»   » నైజాం: పవన్ అభిమానికి కోట్లలో లాభం

నైజాం: పవన్ అభిమానికి కోట్లలో లాభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నితిన్ 'అత్తారింటికి దారేది' చిత్రం నైజాం రైట్స్ తన సొంత డిస్త్రిబ్యూషన్ సంస్థ అయిన గ్లోబల్ సినిమాస్ ద్వారా దక్కించుకున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్‌పై అభిమానం ఇపుడు నితిన్‌కు కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెడుతోంది.

సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం నైజాం ఏరియాలో భారీ కలెక్షన్లతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తొలి వీకెండ్ (శుక్ర, శని, ఆది) అసాధారణ షేర్ సాధించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.7.50 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. తొలివారం పూర్తయ్యేసరికి రూ. 12 కోట్ల షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

పవర్ స్టార్ అభిమానులతో పాటు, యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈచిత్రం అలరిస్తోంది. సినిమా బిజినెస్ పూర్తయ్యే వరకు ఈ సినిమా తెలుగు సినీచరిత్రలో కలెక్షన్ల పరంగా ఓ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డు సృష్టిస్తుందని అంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Atharintiki Daaredhi’ is creating history at the Box Office in Nizam. The 1st weekend share for the film has crossed the 7.50 Cr mark in this area and the first week share is expected to easily cross the 12Cr mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu