For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అందుకే.. పెద్ద హీరోలతో పెట్టుకోను!, అలా తెలిసొచ్చింది: అవసరాల శ్రీనివాస్..

  |

  బుర్రలో సినిమా ఆలోచనలు మొదలయ్యాయంటే చాలా కష్టం. చేస్తున్న పని మీద దృష్టి పెట్టలేము.. అలా అని కెరీర్ రిస్కులో పెట్టి ఇండస్ట్రీలో ట్రయల్స్‌కు సిద్దమైపోలేం!.. ఈ ఊగిసలాటను దాటుకుని లక్ష్యాన్ని చేరుకునేవాళ్లు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు.

  నటుడిగా-దర్శకుడిగా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్న అవసరాల శ్రీనివాస్.. ఒకప్పుడు ఇలాంటి ఊగిసలాటనే దాటుకుని సినిమాల్లోకి వచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన సినిమాలపై మక్కువతో ఇటువైపు వచ్చారు. నటుడిగాను, దర్శకుడిగానూ రాణిస్తున్నారు.

  నటుడిగా తన తాజా చిత్రం 'ఒక్క క్షణం' డిసెంబర్ 23న విడుదల సందర్భంగా అవసరాల చెప్పిన పలు విశేషాలు మీకోసం ఆయన మాటల్లోనే..

   ఒక్క క్షణంలో మీ పాత్ర?:

  ఒక్క క్షణంలో మీ పాత్ర?:

  సినిమాలో నా పాత్ర పేరు శ్రీనివాస్. నా జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు.. హీరో శిరీష్‌ జీవితంలోనూ జరుగుతుంటాయి. అలా జరుగుతుందని నాకు ముందే తెలిసిపోతుంటుంది. ఇలా ఓ వ్యక్తి జీవితం.. మరో వ్యక్తి జీవితానికి ఎలా దగ్గరగా ఉంటుందన్న పాయింట్‌ని దర్శకుడు చాలా కొత్తగా చెప్పారు.

   అది స్ఫూర్తిగా తీసుకున్నాడేమో!

  అది స్ఫూర్తిగా తీసుకున్నాడేమో!

  గతంలో ఒక వార్త చదివాను.. ఓ వ్యక్తి కారణంగా ఇద్దరూ అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అయితే ఇది ఒకే ప్రమాదం కాదు. రెండు వేర్వేరు ఘటనలు. కారకుడు మాత్రం ఒకరే.

  ఏడాది వ్యవధిలోనే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకే వ్యక్తి కారణంగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బహుశా దర్శకుడు ఆనంద్‌ కూడా ఆ ఆంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాసుకున్నాడేమో.

   దర్శకత్వం ఎంతదాకా?:

  దర్శకత్వం ఎంతదాకా?:

  కథలు త్వరత్వరగా రాసేసుకుని సెట్స్ పైకి వెళ్లడం నాకు చేత కాదు. నా ప్రయాణం నింపాదిగానే ఉంటుంది. అదే ఇష్టం. అందుకే రెండో సినిమా డైరెక్షన్‌ చేయడానికి రెండేళ్లు టైం తీసుకున్నాను.

  ఇలా డైరెక్టర్ అయ్యాను:

  ఇలా డైరెక్టర్ అయ్యాను:

  నిజానికి యాక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ డీన్‌ బాల శేఖర్‌ నాకు మంచి మిత్రుడు. అమెరికా నుంచి వచ్చేశాక తనతో కలిసి ట్రావెల్ చేశా.

  నా కథల్ని శేఖర్‌కు వినిపించేవాడిని. అదే క్రమంలో ఆయన తెరకెక్కించిన 'బ్లైండ్ యాంబిషన్' అనే ఇంగ్లీష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఓ సినిమాకి గోస్ట్‌ రైటర్‌ గానూ పనిచేశా. సాయికొర్రపాటి గారు అవ‌కాశం ఇవ్వడంతో 'ఊహలు గుసగుసలాడే'తో దర్శకుడినయ్యాను.

  నటన-దర్శకత్వం.. ఎలా బ్యాలెన్స్?:

  నటన-దర్శకత్వం.. ఎలా బ్యాలెన్స్?:

  అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తుంటా. నటిస్తున్నప్పుడు దర్శకత్వానికి ఎలా బ్రేక్‌ ఇచ్చానో, దర్శకత్వ బాధ్యతల్లో ఉన్నప్పుడు నటనకు బ్రేక్‌ ఇస్తా. నా నిర్మాతలకు నా నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

  మీ దర్శకత్వంలో.. తర్వాతి సినిమా?:

  మీ దర్శకత్వంలో.. తర్వాతి సినిమా?:

  ప్రేమ కథా నేపథ్యంలో నా మూడో సినిమా ఉంటుంది. విభిన్నంగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఆ సినిమా సెట్స్‌కి వెళుతుంది. ఈలోగా నటుడిగా కమిట్ అయిన సినిమాలు పూర్తవుతాయి. చాలావరకు నా సినిమాలను నా కథలతోనే తెరకెక్కిస్తా. వేరే వాళ్ల కథతో నేను కనెక్ట్ అవడం.. దాన్ని ఆడియెన్స్ కు కనెక్ట్ చేయడం కాస్త కష్టమే. నా మూడో సినిమా కూడా నా కథతోనే తీస్తున్నాను.

   పెద్ద హీరోలతో పెట్టుకోవట్లేదు:

  పెద్ద హీరోలతో పెట్టుకోవట్లేదు:

  పెద్ద హీరోలతో సినిమాలంటే అంత ఈజీ కాదు. కథ చెప్పాక.. వారి సలహాలు-సూచనల మేరకు మార్పులు చేయాల్సి ఉంటుంది. డేట్లు కూడా సరిగా అడ్జస్ట్ అవవు. అలాంటి పరిస్థితుల్లో సినిమా చేయడం నాకు కష్టం.

  నిజానికి నా తొలి సినిమా 'ఊహలు గుసగుసలాడే' కన్నా ముందు ఓ ఆర్ట్ సినిమా చేద్దామనుకున్నా. ఓ పెద్ద హీరోను కలిసి కథ చెబితే.. మార్పులు చేయమన్నాడు. నేనందుకు ఒప్పుకోలేదు. ఈ తరహా సమస్యలు ఉంటాయనే పెద్ద హీరోలతో చేయాలని ఆలోచించట్లేదు.

  English summary
  Srinivas Avasarala made a strong impact with his debut film 'Ashta Chemma'. He has immense talent as director also. Recently he shared few interesting matters about his journey.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more