»   »  రాజమౌళి శిష్యుడు సినిమాలో వేషం కావాలంటే....

రాజమౌళి శిష్యుడు సినిమాలో వేషం కావాలంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ajay
ప్రముఖ దర్శకులు రాజమౌళి, సురేంద్ర రెడ్డి, మెహర్ రమేష్, క్రిష్ లతో పని చేసినా కన్నన్ (జింతాక్ కన్నన్) ను దర్శకుని గా పరిచయం చేస్తూ విశాలాక్షి క్రియేషన్స్ వారు ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. టైటిల్ సారాయి వీర్రాజు. హీరో గా అజయ్ నటించనున్నాడు.

అయితే ఈ చిత్రానికి గానూ నాటక రంగం లో అనుభవం వున్న నటీనటులు అవసరముందని దర్శక,నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. వీరికి సినిమాల్లో అనుభవం లేకపోయినా నటనానుభవం వుంటే చాలు. అయితే కొంచెం ఒడ్డు పొడుగు వుండాల్సి వుంటుంది. వీరి వయస్సు 30 నుండి 40 మద్యలో వుండాలి. అలాగే 7 నుండీ 10 లోపు వయస్సు గల చిన్న పిల్లలు (అబ్బాయిలూ, అమ్మాయిలూ కూడా) కూడా ఈ చిత్రానికి కావాల్సి వుంది.

పైన చెప్పిన అర్హతలూ, నటన అంటే ఇష్టం వున్న వారందరూ dskannanagni@gmail.com అన్న మెయిల్ ఐడి కి తమ తమ ఫొటో ల తో పాటూ వివరాలను పొందుపరచి పంపవచ్చును. అలాగే ఈ చిత్రం కోసం ఒక female assistent director కూడా కావలంటున్నారు. మాస్ లేదా విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసి సినిమాల పై అవగాహన వున్నవారు అప్లై చేయవచ్చును (వీరికి కూడా ఖచ్చితం గా సినిమా అనుభవం వుండాలి అన్న రూల్ ఏమీ లేదు). ఇక ఆ అర్హతలు మీలో ఉన్నట్లు భావిస్తున్నట్లయితే వెంటనే ఫొటోలతో సంప్రదించండి. బెస్ట్ ఆఫ్ లక్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X