»   » బీచ్ లో ఇలా చిందులేసారేంటీ.... వైరల్ గా మారిన పరిణీతి వీడియో

బీచ్ లో ఇలా చిందులేసారేంటీ.... వైరల్ గా మారిన పరిణీతి వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూలుగా నే బీచ్లో బాలీవుడ్ నటులు కనిపిస్తేనే ఆసక్తిగా చూస్తారు బాలీవుడ్ జనం ఇక పరిణీతి చోప్రా లాంటి హాట్ గర్ల్, తో కలిసి ఆయుష్మాన్ లాంటి యువ నటుడు కనిపిస్తే..., అంతటితో ఆగకుండా పాటకి డాన్స్ కూడా వేస్తే ఇంకెలా ఉంటుంది. . అదే మరి అక్కడున్న జనాలకే కాదు వీరిద్దరూ బీచ్ లో వేసిన చిందులకి నెట్ లో ఆ వీడియో చూసిన జనం కూడా స్టెప్పులేసేస్తున్నారు. ఏ సినిమా కోసమే కానీ ఈ జంట సముద్ర తీరంలో సరదాగా స్టెప్పులు వేశారు.

"గజబ్ కా హై దిన్" అనే మోస్ట్ బ్యూటీఫుల్ సాంగ్ కు ఎలాంటి రిహార్సల్ లేకుండా సహజంగా డ్యాన్స్ చేశారు వీరిద్దరూ. అసలే సముద్రం ఒడ్డు పైగా అనుకోకుండా అద్భుతంగా కలిసిన స్టెప్పులు ఈ వీడియోకు సహజ అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ వీడియో చూసిన వారు... టేక్ లు కట్ లూ లేకుండా దీన్నే సినిమాకోసం రికార్డ్ చేస్తే సరిపోతుంది కదా అనే కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఆయుష్మాన్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు.ఇక అక్కడినుంచీ మొదలయ్యింది తుఫాను ఓకరూ ఇద్దరు కాదు ఏకంగా లక్షలమంది చూసేసారు ఈ వీడియోని.

అయితే ఈ "గజబ్ కా హై దిన్" పాటకు "కయామత్ కయామత్ తక్" సినిమాలో ఆమీర్ ఖాన్ జుహీ చావ్లా జోడీ సూపర్ గా నర్తించగా... ఇప్పుడు వారిని మరిపించేలా వారికి ఏమాత్రం తగ్గకుండా ఆయుష్మాన్ - పరిణీతి స్టెప్పులు వేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆయుష్మాన్ పరిణీతి జోడీగా "మేరీ ప్యారీ బిందు" సినిమాలో నటిస్తున్నారు. హర్రర్ నవలా రచయితగా ఆయుష్మాన్ నటిస్తున్న ఈ సినిమా 2017 లో విడుదల కానుంది. ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తోంది.

English summary
When Ayushmann Khurrana and Parineeti Chopra gave an impromptu performance on Marine Drive.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu