For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'బాద్‌షా' అంతా ఏకపక్షమే : శ్రీను వైట్ల

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం యాక్షన్ సీన్స్ హైదరాబాద్ లో తీస్తున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దర్శకుడు శ్రీను వైట్ల చిత్రం గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో... 'చదరంగంలో గెలవాలంటే ఒకే ఒక మార్గం. తెలివైన ఎత్తులు వేయాలి. ప్రత్యర్థి ఎత్తుల్ని కూడా మనమే వేసేస్తే... ఇంకా సులభంగా గెలవొచ్చు. బాద్‌షాతో పెట్టుకొంటే అంతే! అతనితో ఆటైనా, యుద్ధమైనా ఒక వైపు నుంచే. ఎందుకంటే బాద్‌షా డిసైడైతే సంగ్రామం ఏక పక్షమే. ఆ పోరు ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే' అన్నారు.

  కాజల్ హీరోయిన్ గా చేస్తున్న 'బాద్‌షా' ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...' ఎన్టీఆర్‌, కాజల్‌లపై రాజధానిలో కీలక సన్నివేశాల్ని చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నాం...కథాబలం ఉన్న చిత్రమిది. ఎన్టీఆర్‌ పాత్ర, ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకొంటాయి''అన్నారు. గతంలో ఈ చిత్రం విడుదల తేదీ పై ట్విట్టర్ లో గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఆ ట్వీట్ లో... " శ్రీను వైట్ల చిత్రం బాద్షా చిత్రం మార్చి 26 న భారీగా విడుదల అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రం అవుట్ పుట్ విషయమై నేను చాలా ఆనందంగా ఉన్నాను. " అని పోస్ట్ చేసారు.

  'బాద్‌షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ 'బాద్‌షా' ముస్తాబవుతున్నాడు. హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో 'బాద్‌షా' చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్.

  ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ ...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

  English summary
  NTR's upcoming movie 'Baadshah' shooting is currently under progress in Hyderabad. Kajal Agarwal is the leading lady opposite to NTR in 'Baadshah'. Seenu Vailta is directing this action and comedy entertainer while SS Thaman is composing the songs. Bandla Ganesh is producing 'Baadshah' under Sri Parameswara Arts banner and the film is scheduled to be released on March 26, 2013.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more