»   »  రంగస్థలం రిజల్ట్‌ని డిసైడ్ చేసిన రాంచరణ్ బెస్ట్ ఎనిమి!

రంగస్థలం రిజల్ట్‌ని డిసైడ్ చేసిన రాంచరణ్ బెస్ట్ ఎనిమి!

Subscribe to Filmibeat Telugu
Ramcharan Get Apreciated By Arvind Swamy

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి షో నుంచే ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పల్లెటూరి యువకుడిగా, వినికిడి లోపంతో రాంచరణ్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు దక్కుతున్నాయి. రంగస్థలం పాజిటివ్ టాక్ తో భారీ వసూళ్లు సాధించడం ఖాయం అని అప్పుడే ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రముఖుల నుంచి రంగస్థలం టీంకు శుభాకాంక్షలు అందుతున్నాయి. తమిళ నటుడు అరవింద్ స్వామి రంగస్థలం చిత్రం విజయానికి సంబందించిన విషయాన్ని చెబుతూ రాంచరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

 చిట్టిబాబు సందడి

చిట్టిబాబు సందడి

ఏడాది కాలంగా ఆసక్తి కలిగిస్తున్న రంగస్థలం చిత్రం ఎట్టకేలకు నేడు( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. చిట్టిబాబుగా రాంచరణ్ ఇరగదీశాడు అంటూ అభిమానులు తమ స్పందన తెలియజేస్తున్నారు.

కళ్ళకు కట్టినట్లు చూపించిన సుకుమార్

కళ్ళకు కట్టినట్లు చూపించిన సుకుమార్

రంగస్థలం చిత్రంలో దర్శకుడు సుకుమార్ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. 1980 నాటి పల్లెటూరి పరిస్థితులని కళ్ళకు కట్టినట్లు చూపించాడు.సుకుమార్ మ్యాజిక్ మరో మారు పనిచేసిందని అభిమానులు అంటున్నారు.

 అరవింద్ స్వామి రెస్పాన్స్

అరవింద్ స్వామి రెస్పాన్స్

రంగస్థలం చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతమైన విషయం సినీ ప్రముఖులందరికి తెలిసిపోయింది. సినీప్రముఖులు రాంచరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమిళ నటుడు అరవింద్ స్వామి రంగస్థలం చిత్రం గురించి స్పందించాడు. రంగస్థలం చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్న విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

 రాంచరణ్ ప్రియమైన శత్రువుగా

రాంచరణ్ ప్రియమైన శత్రువుగా

ధృవ చిత్రంలో అరవింద్ స్వామి రాంచరణ్ తో కలసి నటించిన సంగతి తెలిసిందే. ధృవ చిత్రంలో అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్రలో జీవించాడు. ధృవ చిత్రం రాంచరణ్ కెరీర్ లో మంచి హిట్ మూవీగా నిలిచింది. రంగస్థలం చిత్రం విజయం సాధించిన సందర్భంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

English summary
Arvind Swamy wished Ram Charan and Rangasthalam team for movie success
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X