»   » కోట్ల రూపాయలతో భారీ సెట్ లు, లీకైన డైలాగ్: సైరా అప్డేట్స్ ఇవే

కోట్ల రూపాయలతో భారీ సెట్ లు, లీకైన డైలాగ్: సైరా అప్డేట్స్ ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi "SYERA" Movie Updates Here

ప్రస్తుతం "సైరా -నరసింహారెడ్డి" సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 శతాబ్దాలకు పూర్వం చరిత్రను చెప్పాల్సి ఉండడంతో.. సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్.. అలనాటి కాలానికి చెందిన సెట్స్ ను ఆవిష్కరించేందుకు బోలెడంత కష్టపడుతున్నారు. "అప్పటి కాలానికి చెందిన రిఫరెన్స్ లు ఏమీ లేవు. బ్రిటిష్ పాలన.. తొలి స్వతంత్ర సమరానికి ముందు కాలం నాటి సెట్స్ వేయాల్సి ఉంది. కేవలం స్కెచ్ ల పైనే 15 మంది పని చేస్తుండగా.. పలు పుస్తకాలు.. వీడియోలు.. చరిత్రకారుల నుంచి రిఫరెన్స్ లు తీసుకుంటున్నాం" అని రాజీవన్ చెప్పారు.

భారీ సెట్స్ నిర్మాణం

భారీ సెట్స్ నిర్మాణం

హైద్రాబాద్.. పొలాచ్చి.. రాజస్థాన్ లతో పాటు పలు ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. అయితే.. ఇవి చాలా గ్రాండ్ గా ఉంటాయని మినహాయిస్తే.. మరే ఇతర వివరాలను చెప్పలేనని అంటున్నారు రాజీవన్. కానీ సైరా లో నటించే నటీనటులు.. టెక్నీషియన్స్ కే కాకుండా.. కేవలం ఈ సెట్స్ కే చాలా కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారట.

ఫస్ట్ లుక్ పోస్టర్

ఫస్ట్ లుక్ పోస్టర్

సో బడ్జెట్ 200 కోట్లకి చేరువలో ఉంటుందన్న విషయం లో అనుమానాలేం లేవన్నమాట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు వివిధ వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోనే చిత్రం ఎలా వుండబోతోందన్న క్లారిటీ ఇచ్చారు మేకర్స్.


బడ్జెట్ 200 కోట్లకు చేరుతోంది

బడ్జెట్ 200 కోట్లకు చేరుతోంది

ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనా వేయగా అది ఇప్పుడు 200 కోట్లకు చేరుతోందని అంచనా వేస్తున్నారు. అయినా ఖర్చుకు వెనకాడకుండా కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ సిద్ధంగా వున్నారు. ఎంత ఖర్చైనా పెట్టి సినిమాను బాహుబలి రేంజ్ లో హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అంచనాలకు మించి

అంచనాలకు మించి

ఇప్పటికే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లోనూ హీరోగా నటించిన చిరంజీవి అక్కడి ప్రేక్షకులకు కొత్త కాదు. మరోవైపు కేంద్ర మంత్రిగా కూడా దేశమంతా చిరంజీవి సుపరిచితులు. దీనికితోడు సైరా నరసింహారెడ్డిలో కాస్ట్ అండ్ క్రూ కూడా అంచనాలకు మించి వుండటంతో సెట్స్ పైకి వెళ్లకముందే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

అంతేకాక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండటం, నయనతార,జగపతిబాబు,కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి లాంటి నటీనటులు వుండటం సినిమాకు బిజినెస్ పరంగా కలిసొచ్చే అంశాలు. ఇక ఈ డబ్బుల గోల పక్కన పెడితే తాజాగా సెట్స్ మీదకు ఇంకా వెళ్లని '' సైరా ...... నరసింహారెడ్డి '' సినిమాలోని డైలాగ్ ఇదే అంటూ తెగ ప్రచారం సాగుతోంది .


డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది

డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది

ఈ డైలాగ్ అసలు సైరా ..... నరసింహారెడ్డి సినిమాలోనిదేనా ? కదా ? అనేది పక్కన పెడితే డైలాగ్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంది. '' ఒరేయ్ ..... నేను ఒట్టి చేతులతో వచ్చా ...... నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్ ! అయినా నా చెయ్యి మీసం మీదకి పోయేసరికి నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా ..... '' అనే పవర్ ఫుల్ డైలాగ్ ఫిలిం నగర్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది .


మెగా ఫ్యాన్స్

మెగా ఫ్యాన్స్

ఇది సైరా సినిమాలో నిదేనా అన్న విషయం ఇంకా తెలియలేదు . ఈ లీకుల విషయాన్నీ పక్కన పెడితే ఇటీవలే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు.అంచనాలకు మించి

అంచనాలకు మించి

ఫస్ట్ లుక్ లో చిరంజీవి లుక్ కూడా అంచనాలకు మించి వుండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది. తాజాగా ఈ సినిమాకు హాలీవుడ్ కు చెందిన వెటా(WETA Studios) స్టూడియోస్ నుంచి మద్దతు లభించింది. మరి ఇప్పటికే అంచనాలు పెంచేసిన చిరు 151 రాను రాను ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.English summary
Art Director Rajeevan FOr Sye Raa Narasimha Reddy Movie settings and latest updates, and a dialogue leaked forom this movie
Please Wait while comments are loading...