For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలా వచ్చే పేరు నాకవసరం లేదు.... జ్యో అచ్యుతానంద సీన్ పై అవసరాల క్లారిటీ

  |

  యాక్టర్ కం డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఇప్పటి వరకూ తీసినవి రెండే సినిమాలు. కానీ ఆ రెండే రెండు రెండు చిన్న సినిమాలు ఎవరూ ఊహించనంత పెద్ద విజయాలు సాధించి ఇండస్ట్రీలోనే ఇప్పుడు అవసరాల అంటే సినీ ఇండస్ట్రీకి అవసరం అన్న గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఊహలు గుసగుసలాడే సినిమాతోనే కావాల్సిన పేరు వచ్చేసినా ఫస్ట్ టైం లక్ కింద దాన్ని పక్కన పెట్టినా 'జ్యో అచ్యుతానంద' తో అతని ఫిల్మ్ మేకింగ్, స్టైల్ చూస్తే అందరికీ అర్థమైపోయింది దాదాపుగా త్రివిక్రం లాంటి డైరెక్టర్ గ నిలదొక్కుకో గలిగే స్టామినా ఉన్న వ్యక్తి అవసరాల శ్రీనివాస్ అని.

  ఇంకా వింత విషయం ఏమిటంటే జ్యో అచ్యుతానంద సినిమా విషయానికి వస్తే... సినిమా విడుదలకు ముందు చూసిన వారికి ఎవరికీ నచ్చలేదట. అంతెందుకు తనకు కూడా ఆ స్క్రిప్ట్‌లో లోపాలు ఉన్నాయి అని అర్థం అయిందట. ఈ సినిమా ఎవరూ కొనరనుకున్నాడట. కాని బిజినెస్ సమయంలో సినిమాను చూసి.. వెంటనే కొన్నుక్కున్న వారిని చూసి ఆశ్చర్యం అనిపించిందట. తన 'ఊహలు గుస గుసలాడే' సినిమా స్క్రిప్ట్ పక్కాగా ఉందని.. ఎవరు క్రిటిసైజ్ చేసినా తాను సమర్దించుకోగలనని.. కాని 'జ్యో అచ్యుతానంద' విషయంలోఅంత నమ్మకం లేకపోయిందనీ... బట్ విడుదల తర్వాత మాత్రం తన అంచనాలు సరిగ్గానే ఉన్నాయి అన్న విషయం అర్థమయ్యిందనీ అన్నాడు. అంతలోనే ఒక సీన్ విషయం లో తనకు కొందరిచ్చిన సలహా మీద ఒక క్లారిటీ ఇచ్చాడు అదేమిటంటే....

   నాని క్యారెక్టర్

  నాని క్యారెక్టర్

  నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో అవసరాల రూపొందించిన సినిమా ‘జ్యో అచ్చుతానంద' చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ముగింపులో రెజీనా పక్కన నాచురల్ స్టార్ నాని దర్శనమిస్తాడు. హీరోలిద్దరికీ పెళ్లిళ్లు అయిపోవడం వల్ల, అమ్మాయి లైఫ్‌ను సెటిల్ చేయడం కోసం పెట్టిన క్యారెక్టర్ అది. ఒకటీ రెండు సీన్లలో అయిపోతుందా పాత్ర. అయితే ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా "నాని" నే కనిపించే అవసరం ఉందా..?

   డైరెక్టర్ కాబట్టి

  డైరెక్టర్ కాబట్టి

  ఇదే విషయం లో శ్రీనివాస్ నే చేసి ఉంటే సరిపోయేది కదా. అందులోనూ స్వతహాగానే మంచి నటుడు కూడా. ఆ క్యారెక్టర్‌లో నానికి బదులు మీరే చేసి ఉంటే బాగుండేది కదా అని ఓ ఇంటర్వ్యూలో అవసరాలను అడిగితే... ‘‘రెండు గంటలు హీరోలిద్దరూ నానా అగచాట్లు పడినా వాళ్లకు దక్కనిది నాకు దక్కితే, వాళ్లలో లేనిది ఏంటి? వీడిలో ఉన్నది ఏంటి? వీడు డైరెక్టర్ కాబట్టి ఎవ్వరికీ దక్కనిది వీడికి దక్కింది.

   చెడ్డపేరు నాకొద్దు

  చెడ్డపేరు నాకొద్దు

  ఇన్ని చేసిన అబ్బాయిలను కాదని అమ్మయిని అలా ఎగరేసుకు పోయేంత ఏముందీ అనిపించేలా ఉండకూడదు. కేవలం డైరెక్టర్ కాబట్టి ఆ పాత్ర తీసుకున్నాడు అనిపించకూడదు కదా... హీరోల కంటే బెటర్ గా ఉండే వ్యక్తి అక్కడ కనిపిస్తేనే ప్రేక్షకుడు సాటిస్ ఫై అవుతాడు. మరి వాళ్ళిద్దరినీ నేను డామినేట్ చేయగలను అనిపించలేదు. డైరెక్టర్ కాబట్టి ఇలా చేసాడు అనే చెడ్డపేరు నాకొద్దు. అందుకే కాస్త ప్రేక్షకులని సాటిస్ ఫై చేసే స్టార్ అయిన నాని ఎంపిక చేసుకున్నా.'' అని నవ్వుతూ చెప్పాడు.

   కన్విన్సింగ్ గానే ఉంది.

  కన్విన్సింగ్ గానే ఉంది.

  ఇప్పటి వరకూ బాగానే ఉంది. పైన చెప్పిన విషయం కాస్త కామెడీ నే అనిపించినా అవసరాల చెప్పింది కన్విన్సింగ్ గానే ఉంది. అయితే దర్శకుడిగా మాత్రం అవసరాల రేంజ్ ఒక రేంజ్ లోనే ఉందిప్పుడు. జ్యో అచ్యుతానంద సినిమాని రాజమౌళి అయితే ఓ రేంజ్‌లో పొగిడేశాడు. అలాగే ఇప్పుడు అవసరాల ఫేవరైట్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా అవసరాలను చాలా గొప్పగా ప్రశంసించాడు. మొదటి రెండు సినిమాలకు కష్టపడినట్టుగా ఇంకా ఇంకా కష్టపడితే మాత్రం అవసరాల ఇంకా గొప్ప పొజిషన్‌కి వెళతాడనటం లో ఏమాత్రం సందేహం లేదు. ఎటొచ్చీ కస్త జాగ్రత్త పడితే చాలు.

   బ్లాక్ బస్టర్ అనే రేంజ్‌లో ఆడలేదు

  బ్లాక్ బస్టర్ అనే రేంజ్‌లో ఆడలేదు

  మొదటి సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు. కానీ అప్పటివరకూ హిట్టు లేదు కదా. అందుకే ఆ మొదటి సినిమా కష్టానికి 15లక్షలు తీసుకున్నాడు. ఆ సినిమా బాగానే ఆడింది కానీ మరీ బ్లాక్ బస్టర్ అనే రేంజ్‌లో ఆడలేదు. అందుకే రెండో సినిమాకు 60లక్షలు మాత్రం రెమ్యూనరేషన్ దక్కింది. అయితే రెండో సినిమాగా వచ్చిన ఆ ‘జ్యో...అచ్యుతానంద' కాస్తా కమర్షియల్ సూపర్ హిట్‌తో పాటు క్రిటిక్స్ ప్రశంశలు కూడా దక్కించుకుంది. అంతే ఒక్క దెబ్బతో రెండున్నర కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. నానీ లాంటి మీడియం రేంజ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు.

   2.5 కోట్ల రూపాయలు

  2.5 కోట్ల రూపాయలు

  నానితో తెరకెక్కించబోయే సినిమాకు అవసరాల శ్రీనివాస్ ఏకంగా 2.5 కోట్ల రూపాయలు అందుకోనున్నాడని సమాచారం. నానితో తీస్తున్న సినిమాను కూడా నిర్మాత సాయికొర్రపాటి నే నిర్మిస్తున్నారు.దర్శకుడిగా తన ప్రస్తానం కొనసాగిస్తూనే... అటు నటుడిగానూ అవసరాల ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అష్టా చెమ్మా, ఊహలు గుసగుసలాడే, నాన్నకు ప్రేమతో, జంటిల్‌మెన్ నటించాడు.

   నటుడిగా కూడా

  నటుడిగా కూడా

  అయితే నటుడిగా మాత్రమే తనకి వచ్చే గుర్తింపు సరిపోదనుకున్నాడేమో డైరెక్షన్ లోకీ అడుగు పెట్టాడు. నటన లోకూడా కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా తనలోని వివిధ షేడ్స్ ను ప్రదర్శించి టాలెంటు నిరూపించుకోవాలని ఉవ్విల్లూరుతున్న అవసరాల శ్రీనివాస్ ఈ సారి డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అడల్ట్ కామెడీ గా రాబోతున్న ఈ సినిమా హిందీ సినిమాకి రీమేక్

  కొత్త దర్శకుడితో

  కొత్త దర్శకుడితో

  అయితే హంటర్ అనే పేరు తోవచ్చిన ఈ సినిమాని హిందీలో ఈ సినిమాను చాలా బోల్డ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యం అవుతుందా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలియాస్తాయా? అనే అనుమానం ఉండేది. హిందీలో ఈ సినిమా ఫస్టాఫ్ బోల్డ్ గా సాగుతుంది, సెకండాఫ్ ఎమోషనల్ గా సాగుతుందని, సీన్ టు సీన్ తెలుగులోనూ అలాగే నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాట్లు అవసరాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు

  English summary
  Avasarala Srinivas clarity about Nani Guest Role in Jyo Achyutananda Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X