»   » ‘మహానటి’ ఎఫెక్ట్, అశ్వినీదత్‌లో ఉత్సాహం: మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో వరుస సినిమాలు!

‘మహానటి’ ఎఫెక్ట్, అశ్వినీదత్‌లో ఉత్సాహం: మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో వరుస సినిమాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వైజయంతి మూవీస్... తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన బేనర్. 1974లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో 'ఓ సీత కథ'తో మొదలైన ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించి టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగింది. ఎన్టీఆర్ హీరోగా 2008లో తీసిన 'కంత్రి', 2011లో తీసిన 'శక్తి' ప్లాప్ అవ్వడంతో తీవ్రంగా నష్టపోయిన అశ్వినీదత్ సినిమాలు ఆపేశారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత గ్యాప్ తర్వాత 'మహానటి' మూవీతో మళ్లీ వైజయంతి బేనర్ టాలీవుడ్లో విజయపతాకాన్ని రెపరెపలాడింది. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో దత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కావాలనే సినిమాలు తీయడం ఆపాను

కావాలనే సినిమాలు తీయడం ఆపాను

7 సంవత్సరాల క్రితం వైజయంతి మూవీస్‌లో సినిమాలు తీయడం ఆగిపోయింది. నేనే కావాలని ఆపాను. వరుస ప్లాపులు తీయడం కంటే సినిమా తీయకుండా ఉండటం బెటర్ అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. అప్పట్లో ఒకటిరెండు సినిమాలు బాగా డిసప్పాయింట్ చేయడం వల్లే సినిమాలు వద్దనుకున్నాను అని అశ్వినీదత్ తెలిపారు.

'మహానటి' చిత్రం చూసిన చిరంజీవి ఏమన్నడో తెలుసా???
‘శక్తి' పై బాగా నమ్మకం పెట్టుకున్నా కానీ

‘శక్తి' పై బాగా నమ్మకం పెట్టుకున్నా కానీ

అప్పట్లో ‘శక్తి' సినిమాను భారీ అంచనాలతో, బాగా కష్టపడి చేశాం. ‘శక్తి' మూవీలో తారక్ పెర్ఫార్మెన్స్, కథ ఎంతో బావుంటాయి. కానీ అనుకోని విధంగా సినిమా డిసప్పాయింట్ చేసింది. జాతక రీత్యా కూడా సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తే బావుంటుందని చెప్పడంతో సినిమాలు తీయడం మొత్తానికే ఆపేశాం అని అశ్వినీదత్ తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీయొద్దని చెప్పారు

సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీయొద్దని చెప్పారు

మా నాన్నగారిని ఒప్పించి విశ్వనాథ్ గారితో ‘ఓ సీత కథ' సినిమాతో కెరీర్ మొదలు పెట్టాను. ఈ సినిమా మంచి పేరు రావడంతో పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనే నాలోని అసలైన కోరిక బయటకు వచ్చిది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీరాభిమానిని. రామారావుగారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పాను. ఆయన ఒకటే చెప్పారు. సినిమా వ్యాపారం మంచిది కాదు, ఒక సినిమా తీశావు, నాలుగు డబ్బులు వచ్చాయి. ఇంతటితో వీటిని వదిలేసి బెజవాడ వెళ్లి ఏదైనా వ్యాపారం చేసుకో అన్నారు. కానీ నేను సినిమా తీయడానికే వచ్చాను, తీయకుండా వెళ్లను అని పట్టుబట్టడంతో ఆయన ఒప్పుకున్నారని అశ్వినీదత్ తెలిపారు.

 వైజయంతి బేనర్ పేరు అలా వచ్చింది

వైజయంతి బేనర్ పేరు అలా వచ్చింది

‘ఎదురులేని మనిషి' చిత్రానికి కాల్షీట్లు ఇచ్చేపుడు మీ బేనర్ పేరు ఏమిటి? అని ఎన్టీఆర్ గారు అడిగారు. ఇంకా పెట్టలేదు సార్... మీరే పెట్టాలి అన్నాను. ఆయన వెంటనే కృష్ణుడి మొడలో వైజయంతి మాల.... వైజయంతి మూవీస్ అని పెడదాం అన్నారు. అలా మా బేనర్ పేరు మొదలైంది అని అశ్వినీదత్ తెలిపారు.

అలాంటి సినిమాలు చేయలేదనే అసంతృప్తి

అలాంటి సినిమాలు చేయలేదనే అసంతృప్తి

నా కెరీర్లో బాపురమణ గారితో సినిమా చేయలేదనే అసంతృప్తి ఉంది. శంకరాభరణం రిలీజైనపుడు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సినిమా చేయలేదనే ఓ బాధ ఉండేది. తర్వాత టి కృష్ణ తీసిన ‘ప్రతిఘటన' చూసినపుడు...పెద్ద హీరోలతో ఎన్ని కమర్షియల్ హిట్స్ అయినా తీయవచ్చు కానీ ఇలాంటి సెన్సిటివ్ సినిమాలు తీయలేక పోయానే అని మదన పడుతూ ఉండేవాడిని, ఈ సమయంలో సావిత్రి గారి కథ అనగానే నాలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ సినిమాలో ఆ కోవలోకి వెళ్లే అవకాశం ఉంటుందనే చిన్న ఆశ ఏర్పడింది. ఆవిడను స్మరించుకుంటూ రియల్ క్లాసిక్ అవుతుంది అని నమ్మాను. నా నమ్మకం నిజమైంది అని అశ్వినీదత్ తెలిపారు.

వైజయంతి బేనర్లో వరుస సినిమాలు

వైజయంతి బేనర్లో వరుస సినిమాలు

నేను సినిమాలు ఆపేసిన తర్వాత పిల్లలు స్వప్న, ప్రియాంక ‘స్వప్న సినిమా' పేరుతో బేనర్ మొదలు పెడతాం అంటే వారి మాట కాదనలేక పోయాను. ‘మహానటి' సినిమా మొదలు పెట్టినపుడు వారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఫ్యూచర్లో వై జయంతి బేనర్‌ను నడిపేది వారిద్దరే. ఇకపై వైజయంతి బేనర్లో వరుస సినిమాలు వస్తాయని అశ్వినీదత్ తెలిపారు.

రామ్ చరణ్‌తో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్

రామ్ చరణ్‌తో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్

రామ్ చరణ్ హీరోగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ తీయడానికి గతంలో ప్రయత్నాలు చేసిన మాట నిజమే అని, అయితే కథ అనుకున్న విధంగా రాలేదు. అందుకే ఆ సినిమాను పక్కన పెట్టాం. మేము తీసిన ‘మహానటి' సినిమా సూపర్ హిట్ అయింది. త్వరలోనే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ గురించి ఆలోచన చేద్దామనుకుంటున్నాం. ఇపుడు మా అల్లు నాగి (నాగ్ అశ్విన్) ఉన్నాడు, క్రిష్ ఉన్నాడు, ఇంకా చాలా మంది మంచి దర్శకుల సపోర్ట్ ఉంది. ‘మహానటి' విజయం ఇచ్చిన ఉత్సాహం ఉంది. త్వరలోనే జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఉంటుంది. ఎప్పుడు తీస్తామనేది ఇప్పుడే చెప్పలేను. ప్రాసెస్ మొదలైన తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడతాను అని అశ్వినీ దత్ తెలిపారు.

 మహేష్ బాబు క్వాలిటీగా సినిమాలు చేస్తాడు కాబట్ట అలా

మహేష్ బాబు క్వాలిటీగా సినిమాలు చేస్తాడు కాబట్ట అలా

మహేష్ బాబును మా బేనర్ ద్వారా వచ్చిన ‘రాజకుమారుడు'తో పరిచయం చేశాం. ఆయన చాలా క్వాలిటీగా, చాలా ఆలోచించి సినిమాలు చేస్తారు. అందుకే ఇన్నేళ్లయినా తక్కువ సినిమాలు చేశారు. వేరే హీరో అయితే ఇప్పటికీ 50కిపైగా సినిమాలు చేసేవారు. త్వరలో మహేష్ బాబు 25వ చిత్రం మా బేనర్ మీద రాబోతోంది అని అశ్వినీదత్ తెలిపారు.

English summary
Vyjayanthi Movies Head Ashwini Dutt About His Uocoming Movies With Mahesh Babu, NTR, Ram Charan. Vyjayanthi Movies is an Indian Film production company established in 1974, by C. Ashwini Dutt. It is one of the biggest film production houses in Telugu cinema credited with producing some of the most iconic films in Telugu Cinema history.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X