»   » జాతీయ గీతం పై సంచలన వ్యాఖ్య ... చిక్కుల్లో పడ్డ ధృవ విలన్ అరవింద స్వామి

జాతీయ గీతం పై సంచలన వ్యాఖ్య ... చిక్కుల్లో పడ్డ ధృవ విలన్ అరవింద స్వామి

Posted By:
Subscribe to Filmibeat Telugu

అరవింద్‌ స్వామి.. అందగాడు.. అద్భుతమైన నటుడు. 'రోజా', 'బొంబాయి' సినిమాల్లో అరవింద్‌ స్వామి నటన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే వుంటుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా, 'రోజా' 'బొంబాయి' స్థాయిలో అరవింద్‌ స్వామికి పాపులారిటీ తెచ్చిపెట్టిన సినిమా ఇంకోటి లేదనడం అతిశయోక్తి కాదేమో. తమిళంలో మొన్నామధ్యన వచ్చిన 'తని ఒరువన్‌' సినిమాతో మళ్ళీ అరవింద్‌ స్వామి శకం ప్రారంభమయినట్లుంది.

తెలుగులో 'తని ఒరువన్‌' రీమేక్‌ 'ధృవ' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అరవింద్‌ స్వామి ఎలా వుంటాడోగానీ, తమిళంలో 'తని ఒరువన్‌' కాంబినేషన్‌లోనే మరో సినిమా వచ్చేస్తోంది. అదే 'బోగన్‌'. 'బోగన్‌'లో జయం రవి, అరవింద్‌ స్వామి కలిసి నటిస్తున్నారు. 'తని ఒరువన్‌'లో జయం రవి హీరో కాగా, అరవింద్‌ స్వామి విలన్‌. 'బోగన్‌'లో మాత్రం ఇద్దరూ కలిసి స్నేహితుల్లా కనిపిస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ అందరు నటుల్లానే తానూ ట్విటర్లో ఒక అభిప్రాయం చెప్పి చిక్కుల్లో పడ్డాడు ఈ రోజా హీరో

Arvind Swamy questions Supream Court’s decision to play national anthem in cinema

భారత ప్రభుత్వం ప్రతి సినిమా థియేటర్లో సినిమా మొదలవడానికి ముందు జాతీయ గీతాన్ని ఖచ్చితంగా ఆలపించాలని రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అన్ని థియేటర్లకు ఉత్తర్వులు పంపాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకత తెలుపుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికే చెందిన పలువురు ప్రముఖులు ఈ నిర్ణయాన్ని స్వాగతించడం లేదు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు అరవింద స్వామి కూడా ఉన్నారు.

''అసలు థియేటర్లో సినిమాకి ముందు జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలో ఎవరైనా వివరిస్తారా? ఎక్కడైనా దేశానికి ప్రాతినిధ్యం వహించే చోట.. లేదా వేలమంది గుమిగూడేఒక క్రీడా సంబంధిత ఈవెంట్లోనో జాతీయగీతం పాడించడం అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ థియేటర్లలో వందల మందిని లోపల బ్లాక్ చేసి ఎగ్జిట్లు మూసేసి జాతీయ గీతం పాడించడమేంటో అర్థం కావడం లేదు. ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తే బాగుంటుంది. 1997 లో ఉపహార్ థియేటర్లలో ఎగ్జిట్లు లాక్ చేయడం వల్ల జరిగిన దుర్ఘటనను ఈ సందర్భంలో ఓసారి గుర్తు చేసుకోవాలి'' అని అరవింద్ స్వామి అన్నాడు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా జాతీయ గీతం పాడించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెల్సిందే. అయితే ఈ నటుడు చేసిన ట్వీట్ కి వ్యతిరేకంగా కూడా నిరసనలు బాగానే వచ్చాయి .

English summary
Arvind Swamy questioned the Supreme Court’s recent decision of playing the national anthem mandatory in all cinema halls across the country.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu