»   » ఇంటర్వ్యూ: 'అప్పట్లో ఒక్కడుండేవాడు' తెర వెనక కథపై డైరెక్టర్

ఇంటర్వ్యూ: 'అప్పట్లో ఒక్కడుండేవాడు' తెర వెనక కథపై డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సాగర్ కె. చంద్రను ఒన్ ఇండియా తెలుగు కోసం ప్రత్యేకంగా వేణు ఊడుగుల ఇంటర్వ్యూ చేశారు. వేణు ఊడుగుల మంచి కవి. తెలుగు సాహిత్యంలో ఆ రకంగా ఆయనకో గుర్తింపు ఉంది. అదే సమయంలో ఆయన నీదీ నాదీ ఒకే కథ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. అది త్వరలో విడుదల కాబోతోంది. ఇంటర్వ్యూ విశేషాలు చదవండి......

  హైదరాబాద్: తెలుగులో అప్పట్లో ఒక్కడుండేవాడు సినిమా ఓ సంచలనమే సృష్టించింది. ఈ సినిమా దర్శకుడు సాగర్ కె చంద్ర కాకలు తీరినవాడేమీ కాదు. అంతకు ముందు అయ్యారే అనే సినిమా మాత్రమే చేశాడు. కానీ ఒప్పట్లో ఒక్కడుండేవాడు సినిమా ద్వారా తెలుగు సినిమాపై అతను ఆశలు కల్పిస్తున్నాడు.


  మాస్ సినిమాలు తప్ప ప్రేక్షకులు చూడరనే స్థిరాభిప్రాయాన్ని ఆ సినిమా ద్వారా అతను బద్దలు కొట్టాడు. కమర్షియల్, సీరియస్ సినిమా మధ్య హద్దులు చెరిపేస్తూ హిందీలో అమీర్ ఖాన్ వంటి వారు ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నా తెలుగువారి దృష్టి ఆ వైపు వెళ్లలేదు.


  కానీ సాగర్ అత్యంత సాహసంతో ఓ ప్రయోజనాత్మక చిత్రాన్ని తీసి విజయం సాధించవచ్చునని నిరూపించారు. ఈ సినిమాను సమర్పించడానికి నారా రోహిత్ అంగీకరించడం కూడా గొప్ప విషయమే. ఇది తెలుగు సినిమాకు శుభసూచకంగా కనిపిస్తోంది.


  ఈ తరుణంలో సాగర్ కె. చంద్రను ఒన్ ఇండియా తెలుగు కోసం ప్రత్యేకంగా వేణు ఊడుగుల ఇంటర్వ్యూ చేశారు. వేణు ఊడుగుల మంచి కవి. తెలుగు సాహిత్యంలో ఆ రకంగా ఆయనకో గుర్తింపు ఉంది. అదే సమయంలో నారా రోహిత్ నిర్మిస్తున్న నీదీ నాదీ ఒకే కథ అనే సినిమాకు కథను అందించి దర్శకత్వం కూడా వహించాడు. అది త్వరలో విడుదల కాబోతోంది. ఇంటర్వ్యూ విశేషాలు చదవండి......


  అన్నీ కలిసొచ్చి..: అప్పట్లో ఒక్కడుండేవాడు డైరెక్టర్ ఇంటర్వ్యూ....


  టైటిల్ అలా వచ్చేసింది...

  టైటిల్ అలా వచ్చేసింది...

  1.ఈ సినిమా టైటిలే డైరెక్టర్ టేస్ట్ ని రిప్రజెంట్ చేసే మెటాఫర్ . అసలు ఎలా తట్టింది ఈ టైటిల్?


  - మనం పాస్ట్ లో జరిగిన కథ చెప్పేప్పుడు ....మనం మామూలుగా ఐతే ఎలా మొదలు పెడుతాం... ఆరే అప్పట్లో ఒకడుండేవాడు బై అని స్టార్ట్ చేస్తూంటామ్ కదా . అలా నేను శ్రీ విష్ణు తో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు అలా వచ్చేసిందంతే...ఒక స్పార్క్ లా. మనం యే చెట్టు కిందో మౌనంగా కూర్చుని ఉన్నప్పుడు అనుకోకుండా ఓ కోయిల కూత వినిపిస్తే ఎలా ఫీలవుతామో... అలా ఫీలయ్యాను . Poetic గా ఉందనిపించింది. ఎలాగూ నైంటీస్ లో ఉండేవాడి కథ కాబట్టి సినిమాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది.  ఈ ప్రాంతానికి ఓ ఆటిట్యూడ్ ఉంది...

  ఈ ప్రాంతానికి ఓ ఆటిట్యూడ్ ఉంది...

  2.చైల్డ్ హుడ్ లో సినిమా దిశగా మీ ప్రభావాల గురించి చెప్పండి?


  - బేసిగ్గా నేను పుట్టి పెరిగింది నల్గొండ లో . తెలుసు కదా ఈ ప్రాంతానికి ఒక ఆటిట్యూడ్ ఉంటుంది. ఎప్పుడూ హ్యాజిటెడ్ మూడ్ లో ఉంటుంది. ఇక్కడ కళలు సాహిత్యం అంతా సామాజిక ప్రయోజనం కోసమే. చిందు యక్షగానం, బాగోతం లాంటి సంప్రదాయ ఆర్ట్ ఫాంస్ ఉన్నా మనం వాటిని వేరే లెవల్లో యాక్సెప్ట్ చేస్తాం తప్ప ... రికార్డింగ్ డ్యాన్స్‌ల లాంటి వాటిని చూసినట్టుగా ఎంటర్టైన్ మోడ్ లో చూడం. అందుకే సినిమా ప్రభావం అస్సల్ లేదు చిన్నప్పుడు.సినిమాలు జస్ట్ చూడ్డం వరకే కానీ ,ఫిల్మ్ మేకింగ్ అనేది అసలు మనకు సంబంధించిన వ్యవహారం కాదు అనేట్టు ఉండేది. ఆ తర్వాత ఇంజినీరింగ్ చేసేప్పుడు మాత్రం కొంత తెలియకుండానే సినిమాపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను యూ‌ఎస్ లో ఎం‌ఎస్ చేసేప్పుడు film is my destiny అని అర్ధమైంది. సో వెంటనే మా యూనివర్సిటీ లో(యూ‌ఎస్) ఉన్న ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయిపోయాను. గుడ్ ఫిల్మ్స్ చూడటం,షార్ట్ స్టోరీస్ రాయటం,చదవటం ....ఆ తర్వాత ఇక్కడికొచ్చి రవి బాబు గారి దగ్గర్ అసిస్టెంట్ గా జాయిన్ అవడం....అలా స్టార్ట్ అయింది ఫిల్మ్ జర్నీ.  కథ లైన్ అలా వచ్చేసింది...

  కథ లైన్ అలా వచ్చేసింది...

  3. మీరేం మంకీ డైరెక్టర్ కాదని తెలుసు ...ఐనా అడుగుతున్నాను చెప్పండి యూ‌ఎస్ రిటర్న్ కదా మీరు... సేఫ్ గా యే రెగ్యులర్ సినిమానో తియ్యకుండా ఎందుకింత సీరియెస్ అటెమ్ప్ట్ ని చూస్ చేసుకున్నారు?


  - కథ రాసే ప్రాసెస్ లో కామన్ గా మనం ఏం చేస్తాం, చూసిన సినిమాలను,చదివిన పుస్తకాలను గుర్తు చేసుకుంటాం. వాటితో పాటు చిన్నప్పటి నుండి మనకున్న సోషల్ ఎక్స్పీరియెన్స్ ని గుర్తు చేసుకుంటాం. అలాంటి సిచ్యువేషన్ లో నా క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గుర్తొచ్చాడు ...అతని మీద జరిగిన అటాక్ గుర్తుకొచ్చింది. ఒక నక్సలైట్ సానుభూతి పరుడు గుర్తొచ్చాడు . పొద్దునలేస్తే చాలు యే మానవ హక్కుల ఉద్యమకారుడో శవమై క్రైమ్ వార్తల్లో మెదిలే రోజులు గుర్తొచ్చాయి. డాక్టరో ఇంజనీరో కావల్సిన యంగ్ స్టర్స్ స్టేట్ హింస కి ఏమీ కాకుండా పోయిన కేసులు గుర్తొచ్చాయి. వీళ్ళందరి కథలు మనం చెప్పొచ్చు కదా అనిపించింది . అలా రకరకాలుగా ఆలోచిస్తోన్న టైమ్ లో ఈ లైన్ తట్టింది. ఈ ప్రిమైజ్ శ్రీ విష్ణు ను బాగా టెమ్ప్ట్ చేసింది. సొ అలా అలా జరిగిపోయింది. కానీ ఒక్కటైనా రోమ్ కామ్ తీయాలని ఉంది .నెక్స్ట్ ట్రై చేస్తాను.  హైదరాబాద్‌నే ఓ క్యారెక్టర్‌గా...

  హైదరాబాద్‌నే ఓ క్యారెక్టర్‌గా...

  4 . ఆసిఫ్ జాహీ యుగం నుండి ఇప్పటి వరకు ఎంతోమందిని ఆదరిస్తోన్న సెక్యులర్ మదర్ హైదరాబాద్. ఇప్పుడు మీ "అప్పట్లో ఓకడుండేవాడు" సినిమాలో కూడా ఒక important element హైదరాబాద్ . అసలు ఈ సిటీ ని మీ సినిమాలో లొకేట్ చేయాలని ఎందుకనిపించింది? హైదరాబాద్ కు మీకు ఉన్న ఎమోషనల్ ఆటాచ్మెంట్ గురించి?


  - మా నల్గొండ హైదరాబాద్ కి చాలా దగ్గరిలో ఉండటం వల్ల కావొచ్చు. చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తూ వెళ్ళటం తరుచూ గా జరుగుతూ ఉంటుంది. నాకు బేసిగ్గా చరిత్ర అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ కి ఒక గొప్ప చరిత్ర ఉండటం కూడా నాకు ఈ నగరం మీద ప్రేమ ఉండాటానికి ఒక కారణం. మీరన్నట్టు ఎంతో మందిని అదరిస్తోన్న సెక్యులర్ మదర్ హైదరాబాద్ . ఇక్కడి గంగా జమునా తెహాజీబ్ సంస్కృతి కి ,ఇక్కడి కల్చరల్ ఎన్విరాల్ మెంట్ కి నేను బాగా influence అయ్యాను. ఇక్కడి ఇస్లాం మిక్స్డ్ లాంగ్వేజ్ ఇంకా ఇష్టం. అందుకే నారా రోహిత్ పాత్ర(ఇంతియాజ్ అలీ) చేత "హలాల్ (పవిత్రం) , హరామ్(అపవిత్రం) లాంటి పదాలు అనిపించాను. కథ అవసరార్దమే అనుకోండి. ఆ టైమ్ లో బాబ్రీ మసీద్ కూల్చివేత, స్టాంప్స్ కుంభకోణం ,నక్సలిజం,రియల్ ఎస్టేట్ దందా స్టార్ట్ అవటం.. . ఇలా దేశంలో జరిగిన నైంటీస్ మేజర్ ఇన్సిడెంట్స్ కి హైదరాబాద్ రిలేట్ అయి ఉండటం వలన స్టోరీ ప్లేస్ మెంట్ ఇక్కడ చెయ్యటమే కరెక్ట్ అనిపించింది . సినిమాలో హైదరాబాద్ ని ఒక క్యారెక్టర్ లా వాడుకున్నందుకు కథలో ఒక మంచి వాతావరణం ఏర్పడింది.  అలా అందుకే చేశాను...

  అలా అందుకే చేశాను...

