»   » సూపర్...: రామ్ చరణ్‌కి పర్‌ఫెక్టుగా సూటయ్యే విలన్!

సూపర్...: రామ్ చరణ్‌కి పర్‌ఫెక్టుగా సూటయ్యే విలన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో చెర్రీ స్టంట్ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడి పాత్రలో తమిళ నటుడు అరుణ్ విజయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘ఎంత వాడు గానీ' చిత్రంలో అరుణ్ విజయ్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. దీంతో అరుణ్ విజయ్ ని రామ్ చరణ్ సినిమాలోకి తీసుకున్నారు. అతను రామ్ చరణ్‌కు పర్ ఫెక్టుగా సూటయ్యే విలన్ అని తెలుగు సినీ వర్గాల్లో చర్చసాగుతోంది.

కాగా సినిమాలో తన పాత్ర కోసం రామ్ చరణ్ థాయ్లాండ్ వెళ్లి కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ‘బ్రూస్ లీ' అనే మరో టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కథ ప్రకారం ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ' అనే టైటిలే బెటరని, అదే ఫిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడ నుంది.

Arun Vijay playing Antagonist in Ram Charan film

సినిమాలో కూడా రామ్ చరణ్ బ్రూస్ లీ టాటూతో కనిపించబోతున్నారని అంటున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని, గతంలో ఏ తెలుగు సినిమాలోనూ లేని విధంగా సూపర్బ్ అనిపించే విధంగా స్టంట్స్ మనం ఈచిత్రంలో చూడబోతున్నామని టాక్.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించని షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ చాలా బాగా వచ్చిందని, దర్శకుడు శ్రీను వైట్ల, రైటర్ గోపీ మోహన్ ఔట్ పుట్ మీద చాలా హ్యాపీగా ఉన్నారని, ముఖ్యంగా రామ్ చరణ్ కామిక్ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టకుంటుందని అంటున్నారు.

English summary
Sources close to the unit say, Arun Vijay is playing the Antagonist in Ram Charan-Srinu Vytla's untitled flick. It's going to be a powerful role on par with that of Charan's in this high-budget flick.
Please Wait while comments are loading...