twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్కడ చూసినా రజినీనే.. మా సినిమాలోనూ దిశ ఘటన లాంటి సీనే.. ఏఆర్ మురుగదాస్ కామెంట్స్

    |

    ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ దర్శకుడు, సామాజిక బాధ్యతతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కలిసి దర్బార్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ ఇద్దరు కలిసి ఓ చిత్రాన్ని చేయడానికి దాదాపు పదిహేనేళ్ల సమయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. మొదటి సారిగా సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేయనుండటం, అది కూడా కాప్ స్టోరీ కావడంతో ఈ చిత్రం తన కెరీర్‌లో ఎంతో ముఖ్యమని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం విడుదలకు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేసిన చిత్ర యూనిట్ శుక్రవారం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. నేడు దర్శకుడు మురుగదాస్ మీడియాతో ఇంటరాక్ట్ అయి అనేక విషయాలను పంచుకున్నాడు.

    ఎక్కడ చూసినా రజినీనే..

    ఎక్కడ చూసినా రజినీనే..

    చిన్నప్పుడు తన ఊళ్లో ఓ థియేటర్ ఉండేదని అక్కడ రజినీ సినిమా ఆడుతుంటే.. అక్కడికి రజినీ వచ్చాడేమోనని వెళ్లాను అయితే అక్కడ ఆయన లేరని తెలిపాడు. ఇంటికి వెళ్లి అడిగితే.. ఆయన చెన్నైలో ఉంటారు.. ఇక్కడెందుకుంటారు అని అన్నారు. అలాగే మరోసారి మా బంధువుల ఇంటికి కూడా వెళ్లాను.. అక్కడ కూడా రజినీ పోస్టర్సే ఉండటంలో అదేంటి మన ఊళ్లో ఉండాలి కదా ఇక్కడ కూడా ఆయనే ఉన్నాడేంటీ అని మా అక్కను అడిగాను.. ఆయన నటుడు.. ఆయన చెన్నైలో ఉంటారని చెప్పిందని తెలిపాడు. అలా తెలిసీ తెలియనితనంలో రజినీ గురించి పరిచయమైందని తెలిపాడు.

    మొదటిసారిగా అలా..

    మొదటిసారిగా అలా..

    ‘అయితే కొన్నేళ్ల తరువాత చెన్నైకి వచ్చిన నేను.. రజినీ ఎక్కడ ఉంటాడా? అని ప్రతీ కారును, ప్రతీ రోడ్డును వెతికేవాడిని. అలా ఓ సారి ఓ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా దూరం నుంచి రజినీని చూశాను. అయితే అందరూ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు, అందులో ఒకరు మాత్రం కళ్లజోడు పెట్టుకుని ఉన్నారు. అతనే రజినీ అని గుర్తుపట్టాను. అలా మొదటిసారి అంత దూరంలో చూడగా.. గజినీ తరువాత ఆయనే ఇంటికి పిలిచారు. అలా దగ్గరగా చూడటం అదే మొదటిసార'ని పేర్కొన్నాడు.

    మా సినిమాలోనూ దిశ ఘటనలాంటి సీనే..

    మా సినిమాలోనూ దిశ ఘటనలాంటి సీనే..

    ‘పోలీసుల్లో రెండు రకాలుంటారు. ఒకటి పొలిటీషియన్స్ కోసం మనల్ని కొట్టేవారు. మరొకరు ప్రజల కోసం పని చేసేవారు. ఈ మధ్య హైద్రాబాద్‌ పోలీసుల చర్యను దేశమంతా కొనియాడింది. దిశ ఘటన జరిగిన చోటే వారిని కూడా ఎన్‌కౌంటర్ చేసేశారు. ఆ సమయంలో ప్రజలంతా పోలీసులను హీరోలా చూశారు. సేమ్ అలాంటి సీనే మా సినిమాలోనూ అంతకుముందే షూట్ చేశాం. అయితే ఈ ఘటన గురించి తెలిసిన తరువాత రజినీ ఫోన్ చేసి.. సేమ్ నీ స్క్రిప్ట్‌లానే జరిగిందని అన్నార'ని చెప్పుకొచ్చాడు.

    రియల్ రెయిన్‌లో సీన్..

    రియల్ రెయిన్‌లో సీన్..

    ‘ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు వర్షాలు పడుతున్నాయి. అయితే షూటింగ్ చేయడమెలా అని అందరూ ఆలోచిస్తుండగా.. సంతోష్ శివన్ మాత్రం వర్షంలోనే సీన్ చేసేద్దామని అన్నారు. అయితే తాను మాత్రం వద్దని చెప్పాను. కానీ షూట్ లేటవుతుంది.. క్యాన్సిల్ చేస్తే.. నిర్మాతలకు నష్టం.. ఎలాగా? అని ఆలోచిస్తుంటే.. వర్షంలోనే చేసేద్దామని రజినీ సర్ అన్నారు.. వర్షంలో తడిస్తే ఆయనకు జ్వరం వేస్తుంది..మేకప్ పోతుంది.. జుట్టు కూడా చెదిరిపోతుంది.. అని ఆలోచించాను. ఆయన మాత్రం అవేవీ లెక్కచేయకుండా వర్షంలోనే చేసేద్దామన్నాడు. వర్షం పడుతుండగానే సెట్‌లోకి తడుచుకుంటూ వచ్చేశాడు. ఆయన్ను చూసి మిగతా వారంతా వర్షంలోనే తడుస్తూ షూట్‌లో పాల్గొన్నారు. రియల్ రెయిన్‌లో చేసిన ఆ సీన్స్ అదిరిపోయాయ'ని తెలిపాడు.

    English summary
    AR murugadoss Intera Action With Media About Darbar. This Movie Stars Nayanathara, Nivetha Thomas And Sunil Shetty. This Movie Is Going To Release On 9th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X