For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాన్నను ఎదురించా, పోలీస్ కంప్లయింట్ బెదిరింపు... (‘అర్జన్ రెడ్డి’ హీరోయిన్ రియల్ స్టోరీ)

  By Bojja Kumar
  |
  Arjun Reddy actress Shalini Pandey Real Life Story

  ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా 'అర్జున్ రెడ్డి' సినిమా గురించిన చర్చ. 'శివ' తర్వాత ఆ రేంజిలో ట్రెండ్ సెట్టర్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ శాలిని పాండేకు పెర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరొచ్చింది.

  విజయ్ దేవరకొండ గురించి మనకు ఇప్పటికే చాలా తెలుసు. ఇంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు. అయితే హీరోయిన్ శాలిని పాండే గురించి చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాలిని తన పర్సనల్ డిటేల్స్, ఈ సినిమాలో హీరోయిన్ గా రావడానికి పడ్డ కష్టాల గురించి వెల్లడించారు.

  జబల్‌పూర్ బ్యూటీ

  జబల్‌పూర్ బ్యూటీ

  శాలిని పాండే మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్ అనే ఒక చిన్న సిటీకి చెందిన అమ్మాయి. ఇంజనీరింగ్ గ్రాజ్యుయేట్. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. చిన్నతనం నుండే చదువులో చురుకు. క్లాస్ టాపర్.

  చిన్నతనం నుండే

  చిన్నతనం నుండే

  తనకు చిన్నతనం నుండే హీరోయిన్ కావాలనే ఆశ ఉండేదని, ఆ ఆసక్తితోనే ఇంట్లో వాళ్లను ఒప్పించి థియేటర్ ఆర్ట్స్‌లో చేరినట్లు శాలిని పాండే వెల్లడించారు. అయితే తమ ఇంట్లో మాత్రం తాను సినిమాల వైపు వెళ్లడం ఇష్టం లేదని, తన తండ్రి ఈ విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉండేవారని తెలిపారు.

  ఇంట్లో ఫోర్సు వల్లే

  ఇంట్లో ఫోర్సు వల్లే

  నాకు ఇంజనీరింగ్ కంటే ముందే నటనా రంగంలోకి రావాలని ఉండేది. అయితే ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేయడంతో పూర్తి చేశాను. అదే సమయంలో థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాను అని శాలిని తెలిపారు.

  సినిమాల వైపు వద్దని చెప్పారు

  సినిమాల వైపు వద్దని చెప్పారు

  నాకు థియేటర్ ఆర్ట్స్‌లో మంచి గ్రేడ్స్ వస్తుండటంతో నా కోరిక కాదనలేక నాన్న కూడా కంటిన్యూ చేయమని చెప్పారు. కానీ సినిమాల వైపు మాత్రం అస్సలు వద్దని చెప్పారు. కానీ నాకు తెలుసు నా లక్ష్యం సినిమాలే అని..... శాలిని తెలిపారు.

  ఐటీ జాబ్ చేయమన్నారు

  ఐటీ జాబ్ చేయమన్నారు

  ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత యాక్టింగ్ వైపు వెళతానంటే నాన్న ఒప్పుకోలేదు. ఐటీ జాబ్‌లో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేశారు. అపుడు నా కల నెరవేర్చుకోవడానికి ఎలాగైనా ఇంట్లో నుండి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను అని శాలిని తెలిపారు.

  ముంబై వచ్చేశా

  ముంబై వచ్చేశా

  వారం రోజులు ముంబైలో ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చేశాను. నాన్న నాకు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసి ఇచ్చారు. ముంబై వచ్చిన తర్వాత ఎప్పుడొస్తున్నావు అంటూ రోజూ ఫోన్ చేసేవారు. నేను వెళ్లపోయేసరికి ఆయనే వచ్చి నన్ను తీసుకెళతానని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సరైన సమయం అనుకుని నేను ఇక తిరిగి రాను అని అప్పుడే నాన్నకు ఈమెయిల్ పెట్టేశాను అని శాలిని తెలిపారు.

  పోలిస్ కంప్లయింట్ ఇస్తామన్నారు

  పోలిస్ కంప్లయింట్ ఇస్తామన్నారు

  ముంబై నుండి నేను తిరిగి రాక పోవడంతో నాన్న రోజూ ఫోన్ చేసేవారు. ఆయన నన్ను వెతుక్కుంటూ వస్తారనే భయంతో నేను ఎక్కడ ఉంటున్నాననే విషయం చెప్పలేదు. పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బెదరించారు. నేను అపుడు ఆయనకు ఒకటే చెప్పాను... నాకు 22 సంవత్సరాలు, అలా చేస్తే మీరే నన్ను టార్చర్ పెడుతున్నారని రివర్స్ కంప్లయింట్ ఇస్తానని చెప్పాను, దీంతో నాన్న చాలా బాధ పడి నువ్వు నా ఇంటికి ఎప్పటికీ తిరిగి రాకు అని మెయిల్ పెట్టారు అని శాలిని తెలిపారు.

  ఇంట్లో వాళ్లతో మాటల్లేవు

  ఇంట్లో వాళ్లతో మాటల్లేవు

  నేను అలా అనేసరికి నాన్నతో పాటు ఇంట్లో వాళ్లు చాలా బాధ పడ్డారు. కానీ నా డ్రీమ్ నిజం చేసుకోవడానికి అలా చేయక తప్పలేదు. అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి సినిమా మొదలు కాలేదు అని శాలిని తెలిపారు.

  ముంబైలో చాలా కష్టాలు పడ్డాను

  ముంబైలో చాలా కష్టాలు పడ్డాను

  ఇంట్లో వాళ్లకి అలా తెగేసి చెప్పి ముంబైలో ఉండిపోయాను. నా దగ్గర అపుడు అకౌంట్లో కొంత డబ్బు మాత్రమే ఉంది. దేవుడి దయ వల్ల ముంబైలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ముంబైలో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఒక్కో గదిలో చాలా మంది ఇరుకుగా ఉండాల్సి వచ్చేది. డబ్బు సేవ్ చేయడానికి నడిచి వెళ్లడం, ఒక్కోసారి డిన్నర్ స్కిప్ చేయడం లాంటివిని చేసేదాన్ని అని శాలిని తెలిపారు.

  రెండు నెలలు పరిచయం లేని అబ్బాయిలతో ఉన్నాను

  రెండు నెలలు పరిచయం లేని అబ్బాయిలతో ఉన్నాను

  ఇరుకు గదుల్లో ఉండటం ఇష్టం లేక నా స్నేహితురాలికి తెలిసిన ఇద్దరు అబ్బాయిలతో ఉండటానికి సిద్ధమయ్యాను. అప్పటికి ‘అర్జున్ రెడ్డి' సినిమా సైన్ చేశాను. షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. 15 రోజులు అని చెప్పి పరిచయం లేని ఇద్దరు అబ్బాయిలతో 2 నెలలు ఒకే ఇంట్లో ఉన్నాను. వారు చాలా మంచి వారు. నా విషయంలో ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు. నన్ను ఒక కిడ్ లా, ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు అని శాలిని తెలిపారు.

  అడుక్కుంటావని తిట్టారు

  అడుక్కుంటావని తిట్టారు

  ఒకసారి నాన్న ఈ యాక్టింగ్, అదీ అని వెళితే ఎందుకూ పనికి రాకుండా పోతావు, ఏదో ఒకరోజు రోడ్డుపై అడుక్కునే పరిస్థితికి వస్తావు అని తిట్టారు. కానీ నాకు ఇందులో సర్వైవ్ అవుతాననే గట్స్ ఉన్నాయి కాబట్టే ఇవన్నీ చేయగలిగాను అని శాలిని తెలిపారు.

  ముద్దు సీన్లు గురించి చెప్పలేదు

  ముద్దు సీన్లు గురించి చెప్పలేదు

  ఆడిషన్ సమయంలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని సందీప్ నాకు ముందు చెప్పలేదు. ఒక వేళ చెప్పి ఉంటే అపుడు ఒప్పుకునే దాన్ని కాదేమో. కానీ అవి స్లీజీ ముద్దు సీన్లుకావు. సాధారణంగా ఉండే ముద్దు సీన్లు కాబట్టే చేయగలిగాను అని శాలిని తెలిపారు.

  షూటింగుకు నాన్న వస్తానంటే వద్దన్నాను

  షూటింగుకు నాన్న వస్తానంటే వద్దన్నాను

  ‘అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలో నాన్న సెట్స్‌కు వస్తానని అన్నారు. అపుడు నేను వద్దన్నాను. అపుడు నాన్న నువ్వు నా కూతురువి కావు, నేను నీ నాన్నను కాదు అని చాలా బాధ పడుతూ మెయిల్ పెట్టారు. ఆయన వస్తే షూటింగుకు ఇబ్బందిగా ఉంటుందనే వద్దని చెప్పాను... అని శాలిని తెలిపారు.

  ఇపుడు నాన్న హ్యాపీ

  ఇపుడు నాన్న హ్యాపీ

  సినిమా పూర్తయిన తర్వాత ప్రీమియర్ షోకు నాన్న వచ్చారు. సినిమా చూసిన తర్వాత ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. ఇపుడు ఇంట్లో అంతా హ్యాపీగా ఉన్నారు..... అని శాలిని తెలిపారు.

  English summary
  Shalini Pandey is an Indian actor who became popular with her role in Tollywood film, Arjun Reddy. She received positive reviews for her performance in Arjun Reddy, and did her own dubbing. Shalini pandey was born in Jabalpur, Madhya Pradesh. She is an engineering graduate, and topped that class. She started doing theater in her second year in college.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X