»   » ప్రభాస్ శరీరంపై తీవ్ర గాయాలు.. బాహుబలి పోరాటాల ఫలితం.. తీపి గుర్తులతోపాటు..

ప్రభాస్ శరీరంపై తీవ్ర గాయాలు.. బాహుబలి పోరాటాల ఫలితం.. తీపి గుర్తులతోపాటు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఊహించని రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రం హీరో ప్రభాస్‌కు తీపి జ్క్షాపకాలనే కాకుండా కొన్ని బాధలను కూడా మిగిల్చింది. బాహుబలి షూటింగ్‌లో యుద్ధ పోరాటాల సందర్భంగా ప్రభాస్ తగిలిన గాయాల ఇంకా వెంటాడుతున్నాయట. ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

భయంకరమైన యుద్ధ..

భయంకరమైన యుద్ధ..

బాహుబలి చిత్రం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ పోరాట దృశ్యాలలో పాల్గొన్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 5 ఏండ్లు శరీరకంగాను, మానసికంగాను అనేక రకాలుగా కష్టపడ్డాడు. షూటింగ్ సందర్భంగా తగిలిన రెండు గాయాల మరకలు శరీరంపై ఇంకా మిగిలిపోయాయట. శరీరంపై ప్రస్తుతం ఉన్న గాయలన్నీ భయంకరమైన యుద్ధ పోరాటల్లో తగిలినవేనని ఇటీవల ప్రభాస్ మీడియాకు వెల్లడించారు.

షూటింగ్‌లో తీవ్ర గాయాలు..

షూటింగ్‌లో తీవ్ర గాయాలు..

మిర్చి ఘన విజయం తర్వాత దాదాపు 600 రోజులు ప్రభాస్ బాహుబలికే అంతకి మయ్యాడు. బాహుబలిలో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఆ ఫైట్స్ కోసం ఎన్ని గాయాలైన ఓర్చుకొని షూటింగ్ సిద్ధమైపోయేవాడట. షూటింగ్‌లో తగిలిన గాయాలకు ఇంట్లో తాపడం పెట్టుకోవడం, లేదా ప్రాథమిక చికిత్స తీసుకొని మరుసటి రోజు షూటింగ్‌కు హాజరయ్యేవాడని తెలిసింది.

షూటింగ్ ఆగిపోవద్దని...

షూటింగ్ ఆగిపోవద్దని...

ఎందుకంటే ప్రతీ రోజు షూటింగ్ కోసం దాదాపు రూ.25 లక్షలకు పైగా ఖర్చు అయ్యేది. ఒకవేళ తన కారణంగా షూటింగ్ ఆగిపోతే అనవసరంగా ఖర్చు నిర్మాతపై పడుతుందనే ఆలోచనతో గాయాలతోనే షూటింగ్ చేయాలని ప్రభాస్ నిర్ణయించుకొనే వాడట.

అన్ని కళ్లు ప్రభాస్ వైపే

అన్ని కళ్లు ప్రభాస్ వైపే

అంతగా కష్టపడ్డాడు కాబట్టే ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు. దేశవ్యాప్తంగా ఎప్పుడూ చూడని కళ్లు ప్రస్తుతం బాహుబలి ప్రభాస్ వైపే చూస్తున్నాయి. దటీజ్ ప్రభాస్ అని అందరూ ప్రశంసిస్తున్నారు.

సాహో ట్రైలర్‌లో..

సాహో ట్రైలర్‌లో..

బాహుబలి తర్వాత ప్రస్తుతం మూడు భాషల్లో రూపొందుతున్న సాహో చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో తీస్తున్న ఈ చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకుడు. హాలీవుడ్ చిత్రానికి దీటుగా సాహోను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 28న బాహుబలి2 సినిమాతో కలిపి ప్రదర్శించనున్నారు.

English summary
Filming for the Baahubali franchise has resulted in Prabhas having two injury marks on his body. The grueling war scenes, resulted in the actor garnering injury marks on his body.Both the parts of Baahubali have extensive war sequences, which resulted in the actor actually getting battle marks on his body. Prabhas dedicated 5 years of his life to the Baahubali, underwent rigorous training to prep for his dual roles, that of Amarendra Baahubali and Shivudu/Mahendra Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu