»   » శ్రీదేవి మృతి తరువాత తొలిసారి..అర్జున్ కపూర్ మనసులో ఎంత ప్రేమ దాచుకున్నాడో!

శ్రీదేవి మృతి తరువాత తొలిసారి..అర్జున్ కపూర్ మనసులో ఎంత ప్రేమ దాచుకున్నాడో!

Subscribe to Filmibeat Telugu
Arjun Kapoor about Sridevi అర్జున్ కపూర్ మనసులో ఎంత ప్రేమ దాచుకున్నాడో!

లెజెండ్రీ నటి శ్రీదేవి మరణం ఆమె కుటుంబానికి మాత్రమే కాదు మొత్తం దేశానికే షాక్. తెలుగు నేపథ్యంతో తమిళనాడులో పెరిగిన శ్రీదేవి భారతీయ చలనచిత్ర రంగంలో సంచంలనంగా అవతరించింది. అన్ని చిత్ర పరిశ్రమల్లో జయకేతనం ఎగురవేసింది. దేశంలో ఎందరినో ఆప్తులుగా మలచుకుంది. బోని కపూర్, శ్రీదేవి వివాహం 1996 లో జరిగింది. తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడనే కోపంతో అర్జున్ కపూర్ సహా మొదటి భార్య బంధువులు అంతా బోనికపూర్ ని దూరం పెట్టారు. శ్రీదేవి మరణం తరువాత వారంతా బోనికపూర్ కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. తల్లిని కోల్పోయిన జాన్వీ, ఖుషిని చేరదీస్తున్నారని సమాచారం. క్లిష్ట పరిస్థితుల్లో తన కోప తాపాలని పక్కన పెట్టిన అర్జున్ కపూర్ తండ్రికి అండగా నిలిచాడు. ప్రస్తుతం అర్జున్ కపూర్ పై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తాజాగా అర్జున్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పరోక్షంగా శ్రీదేవీపే మమకారాన్ని తెలియజేసే విధంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.

చలనచిత్ర రంగం మొత్తానికి

చలనచిత్ర రంగం మొత్తానికి

శ్రీదేవి ఆకస్మిక మరణం ఆమె కుటుంబంతో పాటు చలన చిత్ర రంగం మొత్తానికి పెద్ద దిగ్భ్రాంతికర ఘటన, లెజెండ్రీ నటిగా నీరాజనాలు అందుకున్న శ్రీదేవికి దాసోహం కానీ భారత చలనచిత్ర పరిశ్రమ లేదు.

బోని ఫ్యామిలీలో మనస్పర్థలు

బోని ఫ్యామిలీలో మనస్పర్థలు

శ్రీదేవిని వివాహం చేసుకున్న తరువాత బోనికపూర్ కుటుంబంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అర్జున్ కపూర్ తో సహా మొదటి భార్య బంధువులు బోని కపూర్ కు దూరం జరిగారు. అర్జున్ కపూర్ కూడా చాలా కాలంగా తండ్రితో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడనే టాక్ బాలీవుడ్ లో ఉంది.

శ్రీదేవి మరణం, కుటుంబంలో కదలిక

శ్రీదేవి మరణం, కుటుంబంలో కదలిక

శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ ఫ్యామిలిలో కదలిక మొదలైందని అంటున్నారు. కష్టకాలంలో బోనికపూర్, జాన్వీ, ఖుషి ని ఓదార్చడానికి అతడి బంధువులు చెరువుతున్నట్లు తెలుస్తోంది.

తండ్రి కోసం, పిన తల్లి కోసం

తండ్రి కోసం, పిన తల్లి కోసం

శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ షాక్ లోకి వెళ్లిపోయారు. అదే సమయంలో దుబాయ్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తండ్త్రికి అండగా నిలవడానికి, పినతల్లి శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు తీసుకునిరావడానికి అర్జున్ కపూర్ నేరుగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

అంత్యక్రియల్లో కూడా

అంత్యక్రియల్లో కూడా

శ్రీదేవి అంతిమ యాత్ర, అంత్యక్రియలు విషయంలో కూడా ఏర్పాట్లన్నీ అర్జున్ కపూర్ దగ్గరుండి చూసుకున్నాడు. కుటుంబాన్ని అంతా తానై నడిపించాడు.

అన్షుల చెల్లెళ్లకు అండగా

అన్షుల చెల్లెళ్లకు అండగా

జాన్వీ, ఖుషిని ఓదార్చే భాద్యత అర్జున్ కపూర్ సొందరి అన్షుల తీసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో చెల్లెళ్లకు అండగా నిలిచింది.

బోని కపూర్ స్వయంగా

బోని కపూర్ స్వయంగా

అర్జున్ కపూర్, అన్షుల క్లిష్ట పరిస్థితుల్లో చూపించిన చొరవని బోనికపూర్ స్వయంగా కొనియాడారు.

శ్రీదేవి మరణం తరువాత తొలిసారి

శ్రీదేవి మరణించిన తరువాత తొలిసరి అర్జున్ కపూర్ ఇంస్టాగ్రామ్ స్పందించాడు. ప్రముఖ రచయిత ఆర్ ఎం డ్రేక్ కొటేషన్ ని పోస్ట్ చేసాడు.

శ్రీదేవి గురించి పరోక్షంగా

శ్రీదేవి గురించి పరోక్షంగా

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. కానీ వాటన్నింటిని అధికమించి పయనం కొనసాగించాలని అర్థం వచ్చేలా అర్జున్ కపూర్ పెట్టిన పోస్ట్ ఉంది. అర్జున్ కపూర్ ఎమోషనల్ గా పెట్టిన ఈ పోస్ట్ వెనుక శ్రీదేవిపై ప్రేమ, ఆమె మరణం పట్ల అర్జున్ కపూర్ కు ఉన్న బాధని తెలియజేస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.

అభిమానుల నుంచి

అభిమానుల నుంచి

అర్జున్ కపూర్ పోస్ట్ కు అభిమానుల నుంచి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కొందరు అభిమానులు అయితే అర్జున్ కపూర్, జాన్వీని అన్నా చెల్లెళ్లుగా సినిమాలో చూడాలని ఉందని కామెంట్ పెట్టాడు.

English summary
Arjun Kapoor emotional post in instagram after Sridevi death. Fans appreciating arjun kapoor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu