twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదాస్పద 'అయ్యారే' సెన్సార్ కట్స్ ఇవా?

    By Srikanya
    |

    మొన్నామధ్యన విడుదలైన రాజేంద్రప్రసాద్ చిత్రం 'అయ్యారే' సెన్సార్ వద్ద పెద్ద యుద్దం చేసిన సంగతి తెలిసిందే. చివరకి అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' ఈ చిత్రాన్ని చూసి 6 కట్స్‌తో 'యుఎ' సర్టిఫికెట్‌ని 30-12-2011న జారీ చేసింది. మరి ఇంతకీ ఆ కట్స్ ఏమున్నాయి అంటే...

    1. సినిమాలో ఎక్కడ, ఎప్పుడు స్వామిజీ ఫోటో చూపినా దాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.
    2. 'కృష్ణా కృష్ణా...' పాటలో రాహుల్‌గాంధీ హక్కు రోశయ్య లక్కు' వాక్యాన్ని తొలగించారు.
    3. సినిమాలో 'నీ యబ్బ', 'నీ యమ్మ', 'నా కొడకా', 'కేడి నా కొడకా', 'బొక్క' పదాలు ఎక్కడ వున్నా వాటిని తొలగించారు.
    4. 'కింగ్‌ ఫిషర్‌, రాయల్‌ ఛాలెంజ్‌, బ్లెండర్స్‌ ప్రైడ్‌' వంటి మద్యం బ్రాండ్లకి సంబంధించిన బాటిల్స్‌, వాటి నేపథ్యానికి సంబంధించిన దృశ్యాలు సినిమాలోంచి తొలగించారు.
    5. తొమ్మిది, పది రీళ్లలో గల ''నీ దగ్గరికి వచ్చే 'విపి' గాళ్లకి 'విఐపి' గాళ్లకి'' అనే వాక్యంలోని 'విపి' కత్తెర పాలయింది.
    6. పదకొండు, పన్నెండు రీళ్లలోని ''క్రిమినల్‌ బ్రెయిన్‌తో పోలీస్‌ ప్లాన్‌'' అనే వాక్యంలోని 'పోలీస్‌' మాటను తొలగించారు.

    రాజేంద్రప్రసాద్‌, శివాజీ, అనీషాసింగ్‌, సాయికుమార్‌, శివప్రసాద్‌, అదితి అగర్వాల్‌, ఎం.ఎస్‌. నారాయణ, అలీ, వేణుమాధవ్‌ నటించిన చిత్రం 'అయ్యారే'. ప్రీతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన బి. సుధాకర్‌బాబు, రంగన అచ్చప్ప నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు సాగర్‌ చంద్ర. 3633.62 మీటర్ల నిడివిగల 'అయ్యారే' చిత్రం 20-1-2012న విడుదలైంది.

    English summary
    Rajendra Prasad’s film Ayyare struggled to get a censor certificate for its content. Finally film has received U/A certificate and relesed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X