»   » 'సూపర్' పాప అయేషా టాకియా నెక్ట్స్ చిత్రం

'సూపర్' పాప అయేషా టాకియా నెక్ట్స్ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున..'సూపర్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆయేషా టాకియా ఆ తర్వాత హిందీకే పరిమితమైంది. ఆ మధ్య పూరీ పోకిరి రీమేక్ వాంటెడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించిన ఈ భామ తాజాగా 'పాఠశాల' చిత్రం చేసింది. త్వరలో విడుదల అవుతున్న ఆ చిత్రంలో షాహిద్ కపూర్ ఇంగ్లీషు టీచర్‌ గా నటించారు. 'దిల్ మాంగే మోర్', 'ఫూల్ ఎన్ ఫూల్' చిత్రాల తర్వాత షాహిద్, ఆయేషా కలిసి నటిస్తున్న సినిమా ఇదే. 'వాంటెడ్' చిత్రం హిట్ కావడంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాపై ఆయేషా పెద్ద ఆశలే పెట్టుకుంది. పేపర్ డాల్ ఎంటర్‌టైన్‌ మెంట్ సంస్థపై నిర్మాత అహ్మద్ ఖాన్ నిర్మించారు. ఇటీవల విడుదలయిన ఈ చిత్రం ఆడియో విజయం సాధించడంతో 'పాఠశాల' చిత్రవిజయంపై నమ్మకాలు పెరిగాయని ఆయన చెప్పారు. డాన్స్ డైరక్టర్ అయిన ఈయన ఈ సినిమాతో నిర్మాతగా మారారు. మరాఠి దర్శకుడు మిలింద్ యూకె ఈ సినిమాకి దర్శకుడు. నానా పాటేకర్, సునీల్ శెట్టి, సౌరవ్ శుక్లా తదితరులు నటించిన 'పాఠశాల' చిత్రం త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu