»   »  'ఒక్కడు'..హిందీ రీమేక్ టైటిల్, హీరోయిన్

'ఒక్కడు'..హిందీ రీమేక్ టైటిల్, హీరోయిన్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Arjun Kapoor's 'Okkadu' remake to be titled 'Tevar'
  ముంబై: మహేష్‌ బాబు సూపర్ హిట్‌లలో ఒకటైన 'ఒక్కడు (2003) చిత్రాన్ని హిందీలో బోనీ కపూర్‌ రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మహేష్‌ బాబు పాత్రను బోనీకపూర్‌ తనయుడు అర్జున్‌ కపూర్‌ పోషించ బోతున్నాడు. ఈ చిత్రాన్ని అబ్బాస్ మస్తాన్ డైరక్ట్ చేస్తున్నారు. సంజయ్ కపూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. మొదట అభిషేక్ బచ్చన్ తో ఈ చిత్రం రీమేక్ అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. ప్రస్తుతం ఈ చిత్రం పూర్తి డిటేల్స్ వచ్చేసాయి.


  ఈ చిత్రానికి 'తేవర్' అనే టైటిల్ నిర్ణయించారు. తెలుగులో భూమిక చేసిన హీరోయిన్ పాత్రను సోనాక్షి సిన్హా చేసే ఈ సినిమా ద్వారా దర్శకునిగా అమిత్‌శర్మ పరిచయం కాబోతున్నాడు. వాస్తవానికి 'తేవర్' అనే టైటిల్ యశ్‌రాజ్ ఫిలిమ్స్ వద్ద ఉంది. అయితే ఆ టైటిల్ కావాలని అర్జున్ అడగడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేశాడు ఆ సంస్థ అధినేత ఆదిత్య చోప్రా. 'తేవర్'లో ఆగ్రాకు చెందిన కబడ్డీ ఛాంపియన్ అయిన కాలేజీ కుర్రాడిగా కనిపించనున్నాడు అర్జున్. జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తోంది.


  బోనీ కపూర్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ''అవును. 'ఒక్కడు ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. అర్జున్‌ ప్రధాన పాత్ర పోషిస్తాడు అని చెప్పాడు. తమిళ, కన్నడ భాషల్లోకూడా రీమేక్‌ చేసిన ఈ చిత్రం హిందీలో తీయదగ్గ సతా గల చిత్రమని అర్జున్‌ భావిస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్‌, ఇతర నట వర్గాన్ని ఇంకా నిర్ణయించలేదు. తెలుగు 'ఒక్కడులో మహేష్‌ బాబు సరసన నటించిన భూమిక చావ్లా మాట్లాడుతూ ''ఎన్నో దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్‌ అయ్యాయి. కానీ ఈ చిత్రం రీమేక్‌ అవ్ఞతుండటం ఎంతో ఆనందంగా ఉంది అంది.

  ఇప్పటికే అర్జున్ కపూర్ 'ఇషక్‌ జాదే' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు పోషించిన పాత్ర అర్జున్‌కు కరెక్ట్ గా సూటవుతుందని, అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఆ సినిమాకు పర్ ఫెక్ట్ గా ఉంటుందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. అర్జున్ కపూర్ ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి సవితి కొడుకు. బోని కపూర్-మోనా పెళ్లయిన పదేళ్ల తర్వాత విడి పోయారు. వీరి సంతానమే అర్జున్ కపూర్. రానున్న రోజుల్లో అర్జున్ 'గుండే', '2 స్టేట్స్', 'ఫైండింగ్ ఫానీ ఫెర్నాండెజ్' వంటి ఆసక్తికర చిత్రాల్లో హీరోగా కనిపించబోతున్నాడు.

  English summary
  Actor Arjun Kapoor's next film, which is being produced by his father Boney Kapoor, is titled as 'Tevar'. The film has now got a name as filmmaker Aditya Chopra decided to give away the title to the Kapoors. "Boney Kapoor wanted the title 'Tevar', which he realised was with YRF as it was a favourite of Yashji's. When Arjun told Adi (Aditya) that they were keen to name the film Tevar', he gave him the title without any further delay," sources said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more