»   » ట్రైనర్ నా రసం తీసాడు: వెంకీ

ట్రైనర్ నా రసం తీసాడు: వెంకీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'వెంకటేష్' బాలీవుడ్ లో సూపర్ హిట్టు అయిన 'సాలా ఖద్దూస్' రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందరు హీరోలూ మాస్, మసాలా.. అంటూ పరుగులు తీసే సమయం లో కూడా వెంకీ చాలాకూల్ గా తన స్టైల్ లో తాను నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, గోపాల గోపాల లాంటి సినిమాలు చేస్తూ పోయాడు. నిజానికిన్ ప్రతీ సినిమా ఒక ప్రయోగమే. హీరో కూడా కామెడీ చెయ్యగలడు అని నిరూపించిన వెంకీ. మల్టీస్టారర్ దిశగా కూడా ఏమాత్రం ఈగోలేకుండా అడుగులు వేసాడు.

ఆ పాత్ర కోసం కష్టపడ్డాడు

ఆ పాత్ర కోసం కష్టపడ్డాడు

పెద్ద హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే దృశ్యం లాంటి సినిమా చేసి తన ఆలోచనా ధోరణి ఏమిటో చెప్పేసాడు. ఇప్పుడు వస్తోన్న "గురు" కూడా టాలీవుడ్ అగ్రహీరోలు కాస్త ఆలోచించూనే సబ్జెక్ట్. అయినా కూడా వెంకీ మాత్రం ఒప్పుకున్నాడు, ఆ పాత్ర కోసం కష్టపడ్డాడు వెంకటేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'గురు' సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సర్వ హంగులూ సొంతం చేసుకుంటోంది.

 బాక్సింగ్‌ ట్రైనర్‌గా

బాక్సింగ్‌ ట్రైనర్‌గా

హిందీలో వచ్చిన 'సాలా ఖడూస్‌' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌. ఇందులో వెంకటేష్‌ బాక్సింగ్‌ ట్రైనర్‌గా నటిస్తుండగా, బాక్సింగ్‌ కాంపిటేషన్స్‌కి ప్రిపేర్‌ అయ్యే యువతిలా రితిక నటిస్తోంది. హిందీ వెర్షన్‌తో పోల్చితే తెలుగు వెర్షన్‌ కోసం చాలా మార్పులు చేశారట.

సినిమా రేంజ్‌ని పెంచేలా

సినిమా రేంజ్‌ని పెంచేలా

ఆ మార్పులు సినిమా రేంజ్‌ని పెంచేలా ఉంటాయని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం వెంకటేష్‌ బాగా వెయిట్‌ పెరిగాడు. కండలు తిరిగే దేహాన్నీ సొంతం చేసుకున్నాడు. వెరైటీ గెటప్‌తో ఇప్పటికే సినిమా స్టిల్స్‌లో వెంకీ సందడి చేస్తున్నాడు. ఈ సినిమాకోసం తాను పడ్డ కష్టమేమిటో తానే చెప్పాడిలా.....

సుధ కొంగర ‘గురు’ కథ చెప్పింది

సుధ కొంగర ‘గురు’ కథ చెప్పింది

‘‘గతంలో నేను చేసిన సినిమాలతో మొనాటనీ వచ్చేసింది. నా ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఒకేలా అనిపిస్తూ వచ్చాయి. దీంతో మార్పు కోసం చూశాను. బాలీవుడ్లో వచ్చిన చక్ దే ఇండియా లాంటి సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో ఒక దర్శకుడు క్రికెట్ నేపథ్యంలో కథ తీసుకొచ్చాడు. కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. అప్పుడే సుధ కొంగర ‘గురు' కథ చెప్పింది. బాగా నచ్చింది.

 అప్పుడు చేయలేకపోయాను

అప్పుడు చేయలేకపోయాను

అప్పటికి ఆమె ఈ చిత్రాన్ని తమిళం.. హిందీల్లో తీయలేదు. ముందు నాకే కథ చెప్పింది. కానీ అప్పుడు చేయలేకపోయాను. తమిళం ఈ సినిమాను విడుదలకు ముందే చూశాను. అప్పుడిక నాతో చేయమని చెప్పాను. మూడు దశాబ్దాల్లో నేను నేర్చుకోనిది ఈ సినిమాతో నేర్చుకున్నాను.

ట్రైనర్ నా రసం తీశాడు

ట్రైనర్ నా రసం తీశాడు

నా కెరీర్లో తొలిసారి పూర్తి స్క్రిప్టు చదివింది ఈ సినిమాకే. ఈ స్క్రిప్టు చదువుతుంటే ఒక కొత్త ఎనర్జీ వచ్చిందని మా అన్నయ్య సురేష్‌కు చెప్పాను. నా పాత్ర కోసం రిహార్సల్స్ కూడా చేశాను. అమెరికాలో నా ట్రైనర్ నా రసం తీశాడు. ఒక బాటిల్ నీళ్లు ఇస్తే బావుణ్నే అనుకుంటే దాన్ని విసిరి కొట్టేవాడు. ఆ ట్రైనింగ్ తీరునే సినిమాలోనూ పెట్టాం. నా పాత్రకు అది బాగా ఉపయోగపడింది'' అంటూ గురు కోసం తాను ఎంత కష్టపడ్డాడో చెప్పాడు.

English summary
Venky has recruited a fitness expert and trained rigorously for nine months to get into the beefy look. He is on a strict diet and done a lot of work out in his personal gym to look the part as boxer
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu