»   » టెంపర్: రేప్ సీన్ చేయడంపై ఆమె దైర్యంగా...

టెంపర్: రేప్ సీన్ చేయడంపై ఆమె దైర్యంగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, పూరి డైరెక్షన్ ఒక వైపు అయితే....సినిమాలో కీలకమైన సన్నివేశంగా ఉన్నరేప్ సీన్ ఓ వైపు. ఈ సన్నివేశాన్ని అత్యంత క్రూరంగా చిత్రీకరించారు. సినిమా చూసే ప్రేక్షకులను ఎమోషన్‌కు గురి చేసే సన్నివేశం ఇది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అసలు అలాంటి సన్నివేశాల్లో నటించడానికి గట్స్ కావాలి. అనుభవం ఉన్న ఆర్టిస్టులే ఇలాంటి సీన్లు చేయడానికి ఇబ్బంది పడతారు. అలాంటిది తొలి అవకాశంలోనే ఇలాంటి సీన్ చేయడానికి ఒప్పుకోవడం, పర్ ఫెక్టుగా నటించడం గొప్పవిషయమనే చెప్పాలి. టెంపర్ సినిమాలో రేప్ విక్టిమ్ పాత్ర పోషించింది హైదరాబాదీ గర్ల్ అపూర్వ శ్రీనివాసన్.


Apoorva about Temper rape scene

జర్నలిజం, ఇంటీరియల్ డిజైనింగులో డిగ్రీ చేసిన అపూర్వ 2012 హైదరాబాద్ లో జరిగిన బ్యూటీ కాంటెస్టు విన్నర్ కూడా. తర్వాత ఆమెకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ ఫోన్ చేసి ఈ పాత్ర గురించి చెప్పడంతో చాలెంజింగుగా తీసుకున్న అపూర్వ వెంటనే ఓకే చెప్పేసి నటించింది.


తన పాత్ర గురించి అపూర్వ స్పందిస్తూ...‘టెంపర్ చిత్రంలో నా ఫ్రెండ్స్ నేను చేసిన పాత్ర చూసి షాక్ అయ్యారు. అది ఒక అసాధారణమైన పాత్ర. నా పాత్ర చిత్రీకరణ ఐదు రోజుల పాటు సాగింది. నేను తెరంగ్రేటం చేయడంపై మా మదర్ చాలా ఎగ్జైట్మెంటుతో ఉన్నారు' అని చెప్పుకొచ్చారు.

English summary
Apoorva herself says "My friends who saw Temper got shocked by the role I've done. It's an unusual role, which I've shot for barely five days. My mother was more excited for my debut."
Please Wait while comments are loading...