»   » వైరల్ అవుతున్న లిప్‌లాక్ : "అర్జున్‌రెడ్డి" అన్నీ ముద్దులూ రిలీజ్ అయిపోయాయి

వైరల్ అవుతున్న లిప్‌లాక్ : "అర్జున్‌రెడ్డి" అన్నీ ముద్దులూ రిలీజ్ అయిపోయాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా వాళ్ల పబ్లిసిటీ స్టంట్స్ మామూలుగా ఉండవు. ఇందుకోసం వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. తాజాగా 'అర్జున్ రెడ్డి' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం విషయంలో సరికొత్త పబ్లిసిటీ ట్రిక్ ప్లే చేసారు. సినిమా షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్ లిప్ లాక్ ప్రాక్టీస్ చేసే వీడియో రిలీజ్ చేసారు ఆమధ్య. అప్పుడే అసలు ఒకరేంజ్ కి వెళ్లింది ఈ సినిమా మీద చర్చ. పిచ్చెక్కిపోయారు టాలీవుడ్ జనం ఆ లిప్‌లాక్ ప్రాక్టీస్కి. ఆ ఆశ్చర్య కొనసాగుతూండగానే వచ్చిన కిస్ పోస్టర్ ఇంకా ఇంకా క్రేజీగా మారింది. ఒక సినిమాలో ఏదైనా లిప్ లాక్ సీన్ ఉందంటే చాలు..

దాని గురించి నానా హడావుడి చేసి ప్రచారానికి వాడేసుకుంటూ ఉంటారు సినిమా జనాలు. బాలీవుడ్ లో ఇది సర్వసాధారణం. కొన్ని సార్లు కావాలనే లిప్ లాక్ ని కాస్త కాంట్రవర్సీ చేసి మరీ జనాల దృష్తి ఇక్కడ పడేలా చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు వాడుకోకూడదు అనుకున్నారో ఏమో గానీ ''అర్జున్ రెడ్డి'' టీమ్ ఆల్రెడీ వచ్చిన బజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ముద్దుని బాగానే వాడేస్తున్నారు ప్రమోషన్ కోసం. హీరోయిన్ షాలిని లిప్ లాక్కుల‌కే ఒప్పుకొందంటే, వెండితెర‌పై ఇంకెంత ఘాటుగా క‌నిపించ‌నుందో అన్నంతగా హైప్ తేవటానికి ట్రై చేసేస్తున్నారు.

పెళ్లిచూపులులాంటి రిఫ్రెష్షింగ్ ల‌వ్ స్టోరీతో పేరు తెచ్చుకొన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు... విజ‌య్ కెరీర్‌కి పూల బాట వేసింది. పెళ్లి చూపులు త‌ర‌వాత దాదాపుగా అర‌డ‌జ‌ను సినిమాలు అత‌ని చేతికి అందాయి. అందులో అర్జున్ రెడ్డి ఒక‌టి. పెళ్లి చూపులు ఎంత సాఫ్టో.. ఈ అర్జున్ రెడ్డి అంత హార్డు. టీజ‌ర్ చూస్తేనే ఆ విష‌యం అర్థ‌మైపోతోంది. నిమిషం పాటు సాగిన ఈ టీజ‌ర్‌లో.... దాదాపు స‌గానికి పైగా షార్ట్స్ (ముఖ్యంగా టేబుల్ సీన్‌) ఇది తెలుగు సినిమానేనా?? అనే సందేహం క‌లిగించేలా చేస్తున్నాయి. చివ‌ర్లో చూపించిన లిప్‌లాక్ అయితే అల్టిమెట్‌. మొత్తానికి టీజ‌ర్ ప్రామిసింగ్‌గా ఉంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా చేరిపోవ‌డం ఖాయం.

మొన్ననే టీజర్లో ఒక బూతుమాట.. అలాగే హీరోయిన్ ను ఘాడంగా దగ్గరకు లాక్కొనే సీన్ ఒకటి చూపించడంతో.. సినిమాకు విపరీతమైన బజ్ వచ్చేసింది. అంతకంటే ముందే సినిమాలో లిప్ కిస్ సీన్ చేయడం కోసం హీరో విజయ్ దేవరకొండ.. హీరోయిన్ షాలిని వడ్నికట్టి లు కాసేపు ఘాట్టిగా చుంబించుకుని మరీ సన్నద్దమయ్యారు. ఆ మేకింగ్ వీడియో కూడా మనకు చూపెట్టేవారు. ఇప్పుడు సినిమాలో వారు చేసిన ఈ కిస్సింగ్ సీన్ కు సంబంధించిన ఫోటో బయటకొచ్చింది. సారీ..! ఒక్క ఫోటో కాదు.. ఏకంగా ఆ షాట్లో ఉన్న ఫ్రేమ్స్ అన్నీ రిలీజ్ చేసేశారు నిర్మాతలు. ఒకటీ రెండూ అంటే ఓకే గానీ అన్ని షాట్స్ రెలీజ్ చేయటం అంటే ఎంత ఆకర్షించేద్దాం అని ఫిక్సవకపోతే అలా వేసెస్తారూ...

English summary
Bhadrakali pictures Arjun Reddy at acting workshop video. directed by Sandeep Vanga. produced by Pranay. starring Vijay Devarakonda & Shalini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu