»   » ‘భాగమతి’ తర్వాత ఎట్టకేలకు మరో సినిమాకు సైన్ చేసిన అనుష్క!

‘భాగమతి’ తర్వాత ఎట్టకేలకు మరో సినిమాకు సైన్ చేసిన అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించకుండా ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. 'భాగమంతి' తర్వాత ఆమె ఏ ప్రాజెక్టుకు సైన్ చేయక పోవడం, హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయ పర్యటనకు వెళ్లడం లాంటివి చేయడంతో ఆమె పెళ్లికి సిద్ధం అవుతోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే అనుష్క పెళ్లి ఆలోచనలో లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నమాట.

'భాగమతి' సినిమా కోసం కాస్త బరువు పెరిగిన అనుష్క కొన్ని రోజులుగా వెయిట్ లాస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అందుకే ఏ సినిమాకు సైన్ చేయలేదని, మళ్లీ సినిమా కథలు వింటున్నారని, నెక్ట్స్ మూవీకి సైన్ చేసిందని టాక్.

Anushka signed up for Gopichand’s next

గోపీచంద్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం కోసం అనుష్కను సంప్రదించారని, కథ నచ్చడంతో ఆమె వెంటనే ఒకే చెప్పిందని తెలుస్తోంది. ఇంతకు ముందు గోపీచంద్-అనుష్క కాంబినేషన్లో లక్ష్యం, శౌర్యం చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం గోపీచంద్ 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే జయేంద్ర దర్శకత్వంలో అనుష్క హీరోయిన్‌గా సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.

English summary
According to the Tollywood circles, Anushka signed up for Gopichand’s next project which will be helmed by Jayendra. This is the third time after Lakshyam and Shouryam, Anushka is going to romance Gopichand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X