»   » బాలీవుడ్‌లో రాజమౌళి భారీ సినిమా.. సల్మాన్‌ఖాన్ హీరో..

బాలీవుడ్‌లో రాజమౌళి భారీ సినిమా.. సల్మాన్‌ఖాన్ హీరో..

Written By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన దర్శకుడు రాజమౌళి త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కండలవీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఓ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నట్టు సంకేతాలిచ్చారు. 

Rajamouli

బాహుబలి ది రైజ్ ఆఫ్ శివగామి పుస్తకం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌తో సినిమా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

త్వరలోనే బాలీవుడ్ సినిమా

త్వరలోనే బాలీవుడ్ సినిమా

బాలీవుడ్‌‌లో సల్మాన్ సినిమా గురించి వస్తున్న రూమర్ల గురించి రాజమౌళిని మీడియా ప్రశ్నించగా.. తప్పనిసరిగా బాలీవుడ్ సినిమా చేస్తాను. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఆ చిత్రం ఉంటుంది. అందుకోసం ప్లాన్ సిద్ధమవుతున్నది. కథకు అనుగుణంగా సరైన హీరో గురించి చూస్తున్నాం. అయితే హీరో విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఇంకా బాహుబలి మూడ్ నుంచి బయటకు రాలేదు అని రాజమౌళి చెప్పారు.

సల్మాన్ ఖాన్‌కు విజయేంద్రప్రసాద్ కథ..

సల్మాన్ ఖాన్‌కు విజయేంద్రప్రసాద్ కథ..

రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్రప్రసాద్ గతంలో సల్మాన్ నటించిన భజ్‌రంగీ భాయ్‌జాన్ అనే చిత్రానికి కథ అందించారు. ఈ చిత్రం సల్మాన్‌కు భారీ విజయాన్ని అందించింది. 2015లో విడుదలైన ఆ చిత్రం రికార్డు వసూళ్లను సాధించింది.

బాహుబలి రైజ్ ఆఫ్ శివగామి

బాహుబలి రైజ్ ఆఫ్ శివగామి

బాహుబలి ది రైజ్ ఆఫ్ శివగామి అనే పుస్తకం ఇటీవల మార్కెట్లోకి వచ్చింది. ఈ పుస్తకాన్ని రచయిత ఆనంద్ నీలకంఠన్‌తో కలిసి విజయేంద్ర ప్రసాద్ రచించారు. ఈ పుస్తకానికి ప్రాచుర్యం కలిగించేందుకు రాజమౌళి, బాహుబలి యూనిట్ విస్తృతంగా ప్రయత్నాలు చేపట్టింది.

28న బాహుబలి2

28న బాహుబలి2

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొన్న బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైంది. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు నటించారు.

English summary
Baahubali director SS Rajamouli spoke to media about his Bollywood film with Salman Khan. He said, "I definitely want to make a Bollywood film soon. But right now, there's nothing concrete.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu