»   » ‘అత్తారింటికి దారేది’ 50 డేస్ కొత్త పోస్టర్స్ ఇవే...

‘అత్తారింటికి దారేది’ 50 డేస్ కొత్త పోస్టర్స్ ఇవే...

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌, సమంత కాంబినేషన్‌లో తెరకెక్కి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న చిత్రం 'అత్తారింటికిదారేది' . 'అత్తారింటికి దారేది'సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే. ఓ రేంజి కలెక్షన్స్ తో ...ఇప్పటివరకూ ఉన్న రికార్డులను బ్రద్దలు కొడుతూ... ఈ సినిమా 50 రోజుల మార్క్ ను చేరుకొనుంది.


  విడుదలకు ముందే పైరసీ బారిన పడి సంచలనం సృష్టించిన ఈ చిత్రం కలెక్షన్‌లలోనూ రికార్డులు తిరగరాస్తోంది. మగధీర కలెక్షన్లను దాటి టాలీవుడ్‌లో నెంబర్‌వన్‌ చిత్రంగా నిలిచిన ఈ సినిమా త్వరలోనే వందకోట్ల క్లబ్‌లోకి చేరేందుకు పరుగులు తీస్తోంది.

  ఈ సినిమా ఈ రేంజి ఘన విజయం సాధించటంతో ఈ సినిమా టీం చాలా సంతోషంగా వున్నారు. ఈ నెల 16తో ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజాప్రచార చిత్రాలను యూనిట్‌ విడుదల చేసింది. ఇవి అభిమానులను బాగా అలరిస్తాయని భావిస్తున్నారు.

  ఈ కొత్త పోస్టర్స్ మీ కోసం..స్లైడ్ షో లో...

  పవన్ దే ఈ క్రెడిట్

  పవన్ దే ఈ క్రెడిట్

  రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. పాత కథే అయినా కొత్త నేరేషన్ లో చెప్పటం, వినోదాన్ని చిత్రానికి బాగా డోస్ పెంచి కలపటం ప్లస్ అయ్యింమది.

  హవా కొనసాగుతుంది...

  హవా కొనసాగుతుంది...

  50 రోజులు పూర్తయిన తర్వాత కనీసం 170 థియేటర్లలో ప్రదర్శితం అవుతూ 100 రోజులు దిశగా సాగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నైజాం ఏరియాలో రూ. 20 కోట్ల, సీడెడ్ రూ. 10 కోట్లు, ఓవర్సీస్ రూ. 10 కోట్ల మార్కను అధిగమించి భారీ కలెక్షన్లు రాబడుతోంది. వైజాగ్, గుంటూరు, కర్ణాటక లాంటి ఏరియాల్లో మగధీర రికార్డులను తుడిచిపెట్టింది.

  ఆ ఘనత కూడా...

  ఆ ఘనత కూడా...

  ఇప్పటికే ‘అత్తారింటికి దారేది' చిత్రం నైజాం, ఓవర్సీస్ ఏరియాల్లో రూ. 10 కోట్ల షేర్ సాధించింది. తాజాగా సీడెడ్ ఏరియాలోనూ రూ. 10 కోట్ల మార్కును అధిగమించడం విశేషం. మూడు ఏరియాల్లోనూ రూ. 10 కోట్ల షేర్ సాధించిన ఘనత కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకే దక్కింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

  వంద కోట్లు ఖాయం...

  వంద కోట్లు ఖాయం...

  'అత్తారింటికి దారేది' రూ.వంద కోట్ల ఆశలు రేకేతిస్తోంది. 'త్వరలోనే మా సినిమా ఆ మైలురాయి అందుకొంటోంది' అని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. రాజమౌళిలాంటివాళ్లు కూడా ఈ సినిమాని అప్పుడే వంద కోట్ల క్లబ్‌లో చేర్చేశారు. పవన్‌ చిత్రం ఆ లక్ష్యాన్ని అందుకొన్నా, లేకున్నా భవిష్యత్తులో ఈ అంకెను అందుకోవడం అంత కష్టం కాదనే విశ్వాసాన్ని మిగతా నిర్మాతలకు కలిగించిందీ చిత్రం. ''తెలుగు సినిమా మార్కెట్‌కి ఇది మంచి పరిణామం. ఈ పరంపర వంద కోట్ల దగ్గరే ఆగిపోకూడదు. ఎందుకంటే మనం ఎవ్వరికీ తీసిపోం'' అని ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు చెబుతున్నారు.

  వీళ్ళంతా కలిసే...

  వీళ్ళంతా కలిసే...

  పవన్ కళ్యాణ్ తో పాటు ఈ చిత్రం సక్సెస్ లో ... సమంత, ప్రణీత, నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులుకి భాగస్వామ్యం ఉంది. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

  English summary
  Pawan Kalyan on top of the pack with two blockbusters like Gabbar Singh and Attarintiki Daredi back to back.In three days Pawan Kalyan's Attarintiki Daredi looks set to create more BO records still. The film is poised to achieve the rare feat of completing its 50 day run in about 170 theaters across the state. That is a remarkable feat for a any film more so considering that the first 80 minutes of the film were leaked online a good two weeks before its scheduled release.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more