For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విరుష్క రిసెప్షన్.. షారుక్ చయ్య చయ్య.. రణ్‌బీర్, కత్రినా ఎడమొగం పెడమొగం.. వైరల్‌గా వీడియోలు..

  By Rajababu
  |
  Virushka Marriage Reception Exclusive Video విరుష్క రిసెప్షన్.. వైరల్‌గా వీడియోలు..

  భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ అనుష్క శర్మ మ్యారేజ్ రిసెప్షన్ మంగళవారం రాత్రి గ్రాండ్‌గా ముగిసింది. ఈ వేడుకకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ తారలు, క్రీడాకారులు భారీగా హజరయ్యారు. ధోని, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్ లాంటి దిగ్గజ క్రికెటర్లు సతీసమేతంగా వచ్చారు. అంగరంగ వైభవంగా ముగిసిన ఈ వేడుకల్లో ఇద్దరు మాజీ ప్రియులు ఎదురెదురు పడటం, వారి మధ్య కొన్ని క్షణాలపాటు జరిగిన తతంగాన్ని మీడియా కంట పడింది. ఇంతకు ఆ ఇద్దరు మాజీ లవర్స్ ఎవరంటే..

   రణ్‌బీర్, కత్రినాలు కలిసి

  రణ్‌బీర్, కత్రినాలు కలిసి

  బాలీవుడ్‌లో ప్రేమ పక్షులుగా పిలుచుకొన్న రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు ఇప్పుడు ఎడమొగం, పెడమొగంగా ఉంటున్నారు. పెళ్లి పీటల వరకు వచ్చిన వీరి వ్యవహారం ఎందుకో ఆగిపోయింది. అప్పుడప్పుడు కలుసుకోవడం కూడా గగనమైంది. తాజాగా విరుష్క మ్యారేజ్ పార్టీలో రణ్‌బీర్, కత్రినా ఎదురుపడ్డారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..

   రణ‌్‌బీర్ వైపు ఓర చూపు

  రణ‌్‌బీర్ వైపు ఓర చూపు

  రణ్‌బీర్, కత్రినాలిద్దరూ ఒకరిని మరొకరు కలుసుకోకుండా జాగ్రత్తపడ్డారు. కానీ వారిద్దరూ ఎదురుపడటం తప్పలేదు. ఎదురుగా ఉన్న రణ్‌బీర్‌ కళ్లలోకి చూసి కత్రినా నవ్వింది. అందుకు బదులుగా ఓ చిరునవ్వు పడేసి అక్కడి నుంచి తప్పుకొన్నారు. అయితే అందరూ వారిద్దరూ ఎలా బిహేవ్ చేస్తారని ఎదురుచూసిన వారికి కొంత అసంతృప్తే మిగిలింది అని ఓ బాలీవుడ్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.

  షారుక్ డ్యాన్స్ హైలెట్

  ఈ వివాహ విందులో షారుక్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీకి హాజరైన షారుక్ ఖాన్ తొలుత విరాట్‌తో కలిసి ‘దిల్ సే' చిత్రంలోని చయ్య, చయ్య పాటకు స్టెప్పులు వేశాడు. విరాట్‌తో షారుక్ కలిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నది. ఆ వీడియో మీకోసం.

  అనుష్క, విరాట్‌తో పంజాబీ చిందులు

  ఆ తర్వాత అనుష్క, విరాట్‌తో కలిసి ఓ పంజాబీ పాటకు డ్యాన్స్ చేశాడు. వారిద్దరితో కలిసి షారుక్ వేసిన స్టెప్పులు అందరిని ఆకర్షించాయి. వేడుకకు హాజరైన వారందరూ వారి డ్యాన్స్ చూస్తూ హుషారుగా కేరింతలు కొట్టారు. షారుక్, అనుష్క, విరాట్ చేసిన హంగామా వీడియో ఇదే..

   కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

  కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

  విరాట్, అనుష్క మ్యారేజ్ పార్టీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో మూడంచెల సెక్యూరిటిని ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసి అతిథులను లోనికి పంపించారు.

   అనుష్క సన్నిహితులు వీరే..

  అనుష్క సన్నిహితులు వీరే..

  హై ప్రొఫైల్ మ్యారేజ్ పార్టీకి అనుష్క సినీ సన్నిహితులు అమితాబ్ బచ్చన్ కుటుంబం, రేఖ, కంగన రనౌత్, కరణ్ జోహర్, రాజ్ కుమార్ హిరానీ, విధు వినోద్ చోప్రా, అభిజిత్ జోషి, అనుపమ్ చోప్రా, రమేశ్ తరానీ, బోమన్ ఇరానీ తదితరులు హాజరయ్యారు.

   విరాట్ కోహ్లీ ఫ్రెండ్స్

  విరాట్ కోహ్లీ ఫ్రెండ్స్

  ఇక విరాట్ క్రికెట్ సన్నిహితులు, తోటి క్రీడాకారుల్లో అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వగ్, సైనా నెహ్వాల్, ఉమేశ్ యాదవ్, చటేశ్వర్ పూజారీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, సందీప్ పాటిల్, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు హాజరయ్యారు.

  సౌతాఫ్రికాకు విరుష్క

  సౌతాఫ్రికాకు విరుష్క

  విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు త్వరలోనే దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నది. భారత జట్టుతో అధికారికంగా అనుష్క శర్మ కూడా సౌతాఫ్రికాకు వెళ్లనున్నది. అక్కడ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం అనుష్క భారత్‌కు చేరుకొంటుంది. ఆ తర్వాత ఆనంద్ లాయ్ దర్శకత్వంలో రూపొందే షారుక్ సినిమా షూటింగ్‌లో అనుష్క పాల్గొంటుంది.

   త్వరలోనే గృహంలోకి

  త్వరలోనే గృహంలోకి

  భారత్ జట్టు పర్యటన తర్వాత విరాట్, అనుష్క దంపతులు ముంబైలోని వర్లీలోని కొత్త నివాసంలోకి మారనున్నారు. ఇప్పటికే వారు ఓ ఇంటిని అందంగా ముస్తాబు చేస్తున్నట్టు సమాచారం.

  English summary
  The Reception Took Place At A Five Star Hotel In Mumbai The star couple, fondly called as 'Virushka' by social media users, hosted their second reception bash at a five-star hotel -St Regis, in Lower Parel, where the who's who from the world of sports and Bollywood arrived.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X