»   » విలన్‌గా ప్రిన్స్ మహేశ్.. మురుగదాస్ మరో ప్రయోగం..

విలన్‌గా ప్రిన్స్ మహేశ్.. మురుగదాస్ మరో ప్రయోగం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు మురుగదాస్, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ చిత్రం డివైడ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ చిత్రంపై ప్రేక్షకుల, సినీ విమర్శకుల స్పందన ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ప్రిన్స్ చిత్రం 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తిన సంగతి తెలిసిందే. స్పైడర్ భారీ అంచనాలను చేరుకోలేని నేపథ్యంలో మహేశ్, తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో మురుగదాస్ రూపొందించబోయే ఓ మల్టీ స్టారర్ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే..

 మురుగ మరో ప్రయోగం..

మురుగ మరో ప్రయోగం..

ప్రిన్స్ ఇమేజ్, స్టామినాకు తగినట్టుగా స్పైడర్ చిత్రం లేదనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ స్పైడర్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేశ్ ప్రతిష్ఠను పెంచే విధంగా మురుగదాస్ ఓ ప్రయోగానికి సిద్ధమవుతున్నాడట.

Mahesh Babu's Spyder teaser creates record
 మహేశ్ బాబు విలన్‌గా

మహేశ్ బాబు విలన్‌గా

స్పైడర్ మిగిల్చిన చేదు అనుభవంతో కసిగా ఉన్న మురుగదాస్ మల్టీ స్టారర్ చిత్రానికి కథ రచిస్తున్నారట. అందులో తెలుగు సూపర్ స్టార్ మహేశ్, తమిళ సూపర్ విజయ్ నటించనున్నారట. ఈ చిత్రంలో ఇద్దరు సూపర్ స్టార్లు విలన్లేనట. ఇద్దరు విలన్లు అయితే హీరో ఎవరు అని ఆలోచిస్తున్నారా? అదే మురుగదాస్ చేయబోతున్న మ్యాజిక్ అది..

మురుగదాస్ మ్యాజిక్ ఇది..

మురుగదాస్ మ్యాజిక్ ఇది..

తెలుగులో రూపొందించబోయే వెర్షన్‌లో విజయ్ విలన్‌గా నటిస్తారట. ఇక తమిళ వెర్షన్‌లో మహేశ్ విలన్‌గా కనిపిస్తారట. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా అనే మాట పక్కన పెడితే.. కాన్సెప్ట్ మాత్రం కొత్తగానే కనిపిస్తున్నది.

సూపర్‌స్టార్ల ఇమేజ్‌ను..

సూపర్‌స్టార్ల ఇమేజ్‌ను..

ఆయా భాషలో అగ్రనటులకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నట్టు సమాచారం. తెలుగులో మహేశ్, తమిళంలో విజయ్ విలన్ అంటే ఒప్పుకోరు. కాబట్టి తెలుగులో విలన్‌గా విజయ్‌ను... తమిళంలో విలన్‌గా మహేశ్ పాత్రలను డిజైన్ చేస్తున్నాడు డైరెక్టర్ మురుగదాస్.

English summary
Mahesh Babu’s Spyder has made more than Rs 100 crores at the Telugu box office already. In this occasion, Director AR Murgadoss is planning a movie with Mahesh Babu, Tamil Star Vijay. In this film these two superstars are going to potray the villain roles in their respective languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu