For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ ‘బాద్ షా’లో కాజల్ తో పాటు ఆమె కూడా...

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారిలో ఒకరు కాజల్ అగర్వాల్ అనే సంగతి తెలిసిందే. మరొకరు రితు వర్మ. రాజపుత్ వంశానికి చెందిన రితు తెలుగులో షార్ట్ ఫిలింలు చూసే వారికి సుపరిచితమే. ఆమె ఈ చిత్రంలో కాజల్ కి కజిన్ గా చేస్తోంది. అలాగే ఆమె ఈ చిత్రంతో పాటు మారుతి నిర్మిస్తున్న రొమాన్స్ చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె తన దృష్టినంతటినీ ఈ రెండు చిత్రాలపైనే పెట్టినట్లు చెప్తోంది. ఆమె బాద్షా గురించి చెపుతూ...నా దగ్గరకి వచ్చిన స్క్రిప్టులన్నిటిలో అది బెస్ట్ అనిపించింది వెంటనే ఓకే చేసాను అంది.

  హైదరాబాద్ లో ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్ అయిన ఈమె తనకు సినిమాలు కంగారుగా ఒప్పుకోవాలనే ఆలోచన లేదు అంది. అలాగే రొమాన్స్ చిత్రం గురించి చెపుతూ ఆమె..నేను ఈ రోజుల్లో చిత్రం చూసాను. ఈ సినిమా పెద్ద హిట్టై వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇక రొమాన్స్ కథ ..యాత్ కి బాగా పడుతుంది అనిపించింది. వారి మనోభావాలకు దగ్గరగా ఉండే పాత్ర నాది. చాలా సన్సిబుల్ ఐడియాతో తెరకెక్కుతోంది అంది. ఈ రెండు చిత్రాలతో తెలుగులో ఆమెకు మంచి బ్రేక్ వచ్చి బిజీ అవుతానని భావిస్తోంది. ఇకఆమె చాలా పొడుగుగా ఉండటం ప్లస్ అని అంటున్నారు. 5.8 ఉండే ఆమె కొందరు హీరోలకు ఇద్దరిగా కూడా అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

  'బాద్ షా'విషయానికి వస్తే... ఈ చిత్రం టీజర్ ఈ నెల 24 న విడుదల కానుంది. ఈ చిత్రం దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆ రోజు విడుదల చేయాలని నిర్మాత గణేష్ బాబు నిర్ణయించుకున్నారు. శ్రీను వైట్ల కెరీర్ లో భారీ బడ్జెట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని,గబ్బర్ సింగ్ లా ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని గణేష్ సైతం ఎంత ఖర్చైనా ఫరావలేదన్నట్లు ముందుకు వెళ్ళుతున్నట్లు సమాచారం. ఈ టీజర్ రిలీజ్ విషయాన్ని రచయిత గోపీ మోహన్ ట్వీట్ ద్వారా తెలియచేసారు. ఆ ట్వీట్ లో...సెప్టెంబర్ 24,మా ఫేవరెట్ డైరక్టర్ శ్రీను వైట్ల పుట్టిన రోజు. ఆ రోజు, మా నిర్మాత బండ్ల గణేష్ గారు 'బాద్ షా'టీజర్ రిలీజ్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసారు.

  జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

  English summary
  The beautiful Rajput, Ritu is in NTR’s Badshah as Kajal’s cousin and she is the heroine in Maruti’s Romance. The engineering graduate from Hyderabad is in no hurry to sign movies though; right now she wants to concentrate on Romance and will think of listening to scripts only after its release. “I saw Ee Rojullo, it had a box office run of 100 days and it was a fun film. I heard this story too and I felt that doing something that relates to the youth is a far more sensible idea. I said okay to Badshah because at that point of time amongst all the offers I got, that was the best.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X