  5 . నక్సలైట్స్ ,పోలీస్ ల మధ్య జరిగే రక్తపాతం వల్ల "పల్లె ఎప్పుడు తెల్లవారుతుందా" అన్నట్టు ఉండేది ఒకప్పుడు .
  రైల్వే రాజు అనే సూడో రియలిస్టిక్ కారెక్టర్ తో పాటు అనేక కుటుంబాలు బలైనయి .ఈ పరిస్తితిని తెరకెక్కించే ప్రాసెస్ లో మీరు సినిమాలో Telangana identity కి క్లోజ్ గా వెళ్ళారనుకోవచ్చా?


  - కావాలని జరిగింది కాదు .ఇదే కథను బాలివుడ్ లో తీస్తే దావూద్ ఇబ్రాహీం లాంటి మాఫీయాను అడ్రెస్స్ చేయాల్సి వచ్చేది. రైల్వే రాజు కుటుంబం అప్పుడు మాఫియాకి విక్టిమ్ అయ్యేది . మనం తీసింది తెలుగు సినిమా కాబట్టి అప్పటి స్టేట్ వయొలెన్స్ ని అడ్రెస్ చేశాను. రైల్వే రాజు కుటంబాన్ని స్టేట్ పాలసీ లకి విక్టిమ్ చేశాను.  దాన్ని పాజిటివ్‌గా తీసుకోవచ్చు...

  దాన్ని పాజిటివ్‌గా తీసుకోవచ్చు...

  6. గ్లోబలైజేషన్ తర్వాత దేశంలో లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో సాలిడ్ చేంజెస్ వచ్చాయి. ఇక సోషల్ మీడియా వచ్చాక ఆ ఛేంజ్ ఇంకో స్థాయికి వెళ్లింది. షార్ట్ కట్ జమాన అయిపోయింది. గుర్తుందా నీకు... మొన్న మనం ఒక రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు ఒక అమ్మాయి 1 C.B (chicken biryani) and 1M.B(mutton biryani) అని ఫుడ్ ఆర్డర్ చేస్తోంది. అయితే ఈ ఛేంజ్ ప్రభావం తెలుగు సినిమా డైలాగ్స్ పై ఎంత ఉంది ?


  - (నవ్వి) సినిమా డైలాగ్స్ లో ఆ ప్రభావం చాలా ఉంది. పాత సినిమాలో ఉండే ఉపమానాలకు ఇప్పటి ఉపమానాలకు చాలా తేడా ఉంది. ఎక్సాంపుల్ కి పాత సినిమాల్లో "చలివిడి ముద్ద మొహామోడా" అని అనేవారు మొన్న ఎక్కడో చూశాను "మూసేసిన ఆర్కుట్ మొహామోడా" అని. అంతెందుకు మనం మన అసిస్టెంట్ డైరెక్టర్స్ ని ఇప్పుడు A.D's అని పిలుచుకుంటున్నం కదా.అలా డైలాగ్స్ లో చాలా మార్పులొచ్చాయి. మనం మన తెలుగు ని ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా వస్తూనే ఉంటాయి... అలా రావటం సహజమైపోయింది. ఈ ఫ్లో ని పాజిటీవ్ గా తీసుకోవచ్చు.  పివిని ప్రజలు మరిచిపోలేదు...

  పివిని ప్రజలు మరిచిపోలేదు...

  7. గ్లోబలైజేషన్ కి ఆర్ధిక సంస్కరణలకు ఆధ్యుడైన మన పి‌వి నరిసింహ రావ్ ని అటు నార్త్ ఇండియా పట్టించుకోలేదు. ఇటు సౌత్ ఇండియా పట్టించుకోలేదు. అసలు యే ఆర్ట్ ఫాంస్ లో కూడా అతన్ని కనెక్ట్ చేయలేదు. అలాంటిది ఇంతకాలానికి మీ సినిమా అతన్ని హత్తుకుంది.పి‌వి కి ఈ సినిమా స్మాల్ ట్రిబ్యూట్ అనుకోవచ్చా ?


  - యెస్ , స్మాలెస్ట్ ట్రిబ్యూ అనుకోవచ్చు. అయితే పి‌వి ని స్టేట్స్ మరిచిపోయావెమో గానీ జనాలు యేమీ మరిచిపోలేదు. అంతెందుకు నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్ళం. ఈ ఎలక్ట్రాన్ డివైస్ లు రకరకాల గాడ్జెట్స్ లు వాడుకుంటూ ఎక్కడెక్కడో చదువుకుంటూ , మల్టీ నేషనల్ కంపెనీస్ లలో ఉధ్యోగాలు చేస్తూ అంతో ఇంతో క్వాలిటి లైఫ్ ని లీడ్ చేస్తున్నాం గానీ అసల్ ఆ పి‌వి నరిసింహ రావ్ లేకపోతే మన బతుకులు ఎట్లుండేదిబై ...అని. పైగా కథకు కూడా అవసరం కాబట్టి పెట్టాము. ఇంకో విషయం ఏంటంటే పి‌వి నరసింహ రావ్ రైటర్ గా కూడా నాకు చాలా ఇష్టం. "inaction is also a kind of action" అన్నాడెక్కడో . ఎంత బాగుందిది. మనం ఏం చెయ్యకపోయినా కూడా ఒక రకంగా చేసినట్టే అట. ఇంకొకటి... "when I don't take a action it Does'nt mean that I don't think about it" అన్నడు. I loved it . పి‌వి తో పాటు రామ్ గోపాల్ వర్మ , నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ లకు కూడా ట్రిబ్యూట్ అనుకోవచ్చు( వాళ్ళ సినిమాల పాటలను ,ఆ కాలం లో వాళ్ళ సినిమాల ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమాలో కనిపిస్తాయి).  అలా అలసిపోయాం, రోహిత్‌కు నచ్చింది...

  అలా అలసిపోయాం, రోహిత్‌కు నచ్చింది...

  8 .గత మూడున్నర సంవత్సరాలుగా మీరు శ్రీ విష్ణు ,నారా రోహిత్ లతో ట్రావెల్ చేస్తున్నారు కదా... చెప్పండి మీ జర్నీ గురించి?


  - శ్రీ విష్ణు కి మంచి జడ్జ్ మెంట్ ఉంది....టేస్ట్ ఉంది. యక్చుయల్లీ అతను డైరెక్టర్ అవుదామని కథలు రాసుకుని ఇండస్ట్రీకి వచ్చాడు కదా... సొ అతనికి రైటింగ్ వాల్యు తెలుసు. ఎలాంటి సబ్జెక్ట్స్ అటెమ్ప్ట్ చేస్తే తను నిలదొక్కుకోగలడో తనకు తెలుసు. మేమిద్దరం కలిసి ప్రొడ్యూసర్ల కోసం తిరిగీ తిరిగీ అలిసిపోయాం. రెండు మూడు సార్లు ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం...ఆఫీస్ ఓపెన్ చెయ్యటం ... ఆగిపోవటం. అమ్మో హారెబుల్. జనాలు మమ్మల్ని చూసి జాలిపడేవారు. అది ఇంకా పేయిన్ ఫుల్ గా ఉండేది మాకు. మా వెల్ విషర్స్ కూడా ఈ స్క్రిప్ట్ ని నమ్మలేదు. "ఆ కథ పక్కన పెట్టి వేరే కథ చేసుకోండీ ... ఎవడిక్కావాలండీ ఆ సోదంతా ... తెలుగు లో అస్సల్ వర్కౌట్ అవ్వదు" అనేవారు. అయినా ఎక్కడా మేము కాన్ఫిడెంట్స్ ని కోల్పోలేదు. అల్మోస్ట్ రెండు సంవత్సరాలు నన్ను నిన్ను ఇద్దరినీ పట్టుకుని తెగ తిరిగాడు. చివరకు రోహిత్ గారే మన రెండు కథలు విని ఇంప్రెస్ అయ్యాడు. ARAN MEDIA WORKS ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి ఈ రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు.  రోహిత్ చేయడం గొప్ప విషయం...

  రోహిత్ చేయడం గొప్ప విషయం...

  9 .కల్ట్ కంటెంట్ ఉన్న కథని నారా రోహిత్ గారు అండ్ శ్రీ విష్ణు ఎలా నమ్మారు?


  - తమిళ్ లో దనుష్ , సూర్య లాంటి టాప్ హీరోస్ మంచి కంటెంట్ ఉన్న స్మాల్ ఫిలిమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలా తెలుగు లో రోహిత్ గారు కూడా చెయ్యటం చాలా గొప్ప విషయం. మన అదృష్టంకూడా . లేకపోతే "అప్పట్లో ఒకడుండేవాడు" అనే కథ కాగితాల్లోనే ఉండిపోయేది. నెక్స్ట్ వచ్చే నీ సినిమా కూడా కాగితాలకే పరిమతమయ్యేది. ఎందుకంటే మన రెండు స్క్రిప్ట్స్ కూడా హైలీ కాంప్లెక్సిటీ ఉన్న స్క్రిప్ట్స్.రోహిత్ గారికి శ్రీ విష్ణు గారికి ఆర్ట్ తెలుసు . బాగా చదువుకున్నారు . రైటింగ్ గురించి ఇద్దరికీ బాగా తెలుసు. రోహిత్ గారైతే డైరెక్షన్ కోర్స్ కూడా చేశాడు... కాలిఫోర్నియా లో అనుకుంటా. అందుకే డబ్బుల గురించి ఆలోచించలేదు. మంచి ఫిల్మ్స్ చేయాలనే సీరియెస్ ఇంటెన్షన్ ఉంది కాబట్టే మన కథలను ఆయన ఒకే చెయటం జరిగింది. ప్రశాంతి గారు విజయ్ గారు అప్పారావ్ చాలా చాలా క్లెవర్ గా ప్రొడక్షన్ చేశారు. వాళ్ళ వల్లే బడ్జెట్ లో చెయ్యగలిగాను.ఆ తర్వాత MVK రెడ్డి గారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన బ్రహ్మాజీ గారు,శ్రీనివాస్ రెడ్డి అన్న ,రాజీవ్ కనకాల బాగా ఎంకరేజ్ చేశారు.  ఈ సినిమా విషయంలో ఇవీ చాలెంజెస్

  ఈ సినిమా విషయంలో ఇవీ చాలెంజెస్

  10 .ఈ ఫిల్మ్ మేకింగ్ లో ఫేస్ చేసిన మేజర్ చాలెంజెస్ ఏంటి?


  - ఫిఫ్టీ డేస్ లో టోటల్ షూట్ చేశాను. ఈ ఫిఫ్టీ డేస్ లో మేజర్ ఛాలెంజ్ అంటే.... క్రికెట్ ఎపిసోడ్ . సినిమాలో ప్రామినెంట్ ఎపిసోడ్ అది. షూట్ చేసేప్పుడు చాలా కష్టంగా అనిపించింది. తెలుసు కదా క్రికెట్ సీన్ మేకింగ్ అంటే ఎంత కష్టమో. ఒకసారి ఒకలా పడిన బాల్ ఇంకోసారి ఇంకోలా పడటం. యాక్షన్ కంటిన్యుటి ప్రాబ్లమ్స్ వలన రీ టేక్స్ ఎక్కువ అయ్యేవి. పైగా మిడ్ సమ్మర్... పులుసు కారిపోయేది. ఇంకోవిషయం యేంటంటే ఆ రోజులో కావల్సిన వర్క్ అవకపోతే ఇంకో రోజు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకో రోజు పెట్టుకుంటే ఇంకో రెండు లక్షలు ప్రొడ్యూసర్ కి లాస్ . సొ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి... తేడా వస్తే జీవితాలు మారిపోతాయి కదా. ఒక ప్రొడ్యూసర్ రోడ్ మీద పడ్డాడంటే ఆ పాపం లో డైరెక్టర్ భాగమే ఎక్కువగా ఉంటుంది . సొ మొత్తానికి ఆ ఛాలెంజ్ ని ఓవర్ కం చేశాను. లక్కీ గా శ్రీ విష్ణు ఒరిజినల్ క్రికెటర్ కావటం కొంత కలిసొచ్చింది.  ఆ సంఘటననే ఇలా....

  ఆ సంఘటననే ఇలా....

  11. ఈ క్రికెట్ ఎపిసోడ్ రాయటానికి ఏదో రియల్ ఇన్సిడెంట్ స్ఫూర్తి అని తెలిసింది ... ఎంటా ఇన్సిడెంట్ ?


  - నల్గొండలో రాజారాం అని అప్పట్లో ఒకడుండేవాడు. లైబ్రెరియన్ గా ఉద్యోగం చేసేవాడు. ఒక రోజు నల్గొండ సమీపంలో ఒక భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చాలా మంది నక్సలైట్స్ చనిపోయారు.న్యూస్ పేపర్లలో ఆవార్తని చూసి చూసి ప్రజలు ఉద్వేగానికి గురయ్యారు. అందరిలాగే రాజారాం కూడా ఉదయాన్నే ఎమోషనల్ గా ఫీలైనాడు.ఉద్యోగానికి వెళ్లొచ్చి రాత్రి అవగానే పడుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే తలుపు కొడుతున్న చప్పుడు వినబడింది. లేచి తలుపులు తెరిచాడు. ఎదురుగా నక్సలైట్స్. కిడ్నాప్ చేసి గుట్టల్లోకి తీసుకెళ్లారు. పోలీస్ ఇన్ఫార్మర్ అని భావించి పొద్దుటి నుండి రాత్రి వరకు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. వీడు ఏం చెప్పేలా లేడు,ఖచ్చితంగా వీడు ఇన్ఫార్మారే అని షూట్ చేయాలని డిసైడ్ అయ్యి అలా గన్ ఏయిమ్ చేసేసరికి ఒక్కసారిగా రాజా రామ్ కి ఏం అర్ధం కాలేదు. చెయ్యని నేరానికి ఇదేంది అని గట్టిగా ఏడుస్తూ "నాకే పాపం తెలియదు అన్న ... అమ్మతోడన్నా నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే మస్త్ ఇష్టమన్నా. నన్ను నమ్మండి అన్నా నేను pdsu లోకూడా పని చేసిన అన్న" అని వేడుకున్నాడు. దళ కమండర్ కి కొంత అనుమానం వచ్చి గన్స్ దించమన్నాడు. "pdsu లో ఏం పని చేసినావ్ " అని అడిగాడు. "గోడల మీద నినాదాలు రాసేవాడిని. మన టౌన్ లో కనిపించే పిడికిలి గుర్తులన్నీ చాలా వారకు నేను వేసినవే అన్న" అని ఏడుస్తూ చెప్పాడు. "సరే,ఒక పని చెయ్యి ... అటు వైపు వెళ్ళి ఆ రాయి మీద పెద్ద పిడికిలి గుర్తు వేసి చూపించు" అన్నాడు. రాజారాంకు అస్సల్ ఓపిక లేదు. కొట్టిన దెబ్బలకు కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. అడుగు తీసి ఆడుగు వేసేంత శక్తి కూడా లేదు. అయినా వెళ్ళి వణుకుతున్న చేత్తో పిడికిలి బొమ్మ గీశాడు. ఆ తర్వాత దళ కమాండర్ వెళ్ళి అలా టార్చ్ లైట్ వేసి చూసి....pdsu కార్యకర్తే అని నమ్మి వదిలేశాడు. ఆ రాజా రామ్ ఇప్పటికీ ఉన్నాడు. ఈ సంఘటన నన్ను ఎప్పుడూ హాంట్ చేస్తూ ఉండేది. ఈ సంఘటననే క్రికెట్ ఎపిసోడ్ కి కన్వర్ట్ చేశాను.  అతను అలా నచ్చాడు...

  అతను అలా నచ్చాడు...

  12. ఈ మధ్య ఏ సినిమా గురించి మాట్లాడనంతగా ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి క్రిటిక్స్ , జనాలు మాట్లాడుతున్నారు. ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని ఎలా నమ్మారు ?


  - ఒక రోజు నువ్వు నాతో "సురేశ్ బొబ్బిలి అని ఒక కొత్త అబ్బాయి ని ఇండస్ట్రీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నా... నువ్వూ ఓ సారి చూడు" అని చెప్పినప్పుడు అతన్ని అంతగా నమ్మలేదు...అంత మెచ్యూర్డ్ మ్యూజిక్ చేస్తాడో లేదో అని డౌట్ పడ్డాను. ఎప్పుడైతే నీ సినిమా సాంగ్స్ చేశాడో అప్పుడు అనిపించింది.... వీడు మామూలోడు కాదు అని.మంచి భవిష్యత్ ఉంది సురేశ్ కి. ఎక్స్ట్రార్డినరీ టెక్నీషియెన్..  ఆ రెండు కూడా...

  ఆ రెండు కూడా...

  13 . "అప్పట్లో ఒకడుండేవాడు" సినిమా జనాలకు బాగా కనెక్ట్ అవ్వటానికి రీజన్ ఏంటి? సినిమా లో ఉన్నఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ డ్రామానా లేదా కథ లో ఉన్న నోస్టాల్జిక్ లాంగింగా?


  - అఫ్కోర్స్ రెండు. నేను బేసికల్ గా హ్యూమన్ డ్రామా ని ఎక్కువ ఇష్టపడుతాను. ఒక అమ్మాయి తన కన్న తండ్రి ఆనవాలును వెతుక్కుంటూ రావటం అనేదానికి అందరూ కనెక్ట్ ఔతారని నేను నమ్మాను. అది ఇప్పుడు నిజమైంది. దీనితో పాటు మీరన్నట్టు నోస్టాల్జిక్ లాంగింగ్ కూడా... అప్పట్లో రాజ్య హింస వల్ల క్రికెటర్ కావల్సిన రైల్వేరాజు గ్యాంగ్ స్టర్ అయిన విధానం అందరినీ బాగా ఆకర్షిస్తోంది.  అలా అనుకోవడం లేదు గానీ...

  అలా అనుకోవడం లేదు గానీ...

  14. మనీ కన్నా ఆర్ట్ ఎక్కువగా జీవితానికి వెలుగునిస్తుంది అంటూంటారు కదా ... నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి?


  - (నవ్వి) తీసింది రెండు సినిమాలు .... సొ,ఈ రెండు సినిమాలను బట్టి చూస్తే నాలో అంత గ్రేట్ ఆర్ట్ ఉందని నేను మాత్రం అనుకోవటం లేదు. ఎవరన్నా ఉందనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం. వన్ పర్సెంట్ ఆర్ట్ ఉన్న నాలాంటి ప్రతీ మనిషి కి కూడా ఆర్టే ఆనందాన్ని ఇస్తుంది. ఆర్ట్ అనేది డివైన్. డబ్బు కేవలం కంఫర్ట్ ని ఇస్తుంది అంతే .  లేడీ లక్.. అడుగు పెట్టగానే...

  లేడీ లక్.. అడుగు పెట్టగానే...

  15 . మీ పేరెంట్స్ గురించి చెప్పు?


  - నాన్న రామ్ చంద్రా రెడ్డి ఒక థర్టీ ఇయర్స్ ప్రవేట్ స్కూల్ నడిపాడు. అమ్మ హోమ్ మేకర్. నల్గొండ రవీంద్ర నగర్ లో మా ఇల్లు. రీసెంట్ గా నాకు పెళ్ళైంది. తన పేరు గీతా రెడ్డి. ఐ‌టి ప్రొఫెషనల్. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే.మా పేరెంట్స్ తో సహ నా వైఫ్ గీతా రెడ్డి కూడా చాలా హ్యాపీగా ఫీలవుతోంది.తను నా లైఫ్ లోకి అడుగు పెట్టగానే సక్సెస్ వచ్చింది. అంతా అంతా లేడీ లక్ అంటున్నారు... కావచ్చేమో .


  - ఇంటర్వ్యూ : వేణు ఊడుగుల  English summary
  The director of Appatlo Okadundevadu, Sagar K Chandra spoke to a prominent Telugu poet Venu Uduguala about his film and how it made.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more