twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు.. అది ధర్మమా అంటూ ఘాటుగా స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ

    |

    ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా టికెట్ల తగ్గింపు వ్యవహారం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సినిమా టికెట్ల ధర గణనీయంగా తగ్గించడం, ప్రత్యేక షోలకు, టికెట్ రేట్ల పెంపుకు ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడం సినీ, రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. శ్యామ్ సింగరాయ్ విడుదలకు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నాని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. నాని ఏమని కామెంట్ చేశారు? మంత్రి బొత్స ఏమని సమాధానం ఇచ్చారంటే..

    Recommended Video

    AP Movie Theaters లో సోదాలు .. మూసివేత| Movie Ticket Prices| Nani
    శ్యామ్ సింగరాయ్ ప్రెస్ మీట్‌లో నాని

    శ్యామ్ సింగరాయ్ ప్రెస్ మీట్‌లో నాని

    డిసెంబర్ 24వ తేదీన శ్యామ్ సింగరాయ్ విడుదల అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి, దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్, నిర్మాత వెంకట్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఏపీలో టికెట్ ధరలు తగ్గింపు సరికాదు. థియేటర్లలో కౌంటర్లలో వచ్చే ఆదాయం.. కిరాణ కొట్టు కౌంటర్ కంటే తక్కువగా ఉంది. ఏపీ ప్రభుత్వ విధానాలు సరిగా లేవు అనే విధంగా నాని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ప్రేక్షకుడికి అందుబాటులో టికెట్ ధర

    ప్రేక్షకుడికి అందుబాటులో టికెట్ ధర

    నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా సినిమా థియేటర్లపై దాడులు చేస్తున్నామనే ఆరోపణ సరికాదు. నిన్న డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నన్ను కలిశారు. ఏదో జరిగింది.. జరిగిపోయింది. మా వాళ్లు తప్పుగా ఏదో మాట్లాడారు పట్టించుకోవద్దని చెప్పారు. సినిమా అనేది సామాజిక వినోద మాధ్యమం.

    ప్రేక్షకులందరికి అందుబాటులో ఉంచాలనేది ఏపీ ప్రభుత్వ విధానం. ఎక్కువ టికెట్ ధర పెడితే అది అందని వస్తువుగా ఉంటే కరెక్ట్ కాదని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే థియేటర్లలో ఉండే సదుపాయలను, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని రేటు విధించాం.

    ఒకవేళ మా విధానం గిట్టుబాటు కాకపోతే మా వద్దకు వచ్చి ఏదైనా సర్దుబాటు చేయమంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంది అని బోత్స సత్యనారాయణ అన్నారు.

    రెండు, మూడు రెట్లు పెంచడం ధర్మమా?

    రెండు, మూడు రెట్లు పెంచడం ధర్మమా?

    అయితే ప్రభుత్వ విధానంపై వ్యతిరేకత చూపుతూ.. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకోండి. టికెట్ రేట్లు రెండు, మూడు రెట్లు పెంచి అమ్మితే ధర్మమా? టికెట్లు రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం తప్పు కాదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించాడు. ప్రభుత్వ విధానాలు, చట్టాలను అనుసరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందనే అభిప్రాయాన్ని బొత్స సత్యనారాయణ వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు అమలు చేస్తున్నారని చెప్పారు.

    సినిమా టికెట్‌కు ఎమ్మార్పీ ఉండకూడదా?

    సినిమా టికెట్‌కు ఎమ్మార్పీ ఉండకూడదా?

    కరోనా సమయంలో థియేటర్ యాజమాన్యాలు నష్టపోయారనేది నిజమే. అయితే మా వద్దకు వచ్చి ఈ రేటు కావాలి? సంవత్సరంపాటు మా ఇష్టం ఉన్న రేట్లకు అమ్ముకొంటాం. మాకు అనుమతి ఇవ్వమని అడిగితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉండేదేమో. ప్రతీ విషయానికి ఓ పరిమితి అనేది ఉంటుంది. బజారుకు వెళ్లి ఏ వస్తువు కొంటే దానికి ఎమ్‌ఆర్పీ ఉంటుంది. కనీస ధరను నిర్ణయించడం అనేది ప్రతీ వస్తువుకు ఉంటుంది. టికెట్‌కు ఒక ఎమ్మార్పీ ఉండకూడదా. భారత దేశంలో ఎమ్మార్పి లేకుండా ఏదైనా వస్తువు ఉందా? సినిమా టికెట్లకు మినహాయింపు ఎందుకు ఇవ్వాలి అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

     ప్రేక్షకులకు అవమానం ఎలా?

    ప్రేక్షకులకు అవమానం ఎలా?

    టికెట్ రేట్లు తగ్గించి ఏపీ ప్రభుత్వం ప్రేక్షకులను అవమానించిందని చెప్పడం సరికాదు. టికెట్ ధర తక్కువ ఉంటే ప్రేక్షకులకు మేలు చేసినట్టు అవుతుంది. ఈ విషయంపై నేను చర్చకు అవకాశం ఇవ్వను. ఒకవేళ సినీ పరిశ్రమకు ఇబ్బంది ఉంటే ప్రభుత్వాన్ని వేడుకొంటే.. దానికి ఓ పరిష్కారం ఉండేది. ప్రతీ వస్తువుకు ధర ఉంటుంది. సినిమా టికెట్‌కు కూడా చట్ట ప్రకారం ధరను ప్రభుత్వ నిర్ణయించింది అని నాని వ్యాఖ్యలపై ఘాటుగా బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.

    English summary
    Movie Ticket rates issue become hot topic in Andhra Pradesh. In this occasion, Nani sensational comments on YS Jagan's Andhra Pradesh Government over Ticket Rate issue. In This occasion, AP Minister Botsa Satyanarayana Strong reaction on Nani Comments in Shyam Singha Roy press meet
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X