twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శని నడిచింది, ఎన్టీఆర్ తో సినిమా తీసి 25 కోట్లు నష్టం, సావిత్రిగా ఆమెనే ఫైనల్

    ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు నిర్మాతగా అశ్వనీదత్ కెరీర్ లోనూ డిజాస్టర్ సినిమా శక్తి. భారీ అంచనాలతో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొంది విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు నిర్మాతగా అశ్వనీదత్ కెరీర్ లోనూ డిజాస్టర్ సినిమా శక్తి. భారీ అంచనాలతో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొంది విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. శక్తి సినిమా తర్వాత అశ్వనీదత్ నిర్మాతగా దాదాపు రిటైర్ అయ్యినట్లుగా సైలెట్ అయ్యిపోయారు. ఈ విషయమై ఆయన రీసెంట్ గా మాట్లాడారు. ఆయన ఏమి అన్నారో చూద్దాం.

    అశ్వనీదత్.. నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా కొనసాగుతున్నారు. వైజయంతి మూవీస్‌‌తో తెలుగు సినీతెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి మంచి అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు.

    ఉత్తమాభిరుచి గల నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అశ్వనీదత... నిర్మాత అనే పదానికి స్పష్టమైన నిర్వచనం కూడా అని చెప్తూంటారు సీనియర్స్. ఎంత భారీగా సినిమా తీశామనేదాని కంటే ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ ప్రేక్షకుడికి పదిరెట్లు ఆనందాన్ని అందించాలనే తపన ఉన్న వ్యక్తి.

    'ఓ సీత కథ' సినిమాతో 32 ఏళ్ల కిందట మొదలైన సినీ ప్రస్థానంలో తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులను జనవరి 1 జరిగిన 'ఓపెన్‌ హార్డ్‌ విత్ ఆర్కే' కార్యక్రమంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఎన్నో విషయాలను ఆయన ఇంటర్వూలో పంచుకున్నారు. ఇంకా తన వ్యక్తిగత, సినీ, రాజకీయ విశేషాలను.. ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నారాయన.

    వినకుండా శక్తి సినిమా తీసా

    వినకుండా శక్తి సినిమా తీసా

    2009లో మా సిద్ధాంతి ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే వెళ్లా. ‘‘నీకిప్పుడు ఏలినాటి శని నడుస్తోంది. సినిమాలు ఏమీ తీయమాకు. జాగ్రత్తగా ఉండు. నాన్నగారు కూడా కాలం చేస్తారు'' అని చెప్పారు. ఆయన చెప్పినట్టే 2010 జనవరి 30లో నాన్న చనిపోయాడు. ఆయన మాట వినకుండా శక్తి సినిమా తీశాను అంటూ గుర్తు చేసుకున్నారు అశ్వనీదత్.

    రజనీకాంత్ కూడా చెప్పారు

    రజనీకాంత్ కూడా చెప్పారు

    శక్తి సినిమాతో నాకు 25 కోట్లు లాస్‌. అందరూ కష్టపడ్డారు.కానీ రాంగ్‌ సబ్జెక్ట్‌. శక్తిపీఠాలు, అమ్మవారితో సినిమా తీయడం మంచిది కాదని రజనీకాంత్ గారు కూడా చెప్పారు. వినకుండా తీశాను అని చెప్పారు అశ్వనీదత్.

    నా చేదు అనుభవాలు

    నా చేదు అనుభవాలు

    శక్తి...సినిమా అనుకున్న విధంగా ఆడకుండా సినిమా బాగా డిజప్పాయింట్‌ చేయడం నిర్మాతగా చేదు అనుభవం. ఇక తండ్రిగా అంటే... మా పెద్దమ్మాయి కులాంతర వివాహం చేసుకుంటానన్నప్పుడు ఒకటిన్నర నెల వరకూ మూడ్‌ అవుట్‌ అయిపోయాను. రెండో అమ్మాయి విషయానికి వచ్చేసరికి అలవాటయిపోయింది. మూడో అమ్మాయి మాత్రం పెళ్లి విషయం నా ఇష్టానికే వదిలేసింది అన్నారు అశ్వనీదత్.

    అరవై శాతం సక్సెస్..

    అరవై శాతం సక్సెస్..

    నాకంటే చాలా ఎక్కువ డబ్బులతో ఇండస్ట్రీలోకి వచ్చి, ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయిన వాళ్లతో పోలిస్తే నేను చాలా లక్కీ. నేను 60 శాతం సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌నే అనుకుంటాను అని చెప్పుకొచ్చారు అశ్వనీదత్.

    ఎందుకు రిస్క్

    ఎందుకు రిస్క్

    ఎన్టీఆర్‌తో సినిమా తీయాలనే లక్ష్యంతోనే తాను అసలు చెన్నై బయలుదేరి వెళ్లానని అశ్వనీదత్ చెబుతున్నారు. వైజయంతీ మూవీస్ అని పేరు పెట్టి.. ఎన్టీఆర్‌ స్వయంగా ప్రారంభించడం ద్వారా.. దానికదే స్టార్‌డమ్‌ను సంపాదించుకుందంటున్నారాయన. సినిమా విషయమై ఎన్టీఆర్‌ను కలిసి చెబితే.. ‘ఓరి నీ దుంపతెగ.. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోవయ్యా.. ఎందుకు రిస్క్' అని అన్నారంటున్నారు.

    వీడు ఎప్పుడు పడిపోతాడ్రా

    వీడు ఎప్పుడు పడిపోతాడ్రా

    పేకాడితే ప్రతి ఆట గెలవలేమనీ, రేస్‌లో ప్రతి గుర్రం విజయం సాధించదనీ, సినిమా కూడా అదే కోవకు చెందుతుందంటున్నారు అశ్వనీదత్. రోజుకు వందరూపాయల చొప్పున రూపాయి నోట్లను పొద్దుటి నుంచి సాయంత్రం వరకూ చించుతూ కూర్చున్నా రాని నష్టం.. వ్యాపారం చేస్తే వస్తుందని తనను హెచ్చరించారంటున్నారు. వీడు ఎప్పుడు పడిపోతాడ్రా... అని చూసేవారే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువంటున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టార్‌డమ్‌ను కొనసాగించిన ఘనత చిరంజీవికే దక్కుతుందంటున్నారు.

    మళ్లీ పోటీ చేయను

    మళ్లీ పోటీ చేయను

    చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తనను పిలిచారంటున్నారు. ‘నిన్నగాక మొన్న ఓడిపోయాను. ఈయన అర్జెంటుగా రమ్మంటున్నారు. ఏమిటో' అనుకుంటూ చిరంజీవి వద్దకు వెళ్లానన్నారు. విజయవాడ నుంచి మళ్లీ పోటీ చేయాలని తనకు ఏ మాత్రం లేదని స్పష్టం చేస్తున్నారు అశ్వనీదత్.

    అల్లు అరవింద్ గారు కూడా..

    అల్లు అరవింద్ గారు కూడా..

    థాంక్స్‌ టు కృష్ణగారు. నేనంటే ఇష్టం ఆయనకు. మహేష్‌బాబును నువ్వే లాంచ్‌ చేయాలని అడగడంతో చేశాను. చిరంజీవిగారు కూడా అరవింద్‌ బ్యానర్‌ ఉన్నా కూడా రాంచరణ్‌ను నువ్వే లాంచ్‌ చేయాలని అడిగారు. దాంతో కాదనలేకపోయాను. హరికృష్ణ అడగడంతో జూ.ఎన్టీఆర్‌తో స్టూడెంట్‌నెం1 తీశాను. అల్లు అర్జున్‌తో గంగోత్రి తీశాను.

    ఇంద్ర సినిమాకు వచ్చిన

    ఇంద్ర సినిమాకు వచ్చిన

    ఒకే హీరోతో సినిమా అంటే ఆ రోజుల్లో రెండు, మూడు సంవత్సరాలు వెయిట్‌ చేయాల్సి వచ్చేది. 75లో ఎదురులేని మనిషి తీస్తే 78లో యుగపురుషుడు తీశాను. మళ్లీ ఎన్టీఆర్‌తో తీయాలంటే మరో రెండేళ్లు పడుతుంది. అందుకే నాగేశ్వరరావుతో స్టార్ట్‌ చేశాను. రాజేంద్రప్రసాద్‌లా ఒక్క నాగేశ్వరరావుతోనే కాకుండా రామానాయుడు మాదిరిగా చిన్నా, పెద్దా అందరితో తీయాలని అనుకున్నాను. చిన్న సినిమాలే నాకు చాలా సార్లు హెల్ప్‌ చేశాయి. ఇంద్ర సినిమాకు వచ్చిన ప్రాఫిట్స్‌ చాలా చిన్న సినిమాల్లో చూశాను.

    రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి..

    రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి..

    యంగ్‌ఏజ్‌లో వచ్చి నిర్మాతగా వ్యాపారం మొదలుపెట్టాం. ఇప్పుడు ఇదికాకుండా మరో వ్యాపారం చెద్దామని ఆలోచన రాదు. నిజానికి నాకు హైదరాబాద్‌కు షిప్ట్‌ అవడం అసలు ఇష్టం లేదు. కానీ షిప్ట్‌ కావడం వల్లనే నాకు మేలు జరిగింది. హైదరాబాద్‌కొచ్చాకే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగాను.

    జాగ్రత్తగా ఉండమనిన

    జాగ్రత్తగా ఉండమనిన

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు పెద్ద పెద్ద సెట్‌లు వేస్తుంటే కృష్ణగారు వచ్చి ఎంతవుతుందో నీకు తెలుస్తోందా? అంతెందుకు ఖర్చు పెడుతున్నావు అన్నారు. నాగిరెడ్డి గారయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్లోర్‌లో నా తరువాత రామానాయుడు సెట్స్‌ వేయించారు. తరువాత నిన్నే చూస్తున్నాను. జాగ్రత్తగా ఉండు అన్నారు. ఆయనే దగ్గరుండి కొన్ని సెట్స్‌ వేయించారు. కొన్నిసార్లు పరిధిదాటి వెళ్లినపుడు భయమేసేది. డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్‌ కూడా ఓపెన్‌ చేశాక కొంచెం ధైర్యంగా ఉండేది.

    ఏడు లక్షలు తెచ్చా

    ఏడు లక్షలు తెచ్చా

    నాకు బాగా గుర్తు.మొదట్లో మా నాన్నగారు ఒక ప్యాకెట్‌గా ఏడు లక్షలిచ్చారు. అది 1974లో. ఆ డబ్బులు తీసుకుని మద్రాసు వెళ్లాక ఎంఎస్‌రెడ్డి గారితో మాట్లాడుతూ ఇలా ఏడు లక్షలు తీసుకొచ్చానని చెప్పాను. దాంతో ఆయన ‘నీ దుంపతెగ. టీనగర్‌లో గ్రౌండ్‌ఎంతో తెలుసా? 4800 రూపాయలు. నువ్వు తెచ్చిన డబ్బులతో ఎంత భూమి వస్తుందో తెలుసా' అన్నారు. అప్పటికి ఆయన రియల్‌ ఎస్టేట్‌ చేసేవారు. నిజంగానే ఆ డబ్బులతో కొంటే 125 గ్రౌండ్స్‌ వచ్చుండేవి. ఇప్పుడు దాని విలువ 400 కోట్లుండేది అన్నారు అశ్వనీదత్.

    సంతోషం..ఇంటికెళ్లిపో

    సంతోషం..ఇంటికెళ్లిపో

    ఎన్టీఆర్‌తో మాకు కొద్దిగా బంధుత్వం కూడా ఉంది. అదే విషయాన్ని ఆయనకు కలిసినపుడు చెబితే సంతోషంగా ఫీలయ్యారు. తరువాత మనవాడివి వచ్చావు, సంతోషం. నాలుగు డబ్బులు మిగిలినాయి కదా. ఇక సినిమాలు వద్దు, ఇంటికెళ్లిపో అన్నారు. పైగా నాతో సినిమా అంటున్నావు. నేను మేకప్‌ వేసుకోక చాలా రోజులవుతోంది అన్నారు అని చెప్పుకొచ్చారు అశ్వనీదత్.

    చూస్తూండండి..

    చూస్తూండండి..

    నేను మీతో సినిమా తీసి కాని వెళ్లను అని నేను చెప్పాను. దాంతో ఎంఎస్‌రెడ్డిని పిలిచి మీ ఆఫీస్‌కు దగ్గరలో ఒక ఆఫీస్‌ చూసికాస్త ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఉండండి అని చెప్పారు. తరువాత సినిమాకు డేట్స్‌ ఇస్తూ బ్యానర్‌ పేరేంటి అన్నారు. ఇంకా ఏమనుకోలేదు. మీరే పెడితే బాగుంటుంది అన్నాను. కృష్ణుడి మెడలో వైజయంతి మాల.. వైజయంతి మూవీస్‌ అని పెట్టు అన్నారు. అలా మా బ్యానర్‌ మొదలయింది అన్నారు అశ్వనీదత్.

    కళింగ డిస్ట్రిబ్యూషన్ మాదే..

    కళింగ డిస్ట్రిబ్యూషన్ మాదే..

    మా నాన్నగారు బిజినెస్‌ వ్యవహారాలు చూసుకునే వారు. ఏ1 కాంట్రాక్టర్‌గా ఉండేవారు. కళింగ డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా మాదే. ఎలాగూ నేను వ్యాపారం చూసుకోవాలి కదా, సినిమాను కూడా వ్యాపారంగానే చేద్దాం అని మా నాన్నను కన్విన్స్‌ చేశాను. మద్రాసు రైలెక్కిందే ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని. ‘ఓ సీతకథ' సినిమా తీసిన తరువాత ఎన్టీఆర్‌ను కలిసాను. డబ్బులొచ్చాయి కదా, ఇక సినిమా వద్దు ఇంటికెళ్లిపో అన్నారు.

    గుండె ధైర్యమే..

    గుండె ధైర్యమే..

    నా కళ్లెదుటే పెద్ద పెద్ద బ్యాగులతో వచ్చి డబ్బులన్నీ పోగొట్టుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లను చూస్తూంటే చాలా భయంగా ఉండేది. ఏదో గుండె ధైర్యం నడిపించింది. ఎన్టీరామారావుగారు పేరు పెట్టడం, ఆయన చేతుల మీదుగా వైజయంతి మూవీస్‌ ప్రారంభం కావడం, నాగేశ్వరరావుగారు తరువాత జనరేషన్‌ కృష్ణగారు, శోభన్‌బాబుగార్లతో చేయడం, ఒడిదొడుకులు ఉన్నా ముందుకెళ్లాను. ఇంకా వయసుంది కదా పెద్ద దెబ్బ తగిలినా మళ్లీ నిలదొక్కుకుంటాంలే అనే మొండి ధైర్యం అదే నిలబెట్టింది అంటున్నారు అశ్వనీదత్.

    చంద్రబాబు కోసం...

    చంద్రబాబు కోసం...

    హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిన తర్వాత చంద్రబాబుగారి కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పబ్లిసిటీ చేశాను. అప్పుడే ఆయన్ను బాగా అబ్జర్వ్‌ చేశాను. ఈ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి కూడా ఉంటాడా. ఇంత కష్టపడుతున్నాడు. ఇంత చేస్తున్నాడు. గ్రేట్‌ అనిపించింది. అప్పుడే నాకూ పాలిటిక్స్‌పై ఇంట్రస్ట్‌ కలిగింది. ఆయనతో ఇన్వాల్వ్‌ కావాలి, ఇలాంటి వాళ్లతో కలిసి నడవాలి అనిపించింది. నాకు చాలా అడ్మిరేషన్‌ ఆయనంటే. తెలుగుదేశం పార్టీకి పబ్లిసిటీ చేయడం మాత్రం ఆపను.

    చిరంజీవి నన్ను అడగలేదు

    చిరంజీవి నన్ను అడగలేదు

    2004లో నేను ఎలక్షన్లలో కంటెస్ట్‌ చేయడానికి కారణం చిరంజీవిగారే. నేను చంద్రబాబు గారితో ఉన్నా కూడా, పార్టీ తరఫున పబ్లిసిటీ చేస్తున్నా.. విజయవాడ నుంచి పోటీ చేస్తానని ఆయన్ను అడగడానికి మొహమాట పడ్డాను. నా ఆలోచనలను రాఘవేంద్రరావు, చిరంజీవికి చెప్పేవాడిని. ఈ విషయంపై చంద్రబాబుగారిని చిరంజీవి అడగ్గానే ఆయన అంగీకరించారు. అందుకే నా అంతట నేను వస్తే తప్ప పీఆర్పీలోకి రమ్మని అడగడం బాగోదని చిరంజీవిగారు నన్ను అడగలేదు.

    రామ్ చరణ్ తోనే అని కాదు..

    రామ్ చరణ్ తోనే అని కాదు..

    ‘జగదేకవీరుడు అతిలోక సుందరి' సీక్వెల్‌ కింద రామ్‌చరణ్‌, శ్రీదేవి కూతురిని పెట్టి తీసే ఆలోచన అయితే లేదు. సీక్వెల్‌ ఎలా తీయలో రెండు మూడు కథలు అనుకున్నా కుదరలేదు. దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. కథ ప్రకారం దానికి ఎవరు సూటయితే వాళ్లతో తీస్తాం అని తేల్చి చెప్పారు అశ్వనీదత్.

    ఇద్దరం ఒకే సారి షిప్ట్ అయ్యాం..

    ఇద్దరం ఒకే సారి షిప్ట్ అయ్యాం..

    చిరంజీవి గారితో ఎక్కువ స్నేహంగా ఉంటారు. కారణం ..ప్రత్యేకంగా ఏమీ లేదు. 1988 నుంచి మేం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. జగదేకవీరుడు అతిలోకసుందరి నుంచి ఇంకా ఎక్కువ బంధం ఏర్పడింది. మద్రాసు నుంచి ఇద్దరం ఒకేసారి షిఫ్ట్‌ అయ్యాం. ఆయనతో సినిమాలు తీయడం సంతోషాన్నిస్తుంది.

    నేనైతే తీయలేను..

    నేనైతే తీయలేను..

    ‘ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా తీయడానికి పిల్లలు చాలా కష్టపడ్డారు. ఆ సినిమా విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. సినిమాను కూడా రిలీజైన తర్వాత థియేటర్‌లోనే చూస్తానని చెప్పాను. తర్వాత ఆ సినిమా చూసి షాక్‌ అయ్యాను. మరో 20 ఏళ్ల తర్వాత కూడా నేనైతే ఇలాంటి సినిమా తీయను, చాలా ధైర్యంగా తీశారు అని చెప్పాను. మ్యూజిక్‌, పబ్లిసిటీ విషయాల్లో వాళ్లకు అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటాను.

    రిటైర్ అవుతా..

    రిటైర్ అవుతా..

    చిరంజీవి, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌తో సినిమాలు తీయాలని ప్లాన్‌ చేస్తున్నాను. 2017, 2018లో ఆరేడు సినిమాలు తీస్తాను. 2018 చివరినాటికి రిటైర్‌ అవుతాను. ఆ తర్వాత వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నా పిల్లలే చూసుకుంటారు.

    ఆ ముగ్గరూ కలిస్తే కె రాఘవేంద్రరావు

    ఆ ముగ్గరూ కలిస్తే కె రాఘవేంద్రరావు

    చిన్నప్పుడు కేవీ రెడ్డి, విఠలాచార్య నాఅభిమాన దర్శకులు. కొద్దిగా వయసు వచ్చాక ఆదుర్తి సుబ్బారావు గారంటే అభిమానం. నేను ఇండస్ట్రీకి వచ్చాక నా స్ట్రాంగ్ ఫీలింగ్‌ ఏంటంటే ఆ ముగ్గురి కలబోత రాఘవేద్రరావుగారు. ఆయన అన్నీ చేయగలరు. మా జనరేషన్‌లో చూసిన గొప్ప డైరెక్టర్‌ ఆయన. సెల్యులాయిడ్‌ మీద గొప్ప వ్యక్తి.

    సావిత్రిగా ఆ హీరోయిన్ నే

    సావిత్రిగా ఆ హీరోయిన్ నే

    మహానటి సావిత్రి గారి బయోపిక్‌ మా అమ్మాయి స్వప్న ప్లాన్‌ చేసింది. ఈ సినిమాలో లీడ్‌ క్యారెక్టర్‌ను కీర్తి సురేష్‌ చేస్తోంది. కథను, కథనాన్ని నడిపించే మరో మెయిన్‌ క్యారెక్టర్‌ సమంత చేస్తోంది. రామారావు, ఏఎన్నార్‌, ఎస్వీ రంగారవు, గుమ్మడి, జెమినీ గణేశన్‌ అందరి క్యారెక్టర్లు ఇందులో ఉంటాయి. అయితే ఈ పాత్రలకు సరిపోయే నటులను ఎక్కడనుంచి తెస్తారో చూడాలి. ఇది సాహసమే అయినా వాళ్లు గ్యారెంటీగా సక్సెస్‌ అవుతారు.

    హై సక్సెస్ సినిమాలు..

    హై సక్సెస్ సినిమాలు..

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు 35 లక్షలు లాభం వచ్చింది. ఎక్కువగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇంద్ర. ఆరేడు కోట్ల వరకు లాభం వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ రేటు చాలా తక్కువ. 10 శాతం సక్సెస్‌ ఉంటే 90 శాతం పరాజయాలే ఉంటాయి. ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతలు ఐదారుగురు మాత్రమే కనిపిస్తారు.

    అవే ఆదుకున్నాయి..

    అవే ఆదుకున్నాయి..

    అశ్వమేధం, గోవిందా గోవిందాతో పూర్తిగా పోగొట్టుకున్న సమయంలో శుభలగ్నం సినిమా నన్ను ఆదుకుంది. అలాగే పెళ్లిసందడి, పెళ్లాం ఊరెళితే.. ఇలా చాలా సినిమాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి అన్నారు.

    English summary
    Aswini Dutt is one of the most successful senior producers of Tollywood. His Vyjayanthi Movies stood as a symbol for big cinema those days. The producer made movies with all the top heroes of Tollywood then. The producer's last venture NTR's 'Shakthi' got disaster result at the ticket windows and made the producer incurred with heavy losses. Ever since the movie's release in 2011, no film has been made on Vyjayanthi Movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X