»   » హఠాత్తుగా ఈ రోజే 'బాహుబలి-2' మీడియా సమావేశం, అదే కారణం ?

హఠాత్తుగా ఈ రోజే 'బాహుబలి-2' మీడియా సమావేశం, అదే కారణం ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి-ప్రభాస్‌ కాంబినేషన్ లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ చిత్రం నిర్మాతలు ఈ రోజు దర్శక,నిర్మాతలు, హీరోలతో కలిసి ప్రెస్ మీట్ ని ఈ రోజు పెడుతున్నారు. ఈ రోజు సాయింత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న బాహుబలి టీమ్ హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టడం వెనక కారణమేమిటనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.


అందుతున్న సమాచారం ప్రకారం...యూనిట్ సభ్యులంతా పాల్గొనే ఈ సమావేశంలో బాహుబలి 2 పోగ్రెస్ ఏమిటి, ఇప్పటివరకూ ఏం షూటింగ్ జరిగిందనే విషయమై క్లారిటీ ఇస్తారు. పాటలు మినహా షూటింగ్ పూర్తైన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.


అలాగే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా టీజర్ల రిలీజ్ చేయబోతున్నారనే విషయం చెప్పి , ప్రిపేర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎప్పుడు ఏయో టీజర్స్, ఫస్ట్ లుక్ లు వస్తాయో మీడియాకు క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.


 Baahubali 2 press meet all of a sudden? Reason?

అలాగే త్వరలో విడుదల చేయబోయే బాహుబలి కామిక్స్, టాయ్స్ గురించి సైతం ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు చెప్పనున్నారు. తమ సినిమా పబ్లిసిటీ ని ఏ విధంగా చెయ్యబోతున్నారో హింట్ ఇవ్వబోతున్నారు.


వీటితో పాటు బాహుబలిలో కొత్తగా వచ్చిన పాత్రలు, అవి చేయబోతున్న ఆర్టిస్టు లు గురించి చెప్పే అవకాసం ఉంది. ఇంతేకాదు బయిట వాట్సప్, ఫేస్ బుక్ లలో బాహుబలి కథ ఇదే అంటూ ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. దానిపై రాజమౌళి ఖండనతో కూడిన వివరణ ఇస్తారని చెప్తున్నారు.

English summary
Baahubali makers have informed the press that they are coming up with a press meet today evening in Hyderabad. At 6.30 PM on Friday, Rajamouli and his actors Prabhas and Rana will meet the press.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu