»   » 'బీడి'లో అరుంధతి, మగధీర!

'బీడి'లో అరుంధతి, మగధీర!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాంకేతికంగా ప్రపంచం రోజు రోజుకి ఎంతగానో అభివద్ది చెందుతోంది. క్యాసెట్, క్యాసెట్ తర్వాత సీడి..తర్వాత డివిడీలు ఇలా ఎన్నోరకాలుగా వస్తున్నాయి. తాజాగా వీటి స్థానంలో బ్లూ రే డిస్క్ లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. 2006 జూన్ లో 50 ఫస్ట్ డేట్స్" హాలీవుడ్ చిత్రం తొలిసారిగా జ్లూరే డిస్క్ గా విడుదలైనలది. అప్పట్లో వెయ్యికు పైగా హాలీవుడ్ సినిమాలు 'బ్ల్యూరే" డిస్క్ లుగా విడుదయ్యాయి. తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ నుండి తొలిసారి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన 'మగధీర", 'అరుంధతి" చిత్రాలను బ్లూ రే డిస్క్ రూపంలో విడుదల చేయబోతున్నారు. ఇండియన్ మార్కెట్లోకి బ్లూరే డిస్క్ రూపంలో విడుదలఅవుతున్న తొలి చిత్రం ఇదే కావటం విశేషం.

గతంలో నాగార్జున 'కింగ్" చిత్రం బ్లూ-రే డిస్క్ రూపంలో భవాని డివిడీ ద్వారా ఓవర్సీస్ మార్కెట్లో మాత్రమే విడుదల చేశారు. ఇదిలా ఉంటే తెలుగు నాటా కూడా ఈ హై డెఫినేషన్ టెక్కాలజీ" ఊపందుకుంటోంది. ఇండయన్ మార్కెట్లో బ్లూరే డిస్క గా విడుదలైన తొలి తెలుగు చిత్రంగా 'అరుంధతి" సరికొత్త చిత్రకు శ్రీకారం చుట్టింది. న్యూ ఓల్గా వీడియోస్ సంథ్థ ఈ బ్లూరే డిస్క్ ను వారం రోజుల క్రితం, మార్కెట్ లోనికి విడుదల చేసింది. బ్లూరే డిస్క్ చిత్రం చూడటం ప్రేక్షకునికి ఓ అద్భుతమైన అనుభవం. ఒక డిస్క ఖరీదు వెయ్యి రూపాయలకు మించే అవుంతుంది. అయితే తెలుగులో తొలిసారిగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుశవాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశముతో బాగా ధర తగ్గించి 'అరుంధతి" ని మార్కెట్ లోకి విడుదల చేశాం. కొత్తదనాన్ని ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో గీతాఆర్ట్స్ సంస్థ శ్రీ బాలాజీ వీడియోస్ తో కలిసి 'మగధీర" చిత్రాన్ని బ్ల్యూ-రే డిస్క్ గా రూపంలో విడుదల చేయనున్నారు. త్వరలో 'మగధీర" బ్ల్యూ-రే డిస్క్ లు మార్కెట్లోకి విడుదలకానున్నాయి. త్వరలో అన్నమయ్య, పోకిరి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాలను కూడా బ్లూరే డిస్క్ లుగా విడుదల చేసే ఆలోచన ఉంది అని చెప్పారు అందుకే మరిన్ని కంపెనీలు కూడా ఈ బ్ల్యూరే డిస్క్ రూపకల్పనకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu