»   » మనవరాలిని నిలబెట్టాలనే ప్రోత్సాహం

మనవరాలిని నిలబెట్టాలనే ప్రోత్సాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ నేపథ్య గాయకురాలు ఆషా భోంస్లే తన మనవరాలు జనాయ్‌(12) కూడా తన మాదిరిగానే నేపథ్య గాయకురాలు కావాలని కలలు కంటున్నారు. ఇప్పటికే ఈ దిశగా ఆమె తన కుమారుడు ఆనంద్‌ కుమార్తె జనాయ్‌కి శిక్షణనివ్వటం ఆరంభించారు. గత ఏడాది మాయ్‌ సినిమాలో తొలిసారిగా ఆమెతో పాడించారు కూడా. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె జనాయ్‌తో కలిసి అవార్డుల కార్యక్రమంలో వేదిక పంచుకున్నారు.

జీవితంలో తాను కోరుకున్న పాటలు పాడటం, నటన, టీవీ షోలు, స్టేజ్‌ ప్రదర్శనలు సర్వం సాధించానని, ఇటీవలే ర్యాంప్‌ మీద కూడా ఫ్యాషన్‌ షోలో కనిపించానని , ఇప్పుడు మనమరాల్ని నేపథ్య గాయనిగా చూడటమే తరువాయి అని ఆమె చెప్పారు. తను, తన సోదరి లతా మంగేష్కర్‌లు కలగలిపిన అద్భుతమైన గాత్రం జనాయ్‌ సొంతమని అన్నారు. గాయనిగా తన కెరీర్‌ ఆరంభంలో ప్రముఖ గాయనీల నుంచి ఎన్నో సవాళ్లని ఎదుర్కోవటంతో తనదైన శైలిలో పాటలు పాడటం ఆరంభించి ఈ స్థితికి చేరుకున్నానని ఆమె ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు.

Asha Bhosle Wants to Groom Granddaughter as Playback Singer

''నేను పరిశ్రమలోకి గాయనిగా వచ్చేటప్పటికి చాలా మంది గొప్ప గాయనీగాయకులు ఇక్కడ ఉన్నారు. వారందరిలో నేను భిన్నం అనిపించుకోవడానికి చాలా కష్టపడ్డాను. అలా కొత్తగా చేసిన ప్రయత్నమే 'ఈనా మీనా దీకా..'. ఈ పాట విన్న వాళ్లలో చాలా మంది 'ఏంటి అలా పాడావు' అంటూ విమర్శించారు. కానీ ఆ పాట నాకు ఎంతో మంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది'' అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ప్రముఖ గాయని ఆశా భోంస్లే.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆశా అనేక విషయాల్ని పంచుకున్నారు. ''పరిశ్రమలో మంచి గీత రచయితలకు కొరత ఏర్పడింది. ఐటెమ్‌ సాంగ్స్‌ ఫ్యాషన్‌ అయిపోయాయి. కొన్ని పాటలు వింటుంటే చిరాకు పుడుతోంది. 'లుంగి డ్యాన్స్‌', 'మున్నీ బద్నామ్‌', 'హల్కత్‌ జవాని' లాంటి పాటల్లో సాహిత్యం మితిమీరిపోతోంది. ఇదే సమయంలో 'జబ్‌ సే తేరే నైనా' లాంటి పాటలు బాగుంటున్నాయి'' అంటూ నేటి బాలీవుడ్‌ పాటల గురించి చెప్పుకొచ్చారు

తన మనవరాలు జానై భోంస్లే గురించి చెబుతూ ''గానం, నటన, టీవీ షోలు, స్టేజీ షోలు, ర్యాంప్‌ వాక్‌.. ఇలా నా జీవితంలో అన్నీ చేసేశాను. ఇక నా మనవరాలు జానైని గొప్ప గాయనిగా చూడాలన్నదే నా లక్ష్యం. ఆమె గాత్రం చాలా బాగుంటుంది. నా, లత వాయిస్‌ కలిపినట్లుగా ఉంటుంది. జానైను ఉత్తమ గాయనిగా తీర్చిదిద్దేందుకు నా వంతు ప్రయత్నాలు చేస్తాను'' అని తెలిపారు. జానై గతేడాది 'మాయి' అనే సినిమా ద్వారా గాయనిగా పరిచయమైంది.

English summary
Asha Bhosle says she wants to see her granddaughter become a playback singer like herself and is already in the process of preparing her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu