»   » ‘ఎవడు’ ఆడియోకు ఏర్పాట్లు పూర్తి(ఫొటోలు)

‘ఎవడు’ ఆడియోకు ఏర్పాట్లు పూర్తి(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' ఆడియోకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక వద్ద ఆడియో విడుదల కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే శిల్పకళా వేదిక ప్రాంగణంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాన్, అల్లు అర్జున్‌ల భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేసారు.

'ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై చివరి వారంలో 'ఎవడు' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ఈ ఆడియో వేడుకకు చిరంజీవి, అల్లు అర్జున్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

శిల్పకళా వేదిక ప్రాంగణంలో ఎవడు ఆడియో వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్లెక్సీలు

ఎవడు ఆడియో పంక్షన్‌కు హాజరయ్యే అభిమానులు, అతిథులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన కమాన్

ఆడిటోరియం లోపల అందంగా ముస్తాబైన వేదిక. అభిమానులు, అతిథులు ఎక్కువ మంది కూర్చునే విధంగా భారీ సామర్థ్యం ఉన్న వేదిక ఇది.

ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్‌, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు పోషిస్తున్నారు.. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

English summary
Arrangements for Ram Charan's Yevadu audio function at Shilpa Kala Vedika. Audio launch today. Now the latest buzz is Power Star Pawan Kalyan will grace Yevadu audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu