»   » ట్విస్ట్: త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ‘అ... ఆ’కాన్సెప్టు అదేనా?

ట్విస్ట్: త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ‘అ... ఆ’కాన్సెప్టు అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు త్రివిక్రమ్ సినిమా అంటే తెలుగు సినీ జనాల్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. త్వరలో ఆయన నితిన్, సమంత జంటగా సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఇంట్రెస్టింగా ‘అ...ఆ' అనే టైటిల్‌తో పాటు ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

అనసూయ, ఆనంద.... అనే క్యారెక్టర్లలో సమంత, నితిన్ కనిపిస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ సమంత టైటిల్ రోల్ చేయడం లేదని తెలుస్తోంది. అనసూయ రామలింగం పాత్రలో నదియా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇది తెలుగులో పాపులర్ అయిన సక్సెస్ ఫార్ములా అత్త-అల్లుడు కాన్సెప్టు సినిమా అని అంటున్నారు.

 Atha-Alludu concept in Trivikram's 'A Aa..'

త్రివిక్రమ్ మామూలు స్టోరీ లైన్‌నే ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తాడు. తనదైన మ్యాజిక్ చూపిస్తాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేయబోతున్నాడట త్రివిక్రమ్. దీంతో పాటు సినిమాలో చాలా సర్‌ప్రైజులు ఉంటాయని టాక్. ఓవరాల్‌గా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టెన్ చేసే విధంగా సినిమా ఉండబోతోందట.

ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా సమంత, మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (ప్రేమమ్ ఫేమ్ మళయాళి భామ) చేస్తోంది. . ఈ నిర్మాతతో త్రివిక్రమ్ కు ఇది మూడో సినిమా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఈ నిర్మాత చేస్తున్న చిత్రం ఇదే. సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఈ చిత్రం మొదలుకానుంది. 2016 సంక్రాంతికి విడుదల చేస్తారు.

ఈ చిత్రం కు సౌండ్ డిజైనర్ గా విష్ణు గోవింద్, శ్రీ శంకర్ పనిచేయనున్నారు. సంగీతం అనిరుధ్, సినిమాటోగ్రఫి నటరాజ్ సుబ్రమణ్యన్, ఆర్ట్ రాజీవన్, ఎడిటింగ్ ...కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
Trivikram's 'A Aa..' Packs with Atha-Alludu concept.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu