»   » రామ్ చరణ్ సినిమాలో విలన్‌గా అరవింద స్వామి?

రామ్ చరణ్ సినిమాలో విలన్‌గా అరవింద స్వామి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో సూపర్ హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ‘థాని ఓరువన్' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. తమిళంలో విలన్ పాత్రలో అదరగొట్టిన అరవింద స్వామితోనే తెలుగులోనూ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన రానుంది.

ఈ చిత్రంలో అత్యంత కీలకమైన విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది హాట్ టాపిక్ అయింది. తమిళంలో విలన్ పాత్రలో అరవిందస్వామి నటించారు. తెలుగులో విలన్ పాత్ర కోసం ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. తెలుగు స్టార్ నాగార్జున పేరు కూడా వినిపించింది. అయితే నాగార్జున ఈ రోల్ చేయడం లేదని తేలిపోయింది. గత కొంత కాలంగా నటుడు మాధవన్ పేరు ప్రచారంలో ఉంది. అయితే మాధవన్ కూడా ఈ వార్తలను ఖండించారు. దీంతో అరవిందస్వామితోనే ఆ పాత్ర చేయించే ప్రయత్నం చేస్తున్నారట.

Aravind Swamy confirmed as Ram Charan's movie villain!?

ఈ చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఎన్వీ ప్రసాద్, డివివి దానయ్య కలిసి నిర్మించాలని అనుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డివివి దానయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ' నిర్మించిన దానయ్య ఆ సినిమా సరిగా ఆడక పోవడంతో ఫైనాన్షియల్ గా టైట్ పొజిషన్లో ఉన్నట్లు టాక్. అందుకే ‘థాని ఓరువన్' సహ నిర్మాతగా తప్పుకున్నట్లు చెబుతున్నారు.

Aravind Swamy confirmed as Ram Charan's movie villain!?

‘థాని ఓరువన్' చిత్రం రీమేక్ రైట్స్ భారీగా ధరకు కొనుగోలు చేసారు. తమిళంలో ఈ చిత్రం జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కింది.

English summary
The handsome actor Aravind Swamy who won great praise for his role of antagonist in the Tamil blockbuster Thani Oruvan is said to have signed the remake of the said movie in Telugu as well. He will be fitted against Ram Charan in this remake.
Please Wait while comments are loading...