»   » బాహుబలి2 చూస్తూ పట్టుబడ్డ గజదొంగ.. పదేళ్లుగా దొరకని మోస్ట్ వాంటెడ్.. థ్యాంక్యూ రాజమౌళి..

బాహుబలి2 చూస్తూ పట్టుబడ్డ గజదొంగ.. పదేళ్లుగా దొరకని మోస్ట్ వాంటెడ్.. థ్యాంక్యూ రాజమౌళి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొన్న బాహుబలి2 సినిమాను చూడ కూడదని ఎవరనుకొంటారు చెప్పండి. బాహుబలి సినిమాపై ఉన్న ఆసక్తి ఓ గజదొంగను కటకటాల వెనక్కి నెట్టింది. తాజా సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకొన్నది. కొన్ని సంవత్సరాలుగా దొరకకుండా తప్పించుకొంటున్న ఏటీఎం దొంగను బాహుబలి2 సినిమా చూస్తుండగా పోలీసులు థియేటర్లో చాకచక్యంగా పట్టుకొన్నారు. బాహుబలి2 సినిమాకు అన్నివర్గాల నుంచి ఆదరణ లభిస్తున్నదనడానికి ఈ ఘటన ఓ మచ్చు తునక అని చెప్పవచ్చు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సంభవ్ ఆచార్య ఏటీఎంలను పగలగొట్టి దోచుకోవడంలో నెంబర్ వన్ నేరస్థుడు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా బలిచంద్రపూర్ ప్రాంతానికి చెందిన వాడు. దాదాపు 50కిపైగా ఏటీఎంలను దోచుకొన్న నేర చరిత్ర అతనిపై ఉంది. సాంబశివపై పలు కేసులు నమోదైనాయి. అయితే పోలీసులకు చిక్కకుండా కొన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నాడు.


. 50పైగా కేసులు..

. 50పైగా కేసులు..

ఏటీఎంలను పగులగొట్టి నగదు దోచుకుపోయిన ఘటనలో 2007లో భువనేశ్వర్‌లో కేసు నమోదైంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి నేర చరిత్ర ఉన్న సంభవ్ సోమవారం భువనేశ్వర్‌లోని సినిమా కాంప్లెక్స్‌లో బాహుబలి2 సినిమా చూస్తుండగా అదుపులోకి తీసుకొన్నాం అని భువనేశ్వర్ డీసీపీ సత్యబ్రత భోయ్ మీడియాకు తెలిపారు.


బాహుబలి2 థియేటర్లో..

బాహుబలి2 థియేటర్లో..

కరుడగట్టిన నేరస్థుడి అరెస్ట్ కారణమైన బాహుబలి2 సినిమాపైనా ఒడిశా పోలీసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సవాల్‌గా మారిన సంభవ్ బాహుబలి సినిమా థియేటర్లో దొరకడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


 కనకవర్షం కురిపిస్తున్న బాహుబలి2

కనకవర్షం కురిపిస్తున్న బాహుబలి2

ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి2 సినిమా రిలీజైన ప్రతీ చోట కనక వర్షం కురిపిస్తున్నది. గత మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లను సాధించింది. భారత దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో రికార్డులను బ్రేక్ చేస్తున్నది. దేశంలో తొలిసారి రూ.1000 కోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.English summary
Most wanted ATM looter Sambhav Acharya was arrested in Bhubaneshwar while he was at a theatre happily watching Baahubali 2: The Conclusion. Sambhav Acharya, a resident of Jajpur district's Balichandrapur area, is reportedly accused of being involved in more than 50 cases of looting money from ATMs. "A case was registered against him at Capital Police Station here in 2007 besides a few other cases at various police stations in the state. Our special squad arrested him from a cinema complex today (Monday)," said Bhubaneswar Deputy Commissioner of Police Satyabrata Bhoi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu