»   » నిర్మాత లిఫ్ట్ ఇస్తే.. కమెడియన్లు హీరోలయ్యారు..

నిర్మాత లిఫ్ట్ ఇస్తే.. కమెడియన్లు హీరోలయ్యారు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ప్రత్యేకమైన శైలి. ఎస్వీ కృష్ణారెడ్డితో కలిసి ఆయన నిర్మించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంతోపాటు భారీ విజయాలను సాధించాయి. ఓ మోస్తారు నటులను హీరోలుగా చేసిన ఘనత ఆయనదే. కమెడియన్లుగా బిజీగా ఉన్న తరుణంలో ఆలీ, వేణుమాధవ్‌లను హీరోలుగా చేసిన సంగతి తెలిసిందే. బాబుమోహన్‌తో స్టెప్పులేపించింది ఆయనే. అలాంటి ప్రత్యేక అభిరుచి ఉన్న నిర్మాతగా తన అనుభవాలను ఫేస్‌బుక్‌లో పంచుకొన్నారు.

Atchireddy gives lift on bike for Ali, Venumadhav

జనరల్‌గా ప్రయాణంలో తరచుగా కొందరికి లిప్ట్ ఇస్తుంటాం. వారికి మనం లిఫ్ట్ యివ్వక పోయినా వారి ప్రయాణం ఆగదు. పట్టుదల వున్నవారు ఎలా అయినా తమ గమ్యం చేరతారు. గమ్యం చేరిన వారు స్వయంకృషితో రాణించి విజయం సాధిస్తే ! మనకి తృప్తిగా వుంటుంది కదా !. అలా యాదృచ్చికంగా మేము ఆలీకి " రాజేంద్రుడు గజేంద్రుడు " లో లిఫ్ట్ ఇస్తే ' ఎంద చేట !' అంటూ ప్రేక్షకులను మెప్పించాడు. 'యమలీల' చిత్రంలో హీరో అయ్యారు.

Atchireddy gives lift on bike for Ali, Venumadhav

అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ కి 'సంప్రదాయం' లో లిఫ్ట్ యిస్తే తాను ప్రముఖ కమెడియన్ గా రాణించి, 'హంగామా' లో హీరో అయ్యారు. సింబాలిక్ గా వున్నాయని ఈ చిత్రాలు పోస్ట్ చేసాను అని అచ్చిరెడ్డి ఫేస్‌బుక్‌లో ఇటీవల పోస్ట్ చేశారు.

English summary
Producer Atchireddy is known for making family entertainers. He given lift to Ali, Venumadhav to become heroes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu