twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ కు ముందంతా మంచి కాలమే.. టికెట్ రేట్ల కమిటీ రిపోర్ట్ లీక్.. ఎంత పెంచుకోవచ్చంటే?

    |

    చాలా కాలం నుంచి ఏపీలో టికెట్ రేట్ల విషయంలో టెన్షన్ పడుతున్న టాలీవుడ్‌కు గుడ్‌ న్యూస్‌ వినిపించే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాల థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచాలని టికెట్ రేట్ల పెంపు కోసం ఏపీ ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు ఇచ్చినట్టు తెలుగు మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాలు

    రేట్లు మాత్రం పెరగాలని

    రేట్లు మాత్రం పెరగాలని


    ఏపీలో సినిమా టికెట్ల రేటు నిర్ధారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదికపై ఇప్పుడు తుది చర్చలు జరగనున్నాయి. మంగళవారం నాడు సీఎం జగన్‌తో సమావేశమైన మంత్రి పేర్నినాని, సుదీర్ఘంగా సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. అయితే ఇప్పుడు బుధవారం మరో సారి జగన్ తో పేర్ని నాని భేటీ కానున్నారు. గురువారం నాడు సీఎం జగన్ తో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఅర్ సమావేశం కానున్న క్రమంలో కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చింది.

    రేట్లు పెరగాలని

    రేట్లు పెరగాలని

    కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే మల్టీప్లెక్స్‌ టికెట్ల రేట్లలో పెద్దగా తేడాల్లేవు కానీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు మాత్రం పెరగాలని రిపోర్టులో పేర్కొన్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం.. ప్రాంతం ఏదైనా సరే, నాన్‌ ఏసీ థియేటర్లు ఎక్కడున్నా సరే కనీస టికెట్ ధర 30 రూపాయలు ఉండాలని పేర్కొన్నది. అదే సమయంలో జీవో నెంబర్ 35 ప్రకారం అది కేవలం 5 రూపాయలు మాత్రమే ఉంది.

    జీవో నెంబర్ 35 ప్రకారం

    జీవో నెంబర్ 35 ప్రకారం


    అంటే ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ప్రకారం 25 రూపాయలు యాడ్ కానుంది. ఇక నాన్‌ ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్‌ను.. 70 రూపాయలు పెంచాలని రిపోర్ట్ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 35 ప్రకారం ఏసీ సినిమా హాళ్లు గ్రామపంచాయతీలో కనిష్టంగా 10, గరిష్టంగా 20 రూపాయలుంది. అదే నగర పంచాయతీల్లో కనిష్టంగా 15, గరిష్టంగా 35, మున్సిపాలిటీల్లో తక్కువగా 40, ప్రీమియం టికెట్‌ రేట్ 100గా నియమించారు.

    కొత్త లెక్కల ప్రకారం

    కొత్త లెక్కల ప్రకారం


    ఇక రేట్లు సవరించాలని కమిటీ చెప్పిన కొత్త లెక్కల ప్రకారం ఏసీ థియేటర్‌లో మినిమమ్ 40 రూపాయలు ఛార్జ్, అత్యధికంగా 150 రూపాయలు అమ్ముకునేలా పర్మిషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని మల్టీప్లెక్సుల విషయానికొస్తే.. టాప్ టు బాటమ్ ఒకటే టికెట్ కాకుండా.. కచ్చితంగా ప్రీమియం, డీలక్స్, ఎకానమీ క్లాస్‌లు ఉండాలని కమిటీపేర్కొంది. మల్టీప్లెక్సుల్లో ఇప్పటికే జీవో ప్రకారం అత్యధిక ధర 250 రూపాయల వరకు ఉంది కాబట్టి దానిలో ఎలాంటి ఇబ్బంది ఉండదనే భావిస్తున్నారు.

    Recommended Video

    Indirect Tweet On Ys Jagan, Tollywood Directors Twitter Battle | Filmibeat Telugu
     క్లారిటీ వచ్చే అవకాశం

    క్లారిటీ వచ్చే అవకాశం

    ఇక కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో రెండు కీలక అంశాలు సినీ వర్గాలకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఒక అంశం ఏమో రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వమని చెప్పడం. అలాగే ఆ రెండో అంశం ఏమిటంటే జీవో నెంబర్ నెంబర్ 35 ప్రకారం థియేటర్లను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీలుగా విభజించారు. కానీ కమిటీ మాత్రం ఈ విభజనలు వద్దని సలహా ఇచ్చింది. ఈ రిపోర్ట్‌ ని బట్టే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని జగన్ తో భేటీ అవుతారు. చిరంజీవి ఆధ్వర్యంలో జరిగే భేటీలో ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    English summary
    AP Government Committee on ticket rates Suggested hiking prices
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X