»   »  ఇబ్బందే, నయనతో మాట్లాడితే నవ్వుతున్నారు: శింబు

ఇబ్బందే, నయనతో మాట్లాడితే నవ్వుతున్నారు: శింబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నయనతార, శింబు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ సారి వారి పర్సనల్ విషయాల గురించి కాదు.....వారి ప్రొఫెషనల్ విషయాలు గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ మాజీ ప్రేమికులు చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో వీరు ఓ తమిళ సినిమాలో జోడీ కట్టారు.

ప్రస్తుతం కలిసి నటిస్తున్న ఈ జంట షూటింగు సమయంలో ఇబ్బంది కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తమకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో శింబు స్వయంగా వెల్లడించారు. ఆమెతో కలిసి పని చేయడం తనకు కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ.....షూటింగు సమయంలో తమను చూసి యూనిట్ సభ్యులు నవ్వుతుండటం ఇబ్బంది కలిగిస్తోందని తెలిపాడు.

స్లైడ్ షోలో ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు....

ఇబ్బందిగా ఫీలయ్యాను

ఇబ్బందిగా ఫీలయ్యాను


సినిమా షూటింగులో భాగంగా నయనతార మాట్లాడే సీన్లలో నేను డైలాగులు చెబుతుంటే....యూనిట్ సభ్యులు నవ్వుతున్నారు. వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థమైంది. వాళ్లు అలా నవ్వుతుంటే షూటింగులో పాల్గొనడం ఇబ్బంది అనిపిస్తోందని అని శింబు చెప్పుకొచ్చారు.

గతంలో ప్రేమాయణం

గతంలో ప్రేమాయణం


నయనతార, శింబు మధ్య గతంలో ఘాటైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శింబు, నయనతార విడిపోయారు.

నయనతార ఎఫైర్లు

నయనతార ఎఫైర్లు


శింబుతో విడిపోయిన తర్వాత నయనతార, ప్రభుదేవా మధ్య కొంత కాలం ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా విడిపోయింది ఈ కేరళ బ్యూటీ. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్న నయనతారన సినిమాలపై దృష్టి సారించింది.

చాలా గ్యాప్ తర్వాత..

చాలా గ్యాప్ తర్వాత..


చాలా కాలం గ్యాప్ తర్వాత తన మాజీ ప్రియుడు శింబుతో కలిసి ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి పాండి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో వీరు ప్రేమికులుగా కనిపించనున్నారు.

ఆసక్తికర సన్నివేశాలు

ఆసక్తికర సన్నివేశాలు


ఇందులో వీరు పెద్దలను ఎదురించి రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఇదంతా సినిమా కథలో భాగమే. అంతే కాదండోయ్...ఇద్దరి మధ్య ఘాటైన శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయట.

రీల్ లైఫ్, రియల్ లైఫ్

రీల్ లైఫ్, రియల్ లైఫ్


ఏది ఏమైనా ఈ మాజీ ప్రేమికులు ఒకప్పుడు రియల్ లైఫ్‌లో చేసిన పనులు, చేయాలనుకున్న పనులు....ఇపుడు రీల్ లైఫ్‌లో చేస్తుండటం చర్చనీయాంశం అయింది. వీరు నటించే ఈ తమిళ చిత్రానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

English summary
Silambarasan and Nayantara are talk of the town again. This time not for their personal reasons but for their professional one. The ex-couple, who is teaming up after a long time for Pandiraj's next movie, are comfortable working with each other yet they face awkward moments at times!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu