గా నటించనున్న అనుష్క

సాహోలో బోల్డ్ గా నటించనున్న అనుష్క

బాహుబలి సినిమాలో సారీస్, లెహంగాల్లో కనిపించిన అనుష్క ఈచిత్రంలో టోటల్ మోడ్రన్ లుక్ లో కనిపించబోతోందని.... ప్రభాస్‍‌కు పెర్ఫెక్ట్ జోడీగా అనుష్క ఉంటుందని సమాచారం.


సాహో తర్వాత ఏంటి?

సాహో తర్వాత ఏంటి?

సాహో సినిమా తర్వాత ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదని, చర్చల దశలోనే ఉన్నట్లు సమాచారం. అన్నీ ఓకే అయితే ప్రభాస్‌తో కమర్షియల్ మూవీ తీసేందుకు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నాడు.English summary
It's time to rejoice! If recent rumours are anything to go by, Prabhas and Anushka Shetty will start the shooting of Saaho today. The two were last seen as Aamarendra Baahubali and Devasena in the blockbuster movie Baahubali 2. Earlier, it was reported that the makers wanted a Bollywood face to romance Prabhas in the movie but it seems that after seeing the hype around them, the makers have decided to repeat the magical jodi of Anushka and Prabhas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu