»   » 2017 జూన్ కల్లా విజయశాంతి సినిమా..?

2017 జూన్ కల్లా విజయశాంతి సినిమా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్ విజయ శాంతి. తన పర్ఫార్మెన్స్ తో మేల్ హీరోలకి ధీటుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ అమితాబ్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగారు. చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లతో ఆడి , పాడి ,ఎన్నో విభిన్న పాత్రలు చేసింది.

ఆ తర్వాత లేడీ క్యారక్టర్ బేస్డ్ సినిమా లతో ముందుకెల్లింది. తెలుగులో పెద్ద హీరోల హవా నడుస్తున్న సమయంలోనే విజయ శాంతి చేసిన కర్తవ్యం ఒక సంచలనం అయ్యింది. ఆ కక్ష తోనే ఆమెని కొన్ని కేసుల్లో ఇరికించాలని చూసారన్న వార్తలూ ఉన్నాయి....

ఆ తర్వాత కూడా చాలాకాలమే విజయ శాంతి సినిమాల్లో కొనసాగారు విజయ శాంతి... ఆ తర్వత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ కూడా అయ్యారు.సొంత పార్టీ పెట్టారు., టీఆర్ఎస్ లో కూడా కీలకంగా ఉన్న విజయశాంతి ఏమైందో ఏమో కానీ సడెన్ గా అఙ్ఞాతం లోకి వెళ్ళిపోయింది.ప్రస్తుతం రాజకీయ పరంగా ప్రస్తుతం ఆమె వెనకపడిపోయింది.

At last Vijayashanthi Coming out of her hibernation

ఈ గ్యాప్ వల్ల ప్రజలకు దూరమవ్వకూడదని భావిస్తోందట విజయశాంతి. కొంతకాలంగా రాజకీయాలకు,పబ్లిసిటీకీ దూరంగా ఉంటున్న విజయశాంతి ఇప్పుడు మళ్ళీ నటనవైపు చూస్తున్నారట. నిజానికి రాజకీయాల్లోకి రావటానికి ఆమె యాక్టింగ్ ని ఎంచుకున్నట్టు సమాచారం. అందుకే సినిమాల్లో నటించాలనే ఆలోచనలో ఉందట.

తెలంగాణ ఉద్యమంలో బిజీగా ఉండడం, అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించుకోవడంవల్ల కొంతకాలంగా సినిమా రంగానికి దూరంగా ఉన్నానని.ఇప్పుడు బాగానే ఉన్నానని, దేశభక్తికి సంబంధించిన కథలో తనకు తగిన పాత్రతో సినిమా తీసే పనిలో ఉన్నానని కొద్దిరోజుల క్రితం ఆమె అన్నట్టు వార్తలుకూడా వచ్చాయి. మళ్ళీ ఎక్కడా ఆ వార్త రాలేదు కానీ రీసెంట్ సమాచారం ప్రకారం విజయ శాంతి సినిమా విశయంలో సీరియస్ గా మొదలు పెట్టారట.. 2017 జూన్ కల్లా సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేస్తుందట..

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన "ఓసేయ్ రాములమ్మ" 1997లో విడుదలై అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో నటనకు గాను నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా విజయశాంతి గెలుచుకుంది.

తనకు నటిగా అపరితమైన గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని విజయశాంతి భావిస్తున్నట్లు ఆ మధ్య చెప్పుకున్నారు. మరిప్పుడు వచ్చేది రాములమ్మ కి సీక్వెలేనా కాదా అనేది తెలియాల్సి ఉంది.

English summary
Vijayashanthi planing a Movie to launch in 2017 June..?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu