»   » బాహుబలి2 మరో రికార్డు.. రిలీజ్‌కు ముందే అమెరికాలో..

బాహుబలి2 మరో రికార్డు.. రిలీజ్‌కు ముందే అమెరికాలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేక్షకులందరూ గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్నది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమెరికాలో భారీ కలెక్షన్లను రాబట్టింది. అమెరికాలో ఓ తెలుగు సినిమాకు ఇంత భారీ మొత్తంలో స్పందన రావడం ఇదే మొదటిసారి. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాలను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ప్రతినిధి, అమెరికా పంపిణీదారుడు, ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా వెల్లడించారు. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాలను ట్విట్టర్ ద్వారా తెలిపారు.

యూఎస్‌లో రికార్డు

యూఎస్‌లో రికార్డు

తొలిరోజే అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన భారతీయ చిత్రంగా బాహుబలి2 ఓ రికార్డు నెలకొల్పింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.19 కోట్లు ( 3 మిలియన్ అమెరికా డాలర్లు) వసూలు చేసింది అని రమేశ్ బాలా తెలిపారు. గంటకు రూ.64 లక్షల (100000 డాలర్లు) చొప్పున టికెట్లు అమ్ముడు పోయాయి అని ట్విట్టర్‌లో తెలిపారు.


అత్యధిక షోలు..

అత్యధిక షోలు..

బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9 వేల స్క్రీన్లలో విడుదల అవుతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక షోల ప్రదర్శనలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రతీ రోజు 5 షోలు, ఏపీలో 6 షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


వంద కోట్ల దిశగా..

వంద కోట్ల దిశగా..

అధిక థియేటర్లలో విడుదల కావడం, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం రూ.1000 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.


రిలీజ్‌కు సిద్ధం..

రిలీజ్‌కు సిద్ధం..

బాహుబలి1 చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలిలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్కశెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 28 (శుక్రవారం)న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


English summary
With just a day left for the massive release of Baahubali: The Conclusion, the euphoria is pretty evident on social media. According to a reports Baahubali 2, the advance ticket sales have already eclipsed the highest Indian grossing film (of any language) on opening day. The release further states that they have earned 3 million USD (Rs 19 crore approx) in advance booking. Trade analyst Ramesh Bala took to Twitter to share the details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu