»   » 9500 థియేటర్లలో బాహుబలి2.. పెరుగుతున్న ఉత్కంఠ.. కనివినీ ఎరుగని విధంగా విశేషాలు..

9500 థియేటర్లలో బాహుబలి2.. పెరుగుతున్న ఉత్కంఠ.. కనివినీ ఎరుగని విధంగా విశేషాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది బాహబలి ది కన్‌క్లూజన్‌పై ఉత్కంఠ పెరుగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా, కనీ విని ఎరుగని లెక్కన తెలుగు చిత్రమైన బాహుబలి2 ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బాహుబలి2 చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 28) రోజున విడుదలకు సిద్ధమవుతున్నది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా..

ప్రాథమిక సమాచారం ప్రకారం బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 వేల థియేటర్లలో రిలీజ్ కానున్నది. దేశంలో దాదాపు 6500 థియేటర్లలో విడుదల అవుతుండగా అమెరికాలో 1100 థియేటర్లలో రిలీజ్ కానున్నది. మిగితా దేశాల్లో మొత్తం 1400 థియేటర్లలో ప్రదర్శించే చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.


తొలివారంలోనే కనక వర్షం

తొలివారంలోనే కనక వర్షం

అత్యంత ప్రతిష్థాత్మకంగా తెరకెక్కిన బాహుబలి2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలివారమే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిసే అవకాశముందనే అభిప్రాయం ట్రేడ్ అనలిస్టుల నుంచి వ్యక్తమవుతున్నది. దేశ చరిత్రలోనే తొలిసారి బాహుబలి2 చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.


ఐమాక్స్ ఫార్మాట్‌లో..

ఐమాక్స్ ఫార్మాట్‌లో..

బాహుబలి2 సాంకేతికంగా మరో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిన మూడో చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది. అమెరికాలో 40 ఐమాక్స్ స్క్రీన్లలో విడుదల అవుతున్నది. ఇంకా ఐమాక్స్ థియేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.


కేరళలో భారీ క్రేజ్

కేరళలో భారీ క్రేజ్

దక్షిణాదిలో బాహుబలి2 చిత్రంపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేరళలో ప్రధానంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కేరళలో తొలిరోజు రూ.5 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలోను అదే పరిస్థితి కనిపిస్తున్నది.English summary
SS Rajamouli’s highly anticipated magnum opus Baahubali 2 will have the biggest release ever for an Indian film when it will hit the screens in nearly 9000 screens worldwide on Friday. Going by industry sources, the film releases in around 6500 screens in India. In USA, a key market for Telugu films, the second part in Baahubali franchise will open in 1100 screens. In rest of the world, the film will release in 1400 screens.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu