»   » అవసరాల శ్రీనివాస్ రెమ్యూనరేషన్... ఆశ్చర్యపరిచే విషయాలు!

అవసరాల శ్రీనివాస్ రెమ్యూనరేషన్... ఆశ్చర్యపరిచే విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. 'ఊహలు గుసగులాడే' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈ యువ దర్శకుడు ఇటీవల 'జ్యో అచ్చుతానంద' సినిమాతోనూ మరో విజయం అందుకుని తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు.

  వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన అవసరాల తన మూడో సినిమా హీరో నానితో చేయబోతున్నాడు. ఇప్పటికే నానికి కథ వినిపించాడు. 2017లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. నానితో చేయబోయే సినిమాకు అవసరాల తన తొలి సినిమా కంటే ఏకంగా 17 రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు. అందుకు సంబంధించిన వివరాలు క్రింద చదవండి.

  నిజానికి ఆయన తొలి సినిమా 'ఊహలు గుసగుసలాడే' చిత్రానికి అవసరాల తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సినిమాకు ఆయన నెలజీతం లెక్కన పని చేసాడట. అలా నెల నెలా తీసుకున్న డబ్బంతా లెక్కేస్తే రూ. 15 లక్షలు అయ్యాయట.

   తన బేనర్లోనే మరో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు

  తన బేనర్లోనే మరో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు

  తొలి సినిమా హిట్ కావడంతో... తన బేనర్లోనే మరో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు ఆ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి. అతనికిచ్చే రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరో అచ్చతెలుగు కథ తయారు చేసాడు అవసరాల.

  60 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట

  60 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట

  నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో తెక్కించిన ఆ చిత్రమే ఇటీవల విడుదలైన ‘జ్యో అచ్చుతానంద'. ఈ సినిమాకు అవసరాల రూ. 60 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.

   ఏకంగా 2.5 కోట్ల రూపాయలు

  ఏకంగా 2.5 కోట్ల రూపాయలు

  నానితో తెరకెక్కించబోయే సినిమాకు అవసరాల శ్రీనివాస్ ఏకంగా 2.5 కోట్ల రూపాయలు అందుకోనున్నాడని సమాచారం. నానితో తీస్తున్న సినిమాను కూడా నిర్మాత సాయికొర్రపాటే నిర్మిస్తున్నారు.

   నటుడిగా కూడా..

  నటుడిగా కూడా..

  దర్శకుడిగా తన ప్రస్తానం కొనసాగిస్తూనే... అటు నటుడిగానూ అవసరాల ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అష్టా చెమ్మా, ఊహలు గుసగుసలాడే, నాన్నకు ప్రేమతో, జంటిల్‌మెన్ నటించాడు. నటుడిగా కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా తనలోని వివిధ షేడ్స్ ను ప్రదర్శించి టాలెంటు నిరూపించుకోవాలని ఉవ్విల్లూరుతున్న అవసరాల శ్రీనివాస్ ఈ సారి డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

   త్వరలో హీరోగా సెక్స్ కామెడీ మూవీ

  త్వరలో హీరోగా సెక్స్ కామెడీ మూవీ  ఆ మధ్య హిందీలో 'హంటర్' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో అవసరాల హీరో పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర సెక్స్‌కు అడిక్ట్ నేపథ్యంతో సాగుతుంది.

   సెక్స్ అవసరమే అని వాదించే పాత్ర

  సెక్స్ అవసరమే అని వాదించే పాత్ర

  మనిషికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించే క్యారెక్టర్. ఇక ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్న అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ హంటర్ సినిమా.

   హిందీలో ఎంత బోల్డ్ గా ఉంటుందో తెలుగులో కూడా

  హిందీలో ఎంత బోల్డ్ గా ఉంటుందో తెలుగులో కూడా

  అయితే హిందీలో ఈ సినిమాను చాలా బోల్డ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యం అవుతుందా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలియాస్తాయా? అనే అనుమానం ఉండేది. హిందీలో ఈ సినిమా ఫస్టాఫ్ బోల్డ్ గా సాగుతుంది, సెకండాఫ్ ఎమోషనల్ గా సాగుతుందని, సీన్ టు సీన్ తెలుగులోనూ అలాగే నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాట్లు అవసరాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

  English summary
  Talented actor turned director Srinivas Avasarala got Rs 15 Lakh for his first directorial venture ‘Oohalu Gusagusalade’ and later he received Rs 60 Lakh for his latest offering ‘Jyo Achyuthananda’ which is turning out hit at the box office and doing fantastic collections. According to the latest buzz, Sai Korrapati has hiked the remuneration of Srinivas Avasarala by four time for his next upcoming third directorial venture in which Gentleman actor Nani will play the lead role. Avasarala is going to get Rs 2.5 Crores as remuneration for Nani’s movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more