»   » నేను చికెన్ బిర్యానీ తింటున్నానని ట్వీట్ చేసినా.. పాకిస్థాన్‌కు వెళ్లగొడుతారేమో..

నేను చికెన్ బిర్యానీ తింటున్నానని ట్వీట్ చేసినా.. పాకిస్థాన్‌కు వెళ్లగొడుతారేమో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశంలోని సమస్యలపై మాట్లాడటానికి భయమేస్తున్నది. ఎందుకంటే దేశద్రోహిగా చిత్రీకరించి పాకిస్థాన్‌కు వెళ్లమంటారో ఏమోననే భయం వెంటాడుతున్నది అని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ అభిప్రాయపడ్డారు. తెరే మేరే సప్నే చిత్రంతో హిందీ తెరకు పరిచయమై మున్నాభాయ్ ఎంబీబీఎస్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్న అర్షద్ వార్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఇటీవల జాతీయ మీడియాకు చెందిన ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సమకాలీన రాజకీయాలపై, సామాజిక అంశాలపై స్పందించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు.

ఏం మాట్లాడాలన్నా భయమే..

ఏం మాట్లాడాలన్నా భయమే..

ఎదుటి వాళ్లతో మాట్లాడాలన్న అభద్రతాభావం ఏర్పడుతున్నది. ఏదైనా అంశంపై సోషల్ మీడియాలో స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికి అసౌకర్యంగా ఫీలవుతున్నాను అని అర్షద్ వార్సీ అన్నారు. ప్రముఖ రచయిత అరుందతీ రాయ్‌ని రాళ్లతో కొట్టకుండా ఆర్మీ జీప్‌కు వేలాడి దీసి లాక్కేళ్లాలని బీజేపీ ఎంపీ, సినీ నటుడు పరేశ్ రావెల్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అర్షద్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తున్నది.

సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు..

సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు..

జాతీయ సమస్యలపై గానీ, ఇతర అంశాలపైగానీ ఎవరైనా ప్రముఖులు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ స్పందిస్తే ఆ వ్యక్తిని సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు అని అర్షద్ వార్సీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదైనా మాట్లాడితే ప్రతి ఒక్కరికి చేదు అనుభవం ఎదురవుతున్నది. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి తీరు సమంజసం కాదు. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉంటున్నాను. దాంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటున్నాను అని అర్షద్ వార్సీ తెలిపాడు.

చికెన్ బిర్యానీ తింటున్నానని అంటే..

చికెన్ బిర్యానీ తింటున్నానని అంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిస్థితి ఎలా ఉందటే.. ఒకవేళ నేను లంచ్‌లో చికెన్ బిర్యానీ తింటున్నాను అని ట్వీట్ చేసినట్లయితే నన్ను పాకిస్థాన్‌కు పొమ్మంటారేమో అనే సందేహాన్ని అర్షద్ వ్యక్తం చేశాడు. ఎలాంటి చర్యలను పనిగట్టుకొని కొందరు చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అని అర్షద్ పేర్కొన్నారు.

అరుంధతీ రాయ్‌పై పరేశ్ రావెల్

అరుంధతీ రాయ్‌పై పరేశ్ రావెల్

రచయిత అరుంధతీ రాయ్‌పై పరేశ్ రావెల్ చేసిన ట్విట్టర్‌ దాడిపై సోషల్ మీడియాలో చాలా మంది హర్షం వ్యక్తం చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ దేశంలో తమకు నచ్చిన విధంగా మాట్లాడే హక్కు, భావప్రకటనా స్వాతంత్ర్యం లేదా అని పలువురు ప్రశ్నించడం గమనార్హం.

English summary
"Look how nervous I'm right now to even talk to you about it. That's how uncomfortable I am when it comes to making my opinion on different matters public, either on social media or otherwise," Arshad Warsi told media. If I tweet that I had chicken biryani for lunch, I'll be told to stay in Pakistan. That's the fear," said Arshad Warsi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu