ఆర్య-2 వాయిదా పడిందా?
అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్య-2. అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన ఆర్య చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. నవదీప్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు, ఆదిత్య బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా తొలుత ఈ చిత్రాన్ని సెపెంబరు 19న విడుదల చెయ్యాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత అక్టోబరు 1న విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ఏంటంటే ఇప్పుడీ చిత్రం విడుదల తేదీ మరో సారి వాయిదా పడింది. అక్టోబరు 9న విడుదల కాబోతోందని సమాచారం.
arya2 release postponed allu arjun sukumar navdeep sradda das ఆర్య2 విడుదల వాయిదా అల్లు అర్జున్ సుకుమార్ కాజల్ అగర్వాల్ నవదీప్ శ్రద్ధా దాస్


Click it and Unblock the Notifications