»   » ‘అప్పట్లో ఒకడుండేవాడు’... ట్రైలర్ అదిరింది (వీడియో)

‘అప్పట్లో ఒకడుండేవాడు’... ట్రైలర్ అదిరింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు'. 'అయ్యారే' ఫేం సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Appatlo Okadundevadu Theatrical Trailer

వశిష్ఠ మూవీస్‌ పతాకంపై హరివర్మ, సన్నీరాజ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్‌ ముస్లిం యువకుడిగా కనిపించబోతున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1992-96 మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో చోటు చేసుకొన్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.

'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' చిత్రంలో రాయల్‌ రాజుగా నటించి మెప్పించిన శ్రీవిష్ణు ఇందులో మరో హీరో గా నటిస్తున్నారు. పోసాని కృష్ణమురళీ, రాజీవ్‌ కనకాల, రఘు కారుమంచి, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, కెమెరా: నవీన్‌ యాదవ్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌.

English summary
Appatlo Okadundevadu 2016 Telugu movie theatrical trailer. AppatloOkadundevadu, starring Nara Rohit, Tanya Hope, Sree Vishnu, Posani Krishna Murali, Prabhas Srinu, Rajiv Kanakala and Raghu Karumanchi. Directed by Sagar K Chandra. Produced by Prashanti & KrishnaVijay under the banner of Aran Media Works. Music composed by Sai Karthik.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu